Latest Updates
-
శ్రావణ మాసం స్పెషల్ హెల్తీ లడ్డు.. పప్పు నానబెట్టే పనే లేదు,పాకం పట్టే శ్రమ లేదు..ఈజీగా చేసుకోండిలా.. -
పాలు విరిగిపోయాయా? అయితే పారబోయకుండా ఈ 5 అద్భుతమైన వంటకాలు చేయండి! -
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి! -
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్!
అందంలో కేశాల ప్రాధాన్యత...జాగ్రత్తలు

1. మన తలను సబ్బుతో కానీ, కుంకుడు కాయతో కానీ తరచుగా వాడుతూ వెంట్రుకలను శుభ్రం చేసుకోవాలి. లేనిచో వెంట్రుకలలో మురికి చేరి పేలు, చుండ్రు వస్తాయి. తలపై పుండ్లు కూడా ఏర్పడతాయి. కనీసం వారానికి ఒకసారి తలస్నానం చేయాలి.
2. ప్రతి రోజూ తలకు నూనె రాసుకొని దువ్వుకోవాలి. తలకు నూనె రాసుకొని దువ్వుకోవటం వల్ల వెంట్రుకలు నల్లగా, అందంగా ఉంటాయి. తలనూనెలోని పోషక పదార్ధాలు వెంట్రుకలు పెరగటానికి, వెంట్రుకలు ఊడి పోకుండా ఉండటానికి ఉపయోగపడతాయి. వేడి కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించి పదినిమిషాలు మర్దనా చేసి ఒక అరగంట తరువాత తలకు స్నానం చేయాలి.
3. వెంట్రుకలు చిక్కుపడకుండా ఉండటానికి రోజూ తల దువ్వుకోవాలి. ఎప్పుడూ కూడా వేరొకరి బ్రష్ లు, దువ్వెనలు వాడకూడదు. తలను దువ్వుకునే బ్రష్ లు, దువ్వెనలు ఎవ్వరిది వారే వాడటం మంచిది. ఒకరి బ్రష్‌లు, దువ్వెనలు మరొకరు వాడటం వల్ల చుండ్రు వస్తుంది.
4. వెంట్రుకలను ఎక్కువ పొడువుగా పెంచరాదు. ఎందుకంటే వెంట్రుకలు ఎక్కువ పొడవుగా ఉంటే వాటిని శుభ్రంగా ఉంచుకోవటం కష్టమవుతుంది. వెంట్రుకలు చిక్కుపడిపోతాయి. కనుక వెంట్రుకలను బాగా పెరిగినప్పుడు కత్తిరించుకోవాలి. ప్రస్తుత కాలంలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాము. తలకు నూనె రాసుకోవటం ఉండదు. తలకు నూనె రాయకుండా ఉంటే ఫ్యాషన్ అని అంటారు. కానీ దానివల్ల చాలా అనర్ధాలు వస్తాయని వారు గుర్తించడం లేదు.
5. సీతాఫలం గింజలను ఎండబెట్టి పొడి చేసి తగినన్ని నీళ్లు కలిపి తలకు పూతలా వేయాలి. రాత్రి తలకు వస్త్రాన్ని చుట్టి పడుకొని మర్నాడు షాంపూతో కడిగేసుకుంటే సరిపోతుంది. దీంతో చుండ్రు సమస్య కూడా నియంత్రణలో ఉంటుంది.



Click it and Unblock the Notifications