Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
కురులు దట్టంగా.. స్ట్రెయిట్ గా పెరగాలంటే ఇలా విశ్రాంతి కలిగించండి...!
సాధారణంగా మనం రోజూ ఎంతో మందిని చూస్తుంటాం. ఒక్కొక్కరు ఒక్కో విధమైన హెయిర్ స్టౌల్ ను మెయింటైన్ చేస్తుంటారు. కొందరికి కర్లీ హెయిర్ వుంటే మరి కొందరికి స్ట్రెయిట్ హెయిర్ వుంటుంది. తమ సహజసిద్ధమైన కేశాలను ఇష్టపడేవారూ ఉన్నారు. అలా కాకుండా నిటారుగా ఉన్న జుట్టును వంకీలు తిప్పించుకునేవారు, నొక్కులుగా ఉన్న కురులను తిన్నగా మార్చుకునేవారూ ఉన్నారు. అయితే ఇప్పుడు అమ్మాయిల్లో ఎక్కువగా స్ట్రైయిటనింగ్ హెయిర్ స్టైల్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. స్ట్రెయిట్ హెయిర్ చేయించుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

హెయిర్ ప్రొసీజర్స్ ఏమైనా చేయించుకున్నప్పుడు అంటే పెర్మింగ్, స్ట్రెయిటెనింగ్ వంటి వాటి వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. ఫలితంగా వెంట్రుకలు పొడిబారిపోయి, నిస్తేజంగా, నిర్జీవంగా మారిపోతాయి. కొన్ని సందర్భాలలో చివర్లు చిట్లిపోవడం, కుదుళ్లు పూర్తిగా దెబ్బతినడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి వీలయినంతవరకు మీ జుట్టు స్వతస్సిద్ధంగా ఎలా ఉంటుందో అలానే ఉంచుకోవడం మంచిది. మంచి హెయిర్ ఆయిల్‌ను జుట్టు కుదుళ్లకు పట్టేటట్లు సున్నితంగా మసాజ్‌చేసి, ఆ తర్వాత కండిషనర్ ఉన్న షాంపూతో తలంటు పోసుకుని గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయడం లేదా తలస్నానం తర్వాత తలకు కండిషనింగ్ అప్లై చేయడం వల్ల కురులు కాంతివంతంగా సున్నితంగా, నైస్ గా కనబడుతాయి.
బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేలరూపాయలు కర్చుపెట్టి కృత్రిమ పద్దతులతో స్ట్రైయిట్ హెయిర్ చేయించుకొని సమస్యలు కొని తెచ్చుకోవడం కంటే ఇంట్లో సహజసిద్దంగా లభించే వాటితో స్ట్రైయిట్ హెయిర్ కోసం ప్రయత్నించవచ్చు. వివిధ రకాలైనటువంటి హెయిర్ స్టైల్, సిల్కీ హెయిర్ కోసం ఇంట్లో తయారు చేసుకొనే కొన్ని సహజ పద్దతులు మీకోసం....
క్యాస్ట్రో ఆయిల్(ఆముదము)తో మసాజ్: కురులు చిందరవందగా తయారైన, పొడిబారిన జుట్టు కలిగిన వారికి ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఆయిల్ తో హెయిర్ థెరపీ చేసుకొంటే కేశాలు రిలాక్స్ అవుతాయి. ఆముదమును తీసుకొని తల మాడుకు బాగా పట్టించాలి. అలాగే కురులు ఎంత పొడవున్నా సరే కురుల మొత్తానికి ఆ ఆయిల్ ను అప్లై చేసి మునివేళ్ళతో తలను మసాజ్ చేసుకోవాలి. దాంతో తలలోని కండరాలకు విశ్రాంతి కలిగి రక్త ప్రసరణ బాగా జరిగి కురులు దట్టంగా పెరగడానికి సహకరించడమే కాకుండా, ఎటువంటి జుట్టైనా సరి నిటారుగా ఉండేలా చేస్తుంది. మీకు స్ట్రెయిట్ హెయిర్ చేసుకొవడం ఇష్టం వున్నట్లైతే ఇలా వారానికి కనీసం రెండు సార్లు ఆయిల్ థెరపీ మసాజ్ ను చేసుకొంటే తప్పకుండా ఫలితం ఉంటుంది.
కోకోనట్ మిల్క్ అండ్ లెమన్: ఒక బౌల్ తీసుకొని అందులో కొబ్బరి పాలు, నిమ్మరసం సమభాగాల్లో తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు, కేశాలకు బాగా పట్టించి, వేడినీళ్ళలో ముంచిన టవల్ ను తలకు చుట్టుకోవాలి. ఇలా ఒక గంట ఉండనిచ్చి తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా వారానికి ఒక మూడు సార్లు తప్పనిసరిగా చేస్తుంటే మీరు కోరుకున్న జుట్టు మీకు నచ్చే ఆకారంలో ఉంటాయి.
పచ్చిపాలు: మీరు మీ కేశాలకు విశ్రాంతిని కలిగించాలనుకుంటే ఈ మసాజ్ చాలా బాగా పనిచేస్తుంది. ఒక బౌలం తీసుకొని అందులో పాలు, నీళ్ళు సమబాగాల్లో తీసుకొని మిక్స్ చేసి తలకు మొదళ్ళ నుంచి పట్టించాలి. లేదా స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసిన తర్వాత దువ్వెనతో కురులను దువ్వినట్లైతే పాలు కురు మొత్తానికి అంటి కురులు మందంగా ఒకదానికొకటి అంటిపెట్టుకొని ఉంటాయి. అలాగే పదిహేను నిమిషాలు వుంచి తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇది ఒక మంచి హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల మళ్ళీ మీరు తలస్నానం చేసే వరకూ హెయిర్ స్ట్రెయింట్ గా ఉండేలా చేస్తుంది.
ఆలివ్ ఆయిల్ మరియు గుడ్డు: ఈ హెయిర్ థెరఫీ మాస్క్ వేయడం చాలా అరుదు. అయితే ప్రతిఫలం మాత్రం మెండుగా ఉంటుంది. ఇది ముఖ్యంగా మీ జుట్టును నిటారుగా ఉండేట్లు చేయడమే కాకుండా కురులకు విశ్రాంతిని కలిగిస్తుంది. ఒక బౌల్లో వంద గ్రాముల ఆలివ్ ఆయిల్ తీసుకొని అందులో రెండు గుడ్లను పగులగొట్టి తెల్లని పదార్థాన్ని మాత్రమే అందులో వేసుకొని బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. పట్టించిన ఇరవై నిమిషాల వరకూ అలాగే ఉంచి, ఆ తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేసుకోవాలి. గుడ్డును కలపడం వల్ల కేశాలు ఒకలాంటి వాసన కలిగి ఉంటాయి. అలా జరగకుండా కురులను విడదీసి నీరు ఫోర్స్ గా పోసి శుభ్రం చేసుకోవాలి.
ఇలా నేచ్యురల్ పద్దతులను ఉపయోగించి మీ హెయిర్ ను స్ట్రెయింట్ గా మార్చుకోవచ్చు. మరీ ప్రయత్నించి చూడండి....



Click it and Unblock the Notifications
