జుట్టును నల్లగా నిగనిగలాడేలా చేసే 10 బెస్ట్ ఆయిల్స్!

సాధారణంగా జుట్టు అందం ముడిచినప్పుడు, వాటి ఆరోగ్యం దువ్వినప్పుడు తెలుస్తుందంటారు. సమయానుకూలంగా నీళ్లు పోసి, ఎరువులు వేస్తే మొక్క ఎలా ఏపుగా పెరుగుతుందో, కనీస జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు అంత అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. చాలామంది ‘జుట్టు మాకు తెగరాలిపోతోంది. ఏం చేయాలి?' అని డాక్టర్ల దగ్గర వాపోతూ ఉంటారు. ‘పక్కవాళ్లకు అంత పొడవైన జుట్టు ఉంది. ఎంత బాగుంది. వాళ్లు చాలా అదృష్టవంతులు' అని రకరకాలుగా అనుకుంటారు. అసలు వెంట్రుక నిర్మాణం ఎలా ఉంటుంది? వెంట్రుకకు కావల్సినవి ఏమిటి? ఎందుకు రాలిపోతుంది? అనే విషయాలు తెలుసుకుంటే బాధలూ ఉండవు, జాగ్రత్తలూ సులభం అవుతాయి.

జుట్టు నల్లగా ఉంటేనే అందం. జట్టు తెల్లబడడం మొదలు పెడితే నేటి యువత మానసికంగా కృంగిపోతున్నారు. మన జట్టు రంగు చిన్న వయసులోనే నిర్ణయించబడుతుంది. చర్మంలాగానే మన జుట్టు రంగుని కూడా మెలనిన్ పిగ్మెంట్ నిర్దేశిస్తుంది. మెలనిన్ ఎంత ఉంటే జుట్టు అంత నల్లగా ఉంటుంది. మెలనిన్ తగ్గుతున్నా కొద్దీ నల్లని జుట్టు కాస్తా తెల్లగా మారుతుంటుంది. చిన్నపిల్లలు, యుక్తవయసులో ఈ మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల జుట్టు నల్లగా ఉంటుంది. అదే వయసు పై బడుతున్న కొద్ద్దీ మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంటుంది. ఫలితంగా జుట్టు తెల్లబడుతుంటుంది.

మనవెంట్రుల కింది భాగంలో ఉండే మెలానో సైట్స్‌ అనే కణాలు జట్టుకి రంగునిస్తాయి. మన శరీరంలోని మెలానిన్‌ స్థాయిని బట్టి చర్మం మరియు జట్టు రంగులు ఏర్పడతాయి. వయసు పైబడుతున్నప్పుడు మెలానిన్‌ ఉత్పత్తి తగ్గిపోయి క్రమంగా ఆగిపోతుంది. ఫలితంగా జట్టు తెల్లబడుతుంది. వయసు వల్ల నెరసిన జుట్టు ఇక నల్లబడదు. తెల్లజుట్టును తిరిగి నల్లగా మార్చలేము. కానీ,యుక్తవయసులో జుట్టు తెల్లబడితే అంటే బాల నెరుపు వస్తే దాన్ని నివారించవచ్చు అంటున్నారు సౌందర్యనిపుణులు. ముఖ్యంగా ఈ మెలనిన్ తగ్గిపోవడానికి కారణం హానికరమైన, కఠినమైన సూర్య కిరణాలు.

ఈ కఠినమైన కిరణాల వల్ల మెలనిన్ పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. దాంతో కేశాల్లో రంగు మరియు ఆకారం కోల్పోవడం జరుగుతుంది. జుట్టురాలడానికి మరొక కారణం జుట్టు తెల్లబడటం. జుట్టు తెల్లబడటం అనేది మద్య వయస్సు వారికి మాత్రమే పరిమితం కాదు, ఈ మద్యకాలంలో యవకుల్లో కూడా ప్రీమెచ్యుర్ గ్రేయింగ్ హెయిర్ మెదలైంది. మరి ఇలా జరగకుండా, తిరిగి మన కేశాలు నేచురల్ హెయిర్ కలర్ పొందాలంటే సరైన నూనెలను ఉపయోగిస్తే జుట్టును నల్లగ మార్చుకోవచు. జుట్టును నల్లగా మార్చే నూనెలు కొన్ని మీకోసం...

కాస్ట్రో ఆయిలు(ఆముదం):

కాస్ట్రో ఆయిలు(ఆముదం):

జుట్తు ఒత్తుగా , నల్లగా పెరగడానికి అత్యధికము గా సిఫార్సు చేసే నూనె ఆముదము . ఇది మాడు ఇన్‌ఫెక్షన్‌ నుండి కాపాడుతుంది . ఒమేగా -9 ఎసెన్సియల్ ఫాటీయాసిడ్స్ , జెర్మిసైడల్ గుణాలు ఆముదములో ఉన్నాయి. కాబట్టి మాడును , శిరోజాలను మైక్రోబియల్ , ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌ ల నుండి కాపాడుతుంది. ఫ్యాటీయాసిడ్స్ శిరోజాలకు పోషణనిచ్చి , తేమను పట్టి ఉంచడము ద్వారా మాడు పొడిబారకుండా కాపాడును . ఆలివ్ ఆయిల మాదిరి ఈ నూనె లో కూడా ఓలియిక్ యాసిద్ ఉంటుంది కావున మంచిఫలితాలకోసము ఈ రెండింటినీ కలిపి వాడుతారు . చిన్న పిల్లలకు ఆముదము తో మాడు మసాజ్ చేస్తారు . దీని వలన ఆరోగ్యవంతమైన శిరోజాలే కాకుండా పూరిస్థాయి ఆరోగ్యము దక్కుతుంది. ఆముదము చిక్కగా ఉండి త్వరగా చొచ్చికుపోయే గుణము కలిగి ఉంటుంది .

హెన్నా అండ్ కోకనట్ ఆయిల్:

హెన్నా అండ్ కోకనట్ ఆయిల్:

గోరింటాకులను కొబ్బరినూనెతో కాచి తలకు పట్టించడం వల్ల అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి కేశాలను నల్లగా మార్చుతాయి. గోరింటాకులను కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించి, చల్లార్చి, రెగ్యులర్ గా పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనె మాడు లోపలికి చొచ్చుకు పోయి శిరోజాల కుదుళ్ళకు చివరి కొసలదాకా పోషకాలందిస్తుంది. కొబ్బరి నూనె లో యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ వైరల్ , యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. కాబట్టి శిరోజాలు , మాడు ఇన్‌ఫెక్షన్‌ నుంది ఇది రక్షిస్తుంది. ఎసెన్సియల్ ఫాటీయాసిడ్స్ కు , వితమిన్‌ " ఇ , కె , ఐరన్‌ , ఖనిజాలకు " మంచి ఆధారము . కొబ్బరినూనెలో మెత్తబరిచే గుణము అత్యధికము ఉంటుంది. శిరొజాల ఎదుగుదలకు , పోషకం గా ఎంతగానో సహకరిస్తుంది. మందుల వాడకం , హార్మోనుల మార్పులు , ఒత్తిడి , కాలుష్యము వలన జుట్టు రాలిపోతున్నప్పుడు , పలుచబడుతున్నప్పుడు కొబ్బరి నూనె వాడకం వలన ఉపయోగము ఉంటుంది . జుట్టు కుదుళ్ళు వాయడం , కుంచించుకు పొవడాల నుంచి శిరోజాలను కొబ్బరినూనె రక్షిస్తుంది. చుండ్రు , మాడు ఇన్‌ఫెక్షన్‌ , పొడి జుట్టు , చివర్లు చిట్లిపోవడం , ఇతర శిరొజాల సమస్యల్ నుండి కాపాడుతుంది. కొబ్బరినూనె ప్రభావ వంతమైన కండిషనర్ గా పనిచేస్తుంది.

మస్టర్డ్ ఆయిల్(ఆవనూనె):

మస్టర్డ్ ఆయిల్(ఆవనూనె):

మందపాటి జుట్టు..నల్లటి జుట్టు పొందాలంటే మస్టర్డ్ ఆయిల్ ను ఉపయోగించవచ్చ. మస్టర్డ్ ఆయిల్ తలలో బ్లడ్ సర్కులేషన్ పెంచి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా చర్మ సౌందర్యంలో, కేశ సౌందర్యంలో ఆవనూనెను విరివిగా ఉపయోగిస్తారు. పోవు దినుసుగా ప్రతి ఇంట్లో ఉండే ఆవాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో మెగ్నీషియం , కాల్సియం, మాగనీస్, జింక్, ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్దము ఉంటాయి. ఘాటైన వాసనను కలిగి ఉండే ఆవాలు ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఆవనూనెను తరచూ తలకు రాయడం వల్ల హెయిర్ బాగా పెరగుతాయి. ఆరోగ్యంగానూ ఉంటాయి. జుట్టు తెగిపోకుండా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఆవాలపోడితో జుట్టు కడుక్కూంటే .. జుట్టు రాలడం తగ్గుతుంది. తలలో పేలు తగ్గడానికి ఆవాల నూనే రాసుకోవాలి. మాడు మీద కురుపులు, దురదలను ఆవ నూనె భాగా తగ్గిస్తుంది.

మందార నూనె:

మందార నూనె:

మందార నూనెతో తలకు రెగ్యులర్ గా మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడాన్నితగ్గించడంతో పాటు, జుట్టు రాలడాన్ని అరికడుతుంది. జుట్టు రాలడానికి కారణం అయ్యే చుండ్రుకు ఈ నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మందార నూనె హెయిర్ స్లాప్ ను స్ట్రాంగ్‌గా హెల్తీగా ఉంచుతుంది. మందార నూనె చాలా ప్రభావంతమైన మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంది. అందవల్లే పొడి చర్మానికి ఇది ఒక అద్భుతమైన హోం రెమడీ. ఇది కఠిన చర్మాన్ని, మరియు పెలుసు బారిన చర్మాన్ని నివారిస్తుంది. మందార నూనె రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల వెంట్రుకలు తెల్లబడటం లేదా రంగు మారడాన్ని తగ్గించుకోవచ్చు. కేశాలకు హెయిర్ కలర్ నలుపుగా పెరగేందుకు సహాయపడుతుంది. మందార నూనె ఉపయోగించడం వల్ల కేశాలు స్ట్రాంగ్‌గా మంచి కలర్‌తో మంచి షైనింగ్‌తో మెరుస్తుంటాయి.

బ్రింగ్ రాజ్(Bhringraj Oil):

బ్రింగ్ రాజ్(Bhringraj Oil):

ఈ నూనె చాలా శక్తివంతమైన జుట్టు పెరుగుదలకు సహాయపడే మూలికా నూనె. అంతే కాదు ఇది జుట్టు పెరగడానికి మరియు బట్టతల వస్తున్నా ఈ నూనె సహాయపడుతుంది. బట్టతల లక్షణాలు కనబడుతున్నట్లైతే కొన్ని చుక్కల బ్రింగ్ రాజ్ ఆయిల్ తో తలకు తరచూ మసాజ్ చేయండి.

బాదాం నూనె:

బాదాం నూనె:

బాదాం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల హెయిర్ గ్రోత్ కు బాగా సహాయపడుతుంది. ఇది కూడా కొబ్బరి మరియు ఆమ్లా నూనెలు మాదిరే ఉంటుంది. అతి త్వరగా జుట్టు పెరగాలనుకొనే వారు బాదాం నూనెను ప్రతి రోజూ తలకు పట్టించాలి.

ఆమ్లా ఆయిల్(ఉసిరి నూనె):

ఆమ్లా ఆయిల్(ఉసిరి నూనె):

జుట్టు పోషణకు ఆమ్లా ఆయిల్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఆమ్లా ఆయిల్ ను తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టుకు తగినంత పోషణ అందివ్వడంతో పాటు మంచి నేచురల్ కండీషనర్ గా పనిచేస్తుంది.

బ్రహ్మి ఆయిల్:

బ్రహ్మి ఆయిల్:

బ్రహ్మి ఆయిల్లో జుట్టుకు మరియు శరీర సంరక్షణకు ఉపయోగపడే బహుళ ప్రయోజనాలున్నాయి. బ్రహ్మి ఆయిల్ తో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు మూలాలలకు మరియు తల మాడుకు చల్లదనాన్ని ఇస్తుంది . అంతే కాదు ఇది చుండ్రును తొలగించడానికి ఉపయోగపడుతుంది . ఇంకా బ్రహ్మి ఆయిల్ బ్రెయిన్ ఫంక్షన్స్ కు మరియు మెమరీ బాగుంటుంది.

నువ్వుల నూనె:

నువ్వుల నూనె:

నువ్వుల నూనె జుట్టు ముదురు వర్ణం పొందడానికి బాగా సహాయపడుతుంది. కాబట్టి నువ్వులను నూనెను తలకు మసాజ్ చేయడంతో పాటు అప్పుడప్పుడు నువ్వులను తినడం కూడా ఇటు ఆరోగ్యానికి అటు కేశ సంరక్షణకు చాలా మంచిది.

Desktop Bottom Promotion