Latest Updates
-
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.!
పురుషుల్లో జుట్టురాలడానికి కారణాలు..పరిష్కారం..

జుట్టు రాలడానికి మరొక ప్రధాన కారణం ఒత్తిడి. జుట్టు రాలడానికి ప్రధానంగా శరీర తత్వం, అనారోగ్యం, ఆపరేషన్లు, విటమిన్ల లోపం, థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ల అసమానత, మందుల సైడ్ ఎఫెక్ట్స్ కారణాలుగా ఉంటాయి. సాధారణంగా పురుషుల్లో ఈ సమస్య వంశపారంపర్యంగా వస్తుంది. ఒక వయసు దాటాక పురుషుల్లో స్త్రీల కంటే ఎక్కువగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. కుటుంబంలో ఎవరికైనా బట్టతల ఉంటే అది పురుషులకు వస్తుంది. ఇలాంటి వారికి జుట్టు ఎక్కువగా రాలుతుంది. దీన్నే ‘మ్యాన్ ప్యాటర్నల్ బాల్డ్ నెస్’ అంటారు. పురుషుల్లో ‘ఆండ్రోజన్’ హార్మోన్ ఎక్కువైనా జుట్టు రాలిపోతుంది. ఇది జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. ఇలా రాలిన జుట్టు తిరిగి రావడం కష్టం తరచుగా చుండ్రు, ఫంగల్ ఇన్ ఫెక్షన్ వస్తూ ఉంటే జుట్టు వేగంగా రాలిపోతుంది. ఫలితంగా బట్టతల వచ్చేస్తుంది..
పరిష్కారం: ఈ రోజుల్లో జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య. కొన్ని జాగ్రత్తలతో దీన్నుంచి బయటపడవచ్చు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్లు ఎక్కువగా అవసరం. ఆహారంలో ప్రోటీన్లు తక్కువైతే జుట్టు నిర్జీవంగా మారిపోతుంది. జుట్టుకు ఫర్మింగ్, కలరింగ్ స్టయిలింగ్ తగ్గించాలి. మాటమాటికీ షాంపూలను మార్చకూడదు. తరచుగా మాయిశ్చరైజర్ జుట్టుకు వాడాలి. గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్ చేయాలి. తలస్నానం తర్వాత జుట్టుకు సీరం, కండీషనర్ తప్పక వాడిలి. నూనెతో మసాజ్ చేస్తే శిరోజాలకు నిగారింపు వస్తుంది. ఆహారంలో పాలు, పండ్లు, పచ్చికూరగాయలు, చేపలు తీసుకోవాలి. నీళ్ళను ఎక్కువగా తాగాలి.



Click it and Unblock the Notifications