Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
హెడ్ మసాజ్ తో చుండ్రుకు గుడ్ బై.....

1. చుండ్రు సమస్యతో ఇబ్బందిపడేవారు కొబ్బరినూనెలో నిమ్మరసం పిండి గోరువెచ్చగా చేసి తలకు బాగా అప్లై చేయాలి. నూనె పట్టించేటప్పుడు మాడుకు బాగా అంటేలా చూడాలి. అరగంట అలాగే ఉంచాక తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.
2. గోరువెచ్చని నూనెతో రాత్రిళ్లు హెడ్ మసాజ్ చేసి, ఉదయాన్నే పెరుగులో మెంతిపొడిని కలిపి తలకు బాగా అప్లై చేసి ఆరాక తలస్నానం చేస్తే చుండ్రుకు గుడ్‌బై చెప్పవచ్చు. వారానికోసారి హెడ్ మసాజ్ చేయించుకుని తలను శుభ్రం చేసుకుంటే పేల సమస్య నుండి దూరంగా ఉండవచ్చు.
3. ఆలివ్ ఆయిల్, బాదం పపðతో తయారు చేసిన నూనెను ఓ పాత్రలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని తలకు మర్దన చేయండి. మర్దన చేసిన ఐదు నిముషాల వరకు ఉంచండి. కాసేపయ్యా క తలలో మంట పడుతుంది. గోరువెచ్చని నీటితో తల శుభ్రంగా చేసుకోండి దీంత చుండ్రు మటుమాయం అవుతుంది.
4. రెండు టీస్పూన్ల తేనెకు మూడు టీస్పూన్ల ఆలివ్‌నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లనుంచి జుట్టుకు బాగా పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు పోతుంది.
5. పచ్చికొబ్బరిని తీసుకుని సన్నగా తురమాలి. తరువాత మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన కొబ్బరి మిశ్రమాన్ని పిండి పాలు తీయాలి. ఆ పాలల్లో రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపాలి. స్నానానికి ముందు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి, వేళ్ళతో నెమ్మదిగా రుద్దినట్లుగా మసాజ్ చేయాలి. ఇలా 15 నిమిషాలపాటు చేసిన తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. క్రమం తప్పకుండా వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చుండ్రు పూర్తిగా మాయమవుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications