వేగవంతమైన జుట్టు పెరుగుదలకు ఆరోగ్యకరమైన ఆహారాలు...

సాధారణంగా అందం విషయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే జుట్టు విషయంలో మాత్రం సాధారణ జాగ్రత్తలతో పాటు, మరికొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ ఒత్తైన పొడవైన జుట్టు కావాలని కోరుకుంటారు. నిజం చెప్పాలంటే మనిషి అందం అంతా కేశాల మీదే ఆధారపడి ఉంటుంది. కేశాలు లేకపోతే, ఎంత అందంగా ఉన్నా, ఎంత అలంకరణ చేసుకున్నా ప్రయోజనం ఉండదు. ప్రస్తుత కాలంలో అందంతో పాటు, కేశ సంరక్షణ మీద కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రతి రోజూ ఒత్తిడితో కూడిన ఉరుకుల పరుగుల జీవితం మరియు అనారోగ్యపు జీవనశైలి కూడా జుట్టు రాలడానికి కారణం అవుతున్నాయి. మన ఆరోగ్యం మీదే చర్మం, కేశాల సంరక్షణ ఆధారపడింది. అంతే కాదు, వంశపారంపర్య లక్షణాలు, మరియు వయస్సు కూడా జుట్టు పెరుగుదల మీద ప్రభావం చూపిస్తాయి. అదే సమయంలో మనం నివసించే పర్యావరణ కారకాలు, పరిస్థితులు కూడా జుట్టు పెరుగుదల లో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

జుట్టును ఒత్తుగా-పొడవుగా-వేగంగా పెంచే పోషకాహారాలు

ఫిష్: చేపలు తినడం వల్ల పొడవైన మరియు బలమైన జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే ప్రోటీనులు మరియు విటమిన్ డి పుష్కలంగా వీటిలో ఉన్నాయి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తల మాడు, మరియు కేశాలకు తగినంత తేమను అందిస్తుంది. ఎల్లప్పుడు హైడ్రేట్ గా ఉంచబడుతుంది. హెయిర్ త్వరగా పెరగడానికి సాల్మన్ ఫిష్ బాగా సహాయపడుతుంది.

జుట్టును ఒత్తుగా-పొడవుగా-వేగంగా పెంచే పోషకాహారాలు

నట్స్ మరియు సీడ్స్: నట్స్ మరియు ధాన్యాలు, ముఖ్యంగా బాదాం మరియు వాల్ నట్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు వీటిలో విటమిన్ ఇ అధికంగా ఉండే హెయిర్ సెల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. వాల్ నట్స్ లో కాపర్ అధికంగా ఉంటుంది. ఇది కురులను నేచురల్ కలర్ లో మెరిసేలా చేసేందుకు సహాయపడుతాయి.

జుట్టును ఒత్తుగా-పొడవుగా-వేగంగా పెంచే పోషకాహారాలు

ఓయిస్ట్రెస్: సీ ఫుడ్ లో ఒకటైన ఓయిస్ట్రెస్ లో జింక్ పుష్కలంగా ఉంటుంది. అత్యంత పోషకాలు కలిగిన ఆహారాల్లో గుడ్డు, బీఫ్ మరియు ఒయిస్ట్ర్స్. జింక్ లోపం వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది. కాబట్టి మీ డైలీ డయట్ లో జింక్ ఉన్న ఆహారాలు ఓయిస్ట్ర్స్ తీసుకోవడం వల్ల కురులు వేగంగా పొడవుగా పెరగడానికి సహాయపడుతాయి.

జుట్టును ఒత్తుగా-పొడవుగా-వేగంగా పెంచే పోషకాహారాలు

పొటాటో: దుంపల్లో బంగాళదుంప ఒకటి ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. అంతే కాదు క్యారెట్స్, మామిడి, గుమ్మడి వంటి ఆహారాలు తరుచూ తీసుకుంటుంటే కురులు ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతాయి. ఇవి తల మాడుకు సహాయపడే నూనెగ్రంథులను ఉత్పత్తి చేస్తాయి.

జుట్టును ఒత్తుగా-పొడవుగా-వేగంగా పెంచే పోషకాహారాలు

గుడ్డు: మన శరీర ఆరోగ్యానికి అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాల్లో గుడ్డు ప్రధానమైనది. గుడ్డులో కావల్సినన్ని అత్యవసర పోషక ఆమ్లాలు, జింక్, మరియు ఐరన్ కలిగి ఉంటాయి. మరో ముఖ్య విసయంలో ఇందులో లభించే జింక్ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. కురులు స్ట్రాంగ్ ఉంచి హెయిర్ పాల్ ను అరికడుతుంది.

జుట్టును ఒత్తుగా-పొడవుగా-వేగంగా పెంచే పోషకాహారాలు

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్( ఆకుకూరలు): గ్రీన్ లీఫ్ అంటే ఆకుకూరలు, కరివేపాకు వంటి వాటిలో ఐరన్ అధికంగా ఉంటుంది. దీంతో పాటు అత్యవసర పోషకాలైన ఐరన్, బీటా కెరోటిన్స్, ఫ్లొల్లెట్ మరియు విటమిన్ సి అధికంగా ఉండి కురుల ఫోలీసెల్స్ ను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతాయి.

జుట్టును ఒత్తుగా-పొడవుగా-వేగంగా పెంచే పోషకాహారాలు

సోయాబీన్స్ మరియు కిడ్నీ బీన్స్: వీటిని తినడం వల్ల గ్యాస్టిక్ సమస్య మొదలవుతుందని చాలా మంది వీటిని తినడం మానేస్తుంటారు. అయితే వీటిలో ఉండే ప్రోటీనులు, ఐరన్, జింక్ మరియు బయోటిన్ వంటివి జుట్టు పెరుగుదలకు మరియు జుట్టు ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతాయి.

జుట్టును ఒత్తుగా-పొడవుగా-వేగంగా పెంచే పోషకాహారాలు

డైరీ ప్రొడక్ట్స్: ఈ డైరీప్రొడక్ట్స్ ను రోజు వారి ఆహారంలో తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ బలమైన, పొడవైన జుట్టు పెరుగుదలకు ఈ హెల్తీ ఫుడ్స్ ను మీ డైలీ డయట్ లో చేర్చుకోవాలి. డైరీ ప్రోడక్ట్స్ లో బి5, విటమిన్ డి మరియు ఎక్కువ క్యాల్షియం కలిగి ఉంటాయి.

జుట్టును ఒత్తుగా-పొడవుగా-వేగంగా పెంచే పోషకాహారాలు

బెర్రీస్: బెర్రీస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మంచి పోషకాహారం ఎందుకంటే వీటిలో ఉండే పోషకాలు, చర్మ మరియు జుట్టు సంరక్షణకు బాగా సహాయపడుతాయి. విటమిన్ సి బలమైన కురుల పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. మరియు జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

జుట్టును ఒత్తుగా-పొడవుగా-వేగంగా పెంచే పోషకాహారాలు

చికెన్: అధిక పోషకాలు కలిగిన ఆహారాలు హెయిర్ మరియు స్కిన్ సెల్స్ ను డెవలప్ చేయడానికి బాగా సహాయపడుతాయి. ఆరోగ్యకరమైన బలమైన కురులు పొందడానికి డైలీ డయట్ లో చికెన్ ను చేర్చుకోవచ్చు. ఇందులో అధిక ప్రోటీనులు మరియు జింక్ కలిగి ఉంటుంది.

అందరూ పొడవాటి మరియు ఒత్తైన జుట్టు కావాలని కోరుకుంటారు. జుట్టు పెరుగుదల కోసం చాలా రకాల ట్రీట్మెంట్లు మరియు హెయిర్ ఆయిల్స్ ఉపయోగించి విసిగు చెంది ఉంటారు. జుట్టు సహజంగా మన శరీర, ఆరోగ్య ప్రభావంతో పెరిగేవి కాబట్టి బయట ఏ ట్రీట్మెంట్ పనిచేయకపోచ్చు. మీ జుట్టు సాధారణంగా పొడవైన, ఒత్తైన జుట్టు పెరగాలనుకొనే వారు సహజపద్దతులను అవలంభించడం చాలా అవసరం. అందుకు ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో ప్రోటీనులు అధికంగా ఉండేలా చేసుకోవాలి . ప్రోటీనులతో పాటు ఇతర పోషకాలు విటమిన్ ఎ మరియు విటమిన్ బి, జింక్ మరియు అత్యవసర కొవ్వు ఆమ్లాలు వంటి ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. ఇవి జుట్టు త్వరగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతాయి. మరి జుట్టు త్వరగా పెరిగేలా చేసే కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు మీకోసం...

Desktop Bottom Promotion