Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
కాలుష్యం నుండి వెంట్రుకల సంరక్షణ ఎలా...?

1. చర్మం, వెంట్రుకలకు మంచి పోషకాలు అందేలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పదార్థాలు అంటే ఆకుపచ్చని కూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్), తాజా పళ్లు, విటమిన్ ఏ, సీ, ఈ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ రాత్రివేళ కూడా చర్మం, వెంట్రుకలు శుభ్రం అయ్యేలా స్నానం చేయాలి.
2. తప్పకుండా వెంట్రుకలను షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అయితే మరీ ఎక్కువగా వెంట్రుకలను కడగటం కూడా మంచిదికాదు. దీనివల్ల వెంట్రుకలు పొడిబారవచ్చు.
3. కాలుష్యాలు నేరుగా వెంట్రుకలకు తాకకుండా స్కార్ఫ్ కట్టుకోవడం, హ్యాట్ పెట్టుకోవడం చేయాలి.
4. ఒకవేళ చుండ్రు వంటి సమస్య ఉంటే కీటోకెనజాల్ లేదా సైక్లోపిరోగ్సాలమైన్ ఉండే షాంపూలతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి.
5. వెంట్రుక చివర్లు చిట్లిపోకుండా ఉండేలా ప్రతి ఆరువారాలకు ఓమారు జుట్టును ట్రిమ్ చేసుకోవాలి.
6. రంగు వేసుకునేవారైతే అది పడుతోందా లేదా అన్నది పరిశీలించుకోవాలి.
7. గుడ్డు, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ నిమ్మరసం, టేబుల్ స్పూన్ కుంకుడుకాయ రసం, కప్పు హెర్బల్ టీ, ఎసెన్షియల్ ఆయిల్ ఐదు చుక్కలు కలిపి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, వేళ్లతో మాడును వలయాకారంగా రుద్దుతూ, శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు రోజులు ఈ విధంగా చేస్తుంటే జుట్టు పెరుగుతుంది.
8. సమయం దొరికినప్పుడల్లా, లేదా రాత్రి పడుకునేముందు "స్వచ్చమైన, మంచి నువ్వులనూనేతో లేదా కొబ్బరినూనెతో "తల నుండి కుదుళ్ళ వరకు మర్దనా చేయవలెను.



Click it and Unblock the Notifications