Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జుట్టు ఒత్తుగా పెరగాలంటే మస్టర్డ్ ఆయిల్ రాయాల్సిందే...!

వీటిలో మెగ్నీషియం , కాల్సియం, మాగనీస్, జింక్, ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్దము ఉంటాయి. ఘాటైన వాసనను కలిగి ఉండే ఆవాలు ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. అరబకెట్ వేడినీళ్లలో చెంచా ఆవాల పొడి వేసి కాళ్లను కొద్దిసేపు ఉంచితే పాదాల నొప్పులు త్వరగా తగ్గుతాయి.
తెల్ల ఆవనూనె చర్మ రంగును మెరుగు పరుస్తుంది. దీన్ని శరీరానికి రాసుకొని, నలుగుపెట్టి స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గి రంగు తేలుతుంది. అలానే కొబ్బరినూనెలో ఆవనూనెను కలిపి శిరోజాలకు రాస్తుంటే ఫలితం ఉంటుంది. ఆవనూనెను శరీరానికి బాగా మర్ధన చేయడం ద్వారా శరీరానికి రక్షణ కల్పిస్తుంది.
ఆవనూనెను తరచూ తలకు రాయడం వల్ల హెయిర్ బాగా పెరగుతాయి. ఆరోగ్యంగానూ ఉంటాయి. జుట్టు తెగిపోకుండా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఆవాలపోడితో జుట్టు కడుక్కూంటే .. జుట్టు రాలడం తగ్గుతుంది. తలలో పేలు తగ్గడానికి ఆవాల నూనే రాసుకోవాలి. మాడు మీద కురుపులు, దురదలను ఆవ నూనె భాగా తగ్గిస్తుంది.
ఒక టీ స్పూన్ తేనె, మరో టీస్పూన్ ఆలీవ్ ఆయిల్, ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపిన మిశ్రమంలో కోడిగుడ్డులోని తెల్లసొనని వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి, కుదుళ్లకు బాగా పట్టించాలి. అలాగే 20 నిమిషాలు ఉంచిన తరువాత తలస్నానం చేయాలి.
ఒక కప్పు కొబ్బరి నూనె, ఒక కప్పు ఆవాల నూనె కలపాలి. ఈ మిశ్రమంలో ఒక కప్పు కరివేపాకుల్ని వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి చిన్న మంటపై వేడి చేయాలి. కరివేపాకు కాస్త వేగగానే నూనెలోంచి తీసి, మూడు కర్పూరం బిళ్లలు వేయాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని జుట్టుకు, కుదుళ్లకు బాగా పట్టించి, ఓ రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు తలస్నానం చేస్తే సరి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఆవానూనెను తలకు రాయాలంటే ముందు తలపొడిగా ఉంచుకోవాలి. తర్వాత ఆవనూనెను తలకు బాగా మర్థన చేయాలి. చేసిన తర్వాత తలకు షవర్ క్యాప్ ను పెట్టుకొని మూడు నాలుగు గంటల పాటు అలాగే ఉంచేసుకోవాలి. (ఇలా ఉండాలంటే మీరు తప్పకుండా ఇంట్లో సమయం ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా ట్రై చేయాలి). తర్వాత మీ పద్దతిలోనే షాంపూతో తలస్నానం చేసి కండీషనర్ ను అప్లై చేసుకోవాలి.



Click it and Unblock the Notifications