Latest Updates
-
కేవలం 20 నిమిషాల్లో కమ్మని వంకాయ రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
మగాళ్లను చంపి ఎలా తప్పించుకోవాలి..? మెట్రోలో మహిళ చేసిన షాకింగ్ పని.. వైరల్ వీడియో.! -
బ్లాక్ క్యాట్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి?..మీ పార్టనర్ కు ఈ లక్షణాలు ఉన్నాయా? -
బాత్రూమ్లో దుర్వాసన.. సువాసన వెదజల్లే ఫ్రెషనర్స్ ఇంట్లోనే 5 నిమిషాల్లో రెడీ.! -
వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి.! -
కండరాల బలానికి, రోజంతా ఎనర్జీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..10 నిమిషాల్లో ఎగ్ అవకాడో ఖాఖ్రా చాట్ చేయండిలా.. -
మీ స్నేహితుల్లో ఈ 4 లక్షణాలు ఉంటే వెంటనే దూరం పెట్టండి! -
ఆకలి తీరాలి, బరువు పెరగకూడదు..అయితే డిన్నర్ కి ఇది బెస్ట్ చాయిస్..10 నిమిషాల్లోనే చేసేయండిలా! -
బానిసత్వం పోయింది బాస్: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగి..మేనేజర్ ప్రశ్నకు జెన్ జీ ఉద్యోగి దిమ్మతిరిగే కౌంటర్ -
పప్పులు నానబెట్టే పనే లేదు.. అప్పటికప్పుడు అచ్చం పునుగుల్లా ఉండే మినీ రైస్ బోండా చేసుకోండిలా..
మీ జుట్టు వేగంగా, పొడవుగా పెరగాలంటే?10 టిప్స్
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవాటి జుట్టు కలిగి ఉండావలని ప్రతి అమ్మాయి డ్రీమ్. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఈ కలను నెరవేర్చుకోగలరు. ఎందుకంటే, జుట్టు వేగంగా, మరియు మందంగా పెంచుకోవాలంటే అందుకు చాలా ప్రయత్నం చేయాలి.
జుట్టు పెరుగుదల దాని సొంత సమూహాన్ని కలిగి ఉంటుంది. కేశాలకు సరైన పోషణ(తలకు తరచూ నూనె పెట్టడం, కండీషన్, షాంపు, డైటై) అంధించడం ద్వారా జుట్టు వేగంగా పెరుగుతుందని మనందరికీ తెలుసు. అందుకు మనం చాలా స్టెప్స్ ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీ బిజీ షెడ్యూల్లో, జుట్టు పెరుగుదలకు ఇవన్నీ చేయాల్సంటే కొద్దిగా అగ్ని పరీక్షవంటిదే. అయితే, పాత ఫ్యాషన్ కృషి లేకుండా నిజంగా ఏదీ జరగదు. ఏమైనా మీ జుట్టు వేడి మరియు కాలుష్యం యొక్క తీవ్రతను భరించలేకపోవడం కూడా జుట్టు పెరుగుదలకు కారణం అవుతుంది. మీరు నిజంగా మీ జుట్టును వేగంగా మరియు పొడవుగా పెంచుకోవాలనుకుంటే అందుకు కొన్ని అనుసరించాల్సిన సాధారణ దశలు ఉన్నాయి .
ఈ దశలన్నీ కూడా సరైన జుట్టు పెరగుదల కోసం మీరు తెలుసుకోవాలి. జుట్టుకు నూనె రాయడం, తలస్నం, పోషకాహారం, వంటివి మీ కేశాలు మీరు అనుకున్నట్లు పెరగడానికి బాగా సహాయపడుతాయి. బిజీగా ఉన్న మహిళల కోసం ఈ పద్దతులను ఇక్కడ పొందుపరుస్తున్నాం. వీటిన పరిశీలించినట్లైతే మీరు కూడా మీ కేశసంపదను పెంపొందించుకోవచ్చు. మరి ఆ దశలేంటో ఒకసారి చూద్దాం..

తలను రెగ్యులర్ దువ్వాలి: ఒక రోజులో 50 సార్లు కనుక దువ్వెనతో దువ్వడం వల్ల కొత్తగా హెయిర్ ఫాలీ సెల్స్ వ్రుద్దిచెందుతాయి. చాలా వరకూ మనందరూ ఒక రోజులో రెండు సార్లు కంటే ఎక్కువగా దువ్వరు. కాబట్టి ఈ పద్దని మార్చుకోవాలి.

కొంత ఒత్తిడితో బ్రష్ చేయాలి: మీరు హెయిర్ బ్రెష్ ను మీ కేశాలకు ఉపయోగించేటప్పుడు, మీ తల మీద కొంత ఒత్తిడిని కలిగించాలి. దాంతో తలలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు వేగంగా పెరగడానికి బాగా సహాయపడుతుంది.

నూనె రాయడం: ఆయిలింగ్. కనీసం వారంలో ఒకసారైనా జుట్టుకు నూనె రాయాలి. మీకు వీక్ డేస్ లో సమయం లేకపోతే వీకెండ్ లో తలకు పూర్తిగా నూనె రాసి ఆదివారం ఉదయం తలస్నానం చేసుకోవచ్చు. ఆయిల్ కేశాలకు పోషణను అంధిస్తుంది.

మందార నూనె: సహజంగా లభించే పదార్థాలతో మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా జుట్టు పెరుగుదలలో కూడా. అందుకు కొన్ని మందార పువ్వులు లేదా మొగ్గలను గోరువెచ్చని కొబ్బరినూనెలో వేసి రాత్రంతా నాననివ్వాలి. తర్వాత ఈ నూనెను తలకు మర్ధన చేయాలి . ఇలా చేయడం వల్ల కేశాలు మందంగా మరియు వేగంగా పెరుగుతాయి.

కేశాలను ముడి వేయడం: నిద్రించే ముందు మీ జుట్టును ఒకసారి దువ్వాలి. తర్వాత జడ లేదా ముడి వేసుకోవాలి. దాంతో కేశాలు చిక్కుబడకుండా, కేశాలకు ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ఉంటుంది.

విటమిన్ ఇ రిచ్ ఫుడ్స్: జట్టు పెరుగుదలకు విటమిన్ ఇ రిచ్ ఫుడ్ చాలా బాగా సహాయపడుతాయి. విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాలు ఉదాహరణకు బాదం వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

బాదం నూనె: చాలా వరకూ మన భారతీయులు జుట్టు పెరుగుదలకు కొబ్బరినూనె మాత్రమే ఉపయోగిస్తుంటారు. అయితే, కొన్ని సహజ నూనెలను కూడా కేశాలకు ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదలలో మార్పులు మీరు గమనించవచ్చు.

వేడినీటితో తలస్నానం చేయకూడదు: హాట్ వాటర్ షవర్ కేశాలను డ్యామేజ్ చేస్తుంది. వేడి నీళ్ళు చర్మ రంధ్రాలను తెరుచుకొనేలా చేస్తుంది. దాంతో జుట్టు అధికంగా రాలడానికి దారితీస్తుంది.

కేశాలను శుభ్రంగా ఉంచుకోవాలి: సాధారణంగా తలస్నానానికి ఎక్కువగా షాంపూను వాడుతుంటారు. అధిక షాంపు వాడకం వల్ల హెయిర్ క్వాలిటీ తగ్గిపోతుంది. కేశాలను శుభ్రం చేసుకోవడానికి ముందు తలకు నూనె రాయడం చాలా అవసరం. తలకు శుభ్రంగా ఉంచుకోవడం కూడా జుట్టు పెరుగుదలకు ముఖ్య కారణం. కాబట్టి వారానికి కనీసం 3సార్లు తలస్నానానికి మన్నికైన షాంపూను వాడండి.

తలకు స్కార్ఫ్: మీరు, కఠిన మైన ఎండ వేడికి బయట తిరగదల్చుకొన్నప్పుడు కఠినమైన సూర్య కిరణాలు మీ కేశాలకు హాని కలిగిస్తాయి. మీ కేశాలలో నాణ్యత లోపిస్తుంది. పెరుదలకు లోపం కలిగిస్తుంది. కాబట్టి సన్ ప్రొటక్షన్ కోసం తలకు స్కార్ఫ్ లేదా హాట్ పెట్టుకోవడం చాలా అవసరం



Click it and Unblock the Notifications