Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
అపరిపక్వ దశలో జుట్టు తెల్లబడటానికి గల 10 కారణాలు
ఏ స్త్రీకైనా మరియు పురుషులకైనా అపరిపక్వత దశలో జుట్టు తెల్లబడటం అనేది పీడకల లాగానే ఉంటుంది. ఇలా జరగటానికి గల కారణమేమిటో తెలుసుకుంటే, అలా జరగకుండా నిరోధించావొచ్చు. కావున మీరు అపరిపక్వ దశలో జుట్టు తెల్లబడటానికి గల 10 కారణాలను చదవండి మరియు ఇలా జరగకుండా జాగ్రత్తలు పాటించండి.

చెడు ఆహార అలవాట్లు
పోషకాలు సమృద్ధిగా ఉన్నసమతుల్య ఆహారం తీసుకోకపోవటం మీ ఆరోగ్యానికి మరియు మీ జుట్టుకు కూడా హాని కలుగుతుంది. చెడు ఆహారపు అలవాట్ల వలన మీరు అనేకరకాల వ్యాధుల చేత పీడింపబడతారు. దీనివలన మీ శరీరం, దంతాలు మరియు జుట్టు ప్రభావితం అవుతాయి.

విటమిన్ బి 12 దీర్ఘకాల లోపం: ముఖ్యంగా విటమిన్ బి 12 లోపం అపరిపక్వ దశలో జుట్టు తెల్లబడటానికి కారణమవుతున్నది. కావున మీ ఆహారంలో తగినంత విటమిన్ బి 12 ఉండేట్లుగా చూసుకోండి.

థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పని చేయకపోవటం: థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పని చేయక పోవటం వలన థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి సమస్యలు ఏర్పడటం వలన అపరిపక్వ దశలో జుట్టు తెల్లబడటం జరుగుతుంది. థైరాయిడ్ గ్రంధి పనిచేయకపోవడం మహిళల్లో సర్వసాధారణమైన విషయం. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే మీరు థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవటం మంచిది. మీరు సరైన మందులు మరియు చికిత్స తీసుకుంటే దీనిని నివారించవొచ్చు.

పియూష గ్రంధి లో సమస్యలు: కొన్నిసార్లు థైరాయిడ్ గ్రంధి సరిగా పనిచేయక పోవటం కారణంగా పీయూష గ్రంథిలో సమస్యలు ఏర్పడతాయి. అందువలన పిట్యుటరీ గ్రంధి కూడా పరోక్షంగా అపరిపక్వ దశలో జుట్టు తెల్లబడటానికి దోహదపడుతుంది.

దీర్ఘకాల మరియు అధిక ధూమపానం: మనందరికీ తెలుసు ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని, కాని మీ జుట్టుకు కూడా హానికరం. ధూమపానం, ఈ అపరిపక్వ దశలో జుట్టు తెల్లబడటానికి ఒక కారణం. 'ఘోరమైన' పొగ నుండి దూరంగా ఉండండి.

కాలుష్యం: అందరికి పర్యావరణ కాలుష్యం చర్మానికి హాని చేస్తుందని తెలుసు, కాని అది జుట్టుకు చాలా హాని చేస్తుందని ఎవరికి తెఇయదు. ఈ పర్యావరణ కాలుష్యం మీ చర్మానికన్నా జుట్టుకు చేసే హాని ఎక్కువ.

జుట్టు సంరక్షణ ఉత్పత్తులను అధికంగా ఉపయోగించటం: మీ జుట్టు అపరిపక్వ దశలో తెల్లబడటానికి జుట్టు సంరక్షణ ఉత్పత్తులను అధికంగా ఉపయోగించటం ఒక కారణం. మీ జుట్టుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ (ఉదాహరణకు రంగు రంగులు కోసం, జుట్టు బ్లీచింగ్ ఉత్పత్తులను, కొన్ని షామ్పూస్ మరియు కండిషనర్లు) కలిగిన ఉత్పత్తులను వాడటం మంచిది కాదు. ఏదైనా ఎక్కువగా వాడటం చెరుపు చేస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి కొన్నిటిని నియంత్రించండి మరియు సాధ్యమైనంతవరకు సహజంగా ఉండండి.

ఒత్తిడి: మీరు ఒత్తిడికి మరియు ఎల్లప్పుడూ ఆందోళనకు గురవుతున్నారా? మీరు దీర్ఘకాలిక మరియు భయంకరమైన ఒత్తిడితో కూడిన జీవితంతో బాధ పడుతున్నారా? ఇటువంటి జీవిత విధానం వలన మీ జుట్టు ప్రభావితం అవుతున్నది. అందువలన ఒక మాత్ర తీసుకుని విశ్రాంతిగా ఉండండి.

దంతాలు తెల్లబరిచే ఉత్పత్తులను అధికంగా ఉపయోగించటం: దంతాలు తెల్లబరిచే ఉత్పత్తులలో అధికంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది. దీనిని ఎక్కువగా వాడటం వలన జుట్టు తెల్లబడుతుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ మీ శరీరంలో ఎక్కువగా ఉండటం వలన, మీ జుట్టుకు రంగు ఇచ్చే ఎంజైమ్ల మీద ప్రతికూల ప్రభావాన్నిచూపుతుంది. కావున మీరు ఏ ఉత్పత్తిని వాడేముందు డాక్టర్/దంతవైద్యుడిని సంప్రదించండి.

మీ జన్యువుల అమరిక: చివరిగా జన్యువులను కారణంగా తీసుకోవొచ్చు మరియు దీని గురించి మీరు చేయగలిగేది ఏమి లేదు. కొంతమందికి ఈ అపరిపక్వ దశలో జుట్టు తెల్లబడటం అనేది జన్యుపరంగా ఏర్పడవొచ్చు.



Click it and Unblock the Notifications











