Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
శీతాకాలంలో పొడి జుట్టు కోసం జుట్టు సంరక్షణ చిట్కాలు
సంవత్సరం తర్వాత వింటర్ సీజన్ ను స్వాగతించడానికి ఇది సమయం!! వింటర్ సీజన్ ఆహ్లాదకరమైనది మాత్రమే కాదు, సీజన్ తో పాటు అనేక సమస్యలను కూడా వెంటబెట్టుకొని వస్తుంది. ఈ సీజన్ మీ చర్మం, మరియు జుట్టు పొడిగా మారుతుంది. అందుకే ఈ సీజన్ ల రక్షణ అత్యవసరం అవుతుంది. వింటర్ లో చల్లగా వీచే చల్లని గాలులతో మీరు ఆనందించవచ్చు, కానీ , నిజానికి మీ జుట్టు నష్టం కలిగిస్తుంది.
ఇక డిసెంబర్ వస్తే చాలు, మీ వార్డ్ రోబ్ లో ఉండే అన్ని ఉలెన్ దుస్తులు, స్వెటర్లు, గ్లౌజులు బయటకు తీయాల్సి వస్తుంది. ఇవన్నీ నిజమౌనవి. అంతే కాదు, వింటర్ మీ జుట్టును కూడా పొడిగా మార్చేస్తుంది. ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు శీతాకాలంలో సాధారణం, ఈ కారణం చేతనే మీ జుట్టు ప్రతి సారీ పొడిగా మారుతుంది. సీజన్స్ భిన్నంగా ఉంటాయి , కాబట్టి పరిస్థితులు కూడా భిన్నంగా ఉంటాయి. ప్రతి సీజన్ లోనూ మీ జుట్టు మరియు చర్మం మీద లోతైన ప్రభావం చూపెడుతుంది. వింటర్ మీ జుట్టు, తల వెంట్రుకులకు తేమలేకుండా పొడిబారేలా చేస్తుంది. జుట్టు మరియు జుట్టు న తగినంత తేమ మీ జుట్టు మరియు గ్రీవము అనేక సమస్యలకు కారణమవుతుంది . శీతాకాలంలో జుట్టు సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి . వాటిని ఈ క్రింది స్లైడ్ ద్వారా పరిశీలించి, నునుపైన జుట్టు పొందడానికి ప్రయత్నించండి.

1 . నూనెలతో సంరక్షణ
పొడిబారి జుట్టుకు నూనెలు ప్రాధిమిక రక్షణ పదార్థాలు. ఎప్పుడైతే శీతాకాలం మీ తలను మరియు జుట్టును పొడిబారేలా చేస్తుందో అప్పుడు కొన్ని అవసరమైన నూనెలు, కొబ్బరి నూనె లేదా బాదం నూనె వంటివి రాత్రుల్లో పెట్టుకోవడం మంచిది. ఇది తలకు అవసరమైయ్యే తేమను అంధిస్తుంది.

2 . ట్రిమ్ చేసుకోండి.
శీతాకాలం జుట్టు చిట్లటానికి కారణం కావచ్చు. కాబట్టి, వింటర్ లో ఒక బెస్ట్ హెయిర్ కేర్ అప్పుడప్పడు జుట్టును ట్రిమ్ చేస్తుండాలి. ఇలా ట్రిమ్ చేయడం వల్ల జుట్టు అందంగా మరియు ఆరోగయయంగా చేస్తుంది. దాంతో తర్వాత జుట్టు చిట్లకుండా నిరోధిస్తుంది.

3 . కొన్నింటికి నో చెప్పండి
మీ జుట్టుకు రంగు వేయడం, ఐరనింగ్, స్ట్రీకింగ్ మొదలగువి కూడా డ్రైహెయిర్ కారణం అవుతాయి. ఇవన్నీ కూడా మీ అందమైన జుట్టును భయంకరంగా మార్చుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది. కాబట్టి, శీతాకాలంలో జుట్టు సంరక్షణపై శ్రద్ధ వహించడం అవసరం .

4 . జుట్టును కవర్ చేసుకోవాలి
వింటర్ సీజన్ లో తలను పూర్తిగా కవర్ చేయడం చాలా ముఖ్యం. తలకు స్కార్ప్ వంటివి కట్టుకొని, వింటర్ లో మీ జుట్టుకు రక్షణ కల్పించండి. అయితే, మీరు వేసుకొనే స్కార్ప్ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. సరిగా స్కార్ప్ కట్టుకోవడం వల్ల తలలో రక్తప్రవాహం పరిమితం చేస్తుంది. ఇది వింటర్ లో డ్రై హెయిర్ కు మంచిది.

5 . షాంపూ నివారించండి
మీరు ప్రతి రజూ తలకు షాంపుతో తలస్నాం చేసేట్లైతే, అప్పుడు మీరు వింటర్ లో షాంపులను నివారించడం మంచిది. వింటర్ లో షాంపు పెట్టడం వల్ల మీ జుట్టును డ్రైగా మార్చుతుంది. కాబట్టి, శీతాకాలంలో సాధ్యమైనంత తక్కువగా షాంపు చేసుకోవడం వల్ల మీ జుట్టును రక్షణ కల్పించవచ్చు.

6 . కండీషనింగ్ - ఉత్తమ మార్గం
శీతాకాలంలో పొడి జుట్టు సంరక్షణకు కండిషనింగ్ ఒక మంచి మార్గం. శీతాకాలంలో మీ కేశాలకు రక్షణ కవచం వంటిది. మీ తల స్నానం చేసిన ప్రతి సారి మీ జుట్టుకు కండిషనింగ్ చేసుకోవడం మర్చిపకండి. మీరు నేచురల్ కండిషనర్ ను అప్లై చేయాలనుకుంటే కొబ్బరి పాలు చాలామంచిది .

7 . మీ తడి జుట్టును ముడివేయకండి
శీతాకాలంలో తలస్నానం చేసిన తర్వాత కూడా జుట్టు పొడిగా మారుతుంది. మీరు జుట్టు బాగా తడి ఆరినట్లుఒకటికి రెండుసార్లు నిర్దారించుకొన్న తర్వాత ముడు వేయడానికి ప్రయత్నించండి . జుట్టు సంరక్షణలో ఇది ఒక జుట్టు సంరక్షణ పద్దతి.

8. మీ జుట్టు మంచి షైనింగ్ త ఒత్తుగా చేయడం
శీతాకాలంలో మీ జుట్టు ఫైగింన్ కోల్పోవడం మరియు జుట్టు తగ్గిపోవడం సాధరణం. అటువంటప్పడు మీ జుట్టు సంరక్షణ చాలా అవసరం. కాబట్టి, మీ జుట్టు మొదళ్ళకు కొంచెం తేనెను అప్లై చేసి, తర్వాత తలస్నానం చేసేసుకోండి.

9 . చుండ్రు సమస్య నివారించుకోండి
వింటర్ చుండ్రుకు కూడా కారణం కావచ్చు. కాబట్టి, పొడి జట్టు సంరక్షణ అత్యవసరం అని గుర్తించండి. కొద్దిగా నిమ్మరసం మరియు నూనె మిక్స్ చేసి తకలు అప్లై చేయండి. ఇది ప్రయత్నించండి మరియు చుండ్రు నివారించండి.

10 . చిక్కుచిక్కు
శీతాకాలంలో మీకు ఆహ్లాదకరంగా అనిపించినా, వాతావరణం మీ జుట్టును చిక్కుబడేలా చేస్తుంది. అందువల్ల మీ జుట్టు పొడి బారడం జరగుతుంది . కాబట్టి , మంచి హెయిర్ బ్రెష్ ను ఉపయోగించి హెయిర్ కేర్ తీసుకోవడం వల్ల చిక్కుబడ్డ జుట్టును నివారించవచ్చు . కాబట్టి, పైన ఇచ్చిన చిట్కాలను ఉపయోగించి వింటర్ లో మీ జుట్టును సంరక్షించుకోండి.



Click it and Unblock the Notifications











