Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
తెల్ల జుట్టుకు చక్కటి కండీషనర్ మందారం-టీ...!

ముఖ్యంగా కురుల సంరక్షణలో పరిశుభ్రత అవసం. పరిశుభ్రత పాటించకపోతే కేశాలకు అనేక సమస్యలు చుట్టుముడుతాయి. అందుకే ముందుగా శిరోజాల్ని శుభ్రంగా పెట్టుకోవడం తప్పనిసరి. ఉల్లిపాయ ముక్కలు వేసి మరిగించిన నూనెను తలకు పట్టించి మర్ధన చేసి, అరగంట తర్వాత గంజిని తలకు పట్టించి ారేవరకూ ఉంచాలి. ఆరిన తర్వాత మృదువైన షాంపూతో తలస్నానం చేస్తే రక్త ప్రసరణ జరిగి ఒత్తైన శిరోజాలు సొంతమవుతాయి.
పొడిబారిన జుట్టుకి: దుమ్ము, ధూళి, కాలుష్య ప్రభావంతో కొన్నిసార్లు జుట్టు నిర్జీవంగా మారుతుంది. అలాంటప్పుడు ఆరు మందార ఆకులు, రెండు చెంచాల కలబంద గుజ్జుని మెత్తగా చేసుకొని తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే ఆరోగ్యంగా ఎదుగుతుంది.
కండీషనర్ గా: నిత్యం ప్రయాణాలు చేసేవారు వారానికోసారి కండిషనర్ ను ఉపయోగించడం మేలు. దీనికి టీ పొడి చక్కగా పనిచేస్తుంది. టీ డికాషన్ లో చెంచా మందార పొడి, రెండు చుక్కల నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొన, రెండు చుక్కల బాదం నూనె కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తే సరి. ఇది తెల్లబడిన జుట్టుకి కూడా చక్కగా పనిచేస్తుంది.
చల్లచల్లగా: సూర్యకిరణాలు నేరుగా తాకే ప్రదేశం తల. కాబట్టి అతినీలలోహిత కిరణాల ప్రభావం, అధిక వేడి వల్ల జుట్టు చిట్లపోవడం, రంగుమారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనికి నివారణగా రాత్రి నానబెట్టిన మెంతుల్ని మెత్తగా చేసుకొని దానిలో రెండు చెంచాల చొప్పున మందారపొడి, పుల్లని పెరుగు, చెంచా ఆముదం కలపి తలకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే కురులు కొత్త కాంతిని సంతరిచుకోవడంతో పాటూ ఒత్తుగా పెరుగుతాయి.
తేమ అందేలా: కురులకు తగిన తేమ అవసరం. లేకపోతే కురులు బలహీనంగా తయారువుతాయి. ఇలాంటప్పుడు కొబ్బరి నూనెలో గుప్పెడు చొప్పున మందార పువ్వు రేకులు, తులసి, కరివేపాకు వేసి మరిగించాలి. దీన్ని వారానికోసారి తలకు పట్టించి అరగంట తర్వాత మృదువైన షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు పట్టులా ఉంటుంది.
నల్లగా నిగనిగలాడేలా: వివిధ కారణాల వల్ల కొందరి జుట్టు చిన్న వయసులోనే నెరిసిపోతుంది. ఇలాంటివారికి చక్కని పరిష్కారం మందారంతో లభిస్తుంది. ముందురోజు రాత్రి పెరగులో నాలు చెంచాల మందారపొడి, సరపడేంత గోరింట పొడులను నానబెట్టాలి. ఉదయాన్నే కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా ఇన్ స్టంట్ కాఫీ పొడి కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో రోజులకోసారి చేయడం వల్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.



Click it and Unblock the Notifications
