Latest Updates
-
శ్రావణ శుక్రవారం స్పెషల్.. అమ్మవారికి నైవేద్యంగా కమ్మనైన ఆవ పులిహోర ఇలా చేయండి.! -
అయినవారితో ఏకీభవించలేకపోతున్నారా.. ఈ విషయాల్లో మాత్రం ‘కాదు’ అని చెప్పాల్సిందే.! -
కొత్తగా ఏదైనా తినాలని ఉందా? ఒక్కసారి ఈ రవ్వ రొట్టె చేసి చూడండి..చచ్చేదాకా ఇదే కావాలంటారు! -
ప్రపంచ అవయవదాన దినోత్సవం.. ఆర్గాన్ డొనేషన్‌పై ఇప్పటికీ వీడని అపోహలు.. వాస్తవాలివే.! -
ఈ పొడి వేసి పచ్చిమిరపకాయ వేపుడు చేస్తే.. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు! -
చపాతీ పిండి ముద్ద మిగిలితే ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. వాడే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
బీపీ, కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే నల్ల వెల్లుల్లి.. దీని ప్రయోజనాలు అదుర్స్! -
దాబా స్టైల్ వెజ్ కీమా కర్రీ.. గ్రేవీలో ఈ రెండూ కలిపారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే.! -
స్వీట్ ప్రేమికులకు పర్ఫెక్ట్ ట్రీట్..బాదం సేమియా పాయసం ఇలా చేశారంటే అదిరిపోతుంది! -
వాస్తు ప్రకారం తులసి మొక్క వద్ద ఏ వస్తువులు ఉంచకూడదో తెలుసా.. లేదంటే అరిష్టాలు తప్పవు.!
కళ్ళు చెదిరే హెయిర్ స్టైల్స్ తో ఐశ్వర్య రాయ్..!
అందం అంటే ఆమెదే.. ప్రపంచం ఆమె అందానికి దాసోహం అంది. కుర్రకారు మొదలుకుని సినీ నిర్మాతల వరకూ ఆమె అందానికి ఆకర్షితులే.. ఒకటి కాదు.. రెండుకాదు. ప్రపంచ సుందరి కిరీటాన్ని తన సిగలో చేర్చుకున్న తరువాత కూడా ఆమె దాదాపు పద్దెనిమిది ఏళ్ళపాటు అదే అందచందాలను ఒలకపోసింది... ఆమె ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఐశ్వర్యరాయ్ అని అందరికి ఇట్టే తెలిసిపోతుంది.
ఈ మద్య కేన్స్ లో తన అందాలను ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్య పరచిన ఐశ్వర్య అంతర్జాతీయ ప్రయాణాల్లో బీజీగా కనబడుతోంది. ఈ మద్యన అనేక కార్యక్రమాల్లో ఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్ బచ్చన్ లు పాల్గొనడం చూస్తూనే ఉన్నాం. కొన్ని కార్యక్రమాలకు హాజరైన ఐశ్వర్య రాయ్ వివిధ రకాల డిజైన్లతో ఉన్న ఉన్న అద్భుతమైన దుస్తులను ధరించింది. డిజైనర్ లేబుల్స్ కాకుండా, మంచి హెయిర్ స్టైల్ తో ఆకర్షణీయంగా కనబడుతోంది.
రీసెంట్ గా పాల్గొన్న కొన్ని ఈవెంట్స్ లో ఐశ్వర్య రాయ్ ను గమనించినట్లైతే ఆమె డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ను గమనించవచ్చు. ఆ మాటకొస్తే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2013లో రెడ్ కార్పెట్ మీద ప్రదర్శించినప్పుడు ఆమె హెయిర్ స్టైల్ కు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో తెలిసిపోతుంది. కొన్ని రోజుల క్రితం లండన్ లో రాయల్ ఆస్కాట్ రేస్ లో కనిపించిన ఐశ్వర్య రాయ్ మరో అద్భుత లుక్ తో పాల్గొన్నారు. వైట్ కలర్ లోని పొడవైన డ్రెస్ ను ధరించింది. ఆ డ్రెస్ లో చాలా క్లాసీగా కనిపించింది.
మరి ఈ మద్యన ఐశ్వర్య రాయ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ చూసిన తర్వత చాలా ఆశ్చర్యం కలిగించిన ఆ హెయిర్ స్టైల్స్ అన్నింటిని మీ ముందు ఉంచడానికి..ఈ హెయిర్ స్టైల్స్ మీ అవుట్ ఫిట్స్ కు సూట్ అవుతాయోమో ఒక సారి పరిశీలించండి...

సమ్మర్ కర్ల్స్: లండన్ లోని రాయల్ స్కాట్ రేస్ లో ఇలా దర్శనమిచ్చిన ఐశ్వర్య రాయ్, వైట్ అండ్ బ్లాక్ ఫ్లవర్ పీస్ తో అద్భుతంగా కనిపించింది. ఈ టాప్ హ్యాట్ సైడ్ స్వెప్ట్ సమ్మర్ కర్ల్స్ అద్భుతంగా ఓ దేవతలా కనిపించింది.

Permed హెయిర్: Perfmed లూజ్ హెయిర్ లో ఐశ్వర్య రాయ్ చాలా అద్భుతంగా కనిపించింది. ఈ హెయిర్ స్టైల్ బ్లూ ఎరిల్లా కౌచర్ ఫిష్ టైల్ గౌన్ లో అద్భుతంగా, ఆశ్చర్య పరిచింది.

సైడ్ స్వెప్ట్ ఓపెన్ హెయిర్: ఇది ఐశ్వర్య రాయ్ కు క్యాజువల్ హెయిర్ స్టైల్ . సైడ్ స్వేప్ట్ బ్రౌన్ హెయిర్ స్ట్రెయిట్ గా మరియు సున్నితంగా అద్భుతంగా ఉంది. ఈ హెయిర్ స్టైల్ కి తగ్గట్టు బ్లాక్ సన్ లైట్ అద్బుతం.

సైడ్ స్వెప్ట్ కర్ల్స్: ట్రెడిషినల్ అవుట్ ఫిట్స్ మీదకు ఐశ్వర్య రాయ్ ఈ హెయిర్ స్టైల్ ను ఎక్కువగా మెయింటైన్ చేస్తుంటుంది. చిక్కగా కర్లింగ్ తో ఉన్న ఈమె జుట్టు ఒక సైడ్ కు వేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది.

టాప్ నాట్: టాప్ నాట్ తో ఫ్యాషన్ గురులను మరియు మేకప్ ఆర్టిస్ట్ లను ఆశ్చర్యపరిచింది. టాప్ నాట్ హెయిర్ స్టైల్ ప్రస్తు ట్రెండ్ కు తగ్గట్టుగా కొంచెం డిఫరెంట్ గా ఉంది.

బ్రౌన్ సమ్మర్ కర్ల్స్: కేన్స్ 2013లో ఐశ్వర్య రాయ్ ప్రయత్నించిన మరో అద్భుతమైన హెయిర్ స్టైల్ ఇది ఈ సైడ్ స్వెప్ట్ షైనీ బ్రౌన్ సమ్మర్ కర్ల్స్, సైడ్ లుక్ తో మైండ్ బ్లోయింగ్ గా అనిపించింది.

సెంటర్ పార్టింగ్: ఐశ్వర్య రాయ్ కి కేశాలు చాలా మందంగా ఉండటం చేత, ఇలా మద్య పాపిటితో హెయిర్ స్టైల్, ఫోర్ హెడ్ ను కవర్ చేస్తూ అద్భుతంగా ఉంది.

బుర్గుండి బ్రౌన్ సైడ్ స్ట్రెయిట్ హెయిర్: ఐశ్వర్య రాయ్ ఈ కేశాలంకరణలో చాలా సొగసుగా కనిపిస్తోంది. మెరిసే ద్రాక్ష రసపు గోధుమ రంగు జుట్టులో చాలా అద్భుతంగా కనిపిస్తోంది.

హనీ బ్రౌన్ హెయిర్ : ఇది మరొక స్టైయిట్ హెయిర్ స్టైల్. స్టైలిష్ సారీ మీదకు ఈ హెయిర్ స్టైల్ బాగా నప్పింది.

మెస్సీ హెయిర్ బన్: ఈ మెస్సీ హెయిర్ బన్ చూడటానికి చాలా అందంగా మరియు స్మార్ట్ గా ఉంది. ఐశ్వర్య ఒక సాంప్రదాయ చీర మీదకు ఈ కేశాలంకరణ ప్రయత్నించారు . సిల్వర్ హెయిర్ బ్యాండ్ తో కేశాలను ముడి వేసారు.

సైడ్ బ్రైడ్: ఇది ట్రెడిషినల్ ఇండియన్ హెయిర్ స్టైల్. ఇది ఒక సాంప్రదాయ లుక్ ను కనబరుస్తోంది. ఐశ్వర్యా రాయ్ ఈ ట్రెడిషనల్ కేశాలంకరణలో జడకు పువ్వులతో కూడిన ఆభరణాలను, పాపిటి బిల్లను అలంకరించింది.

సెంటర్ పార్టింగ్ స్ట్రెయిట్ హెయిర్ : ఈ హెయిర్ స్టైల్లో చాలా సింపుల్ గా అందంగా కనబడుతోంది.

బ్లాక్ పర్మెడ్ మెయిర్: ఈ హెయిర్ స్టైల్ ఒక షోల్డర్ ను కవర్ చేస్తూ అద్భుతంగా ఉంది. మరో సైడ్ షోల్డర్ బ్రౌన్ హెయిర్ కవర్ చేసింది.

ఫ్రెంచ్ టాప్ నాట్: ఇది ఒక సాంప్రదాయకరమైన హెయిర్ స్టైల్. చీరలోనికి అద్భుతంగా నప్పింది.



Click it and Unblock the Notifications