Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
ఆరోగ్యకర జుట్టు పెరుగుదలకు 7 పవర్ ఫుల్ డైట్ టిప్స్
సాధారణంగా మనం తీసుకొనే సమతుల ఆహారం మీదు మన ఆరోగ్యం, జుట్టు మీద ఆధారపడి ఉంటుంది. మన శరీరం యొక్క ఇతర భాగాలకు భిన్నంగా జుట్టు ఉంది. మీరు ఆయిల్ ఫుడ్స్ మరియు ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి మీ చర్మ ఛాయను డ్యామేజ్ చేస్తుంది. అంతే కాదు చర్మ మీదు చారలకు కారణం అవుతుంది.
అదేవిధంగా, మీరు క్రమం తప్పకుండా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా, మీ ఆరోగ్యం, చర్మ రంగు వలే మీ కేశాలు మరియు తల మీద మాడు పాడైపోతుంది. కాబట్టి మనకు మందపాటి హెయిర్, విలాసవంతమైన కేశాలు కావాలని కోరుకున్నప్పుడు మనం తప్పని సరిగా మనం తీసుకొనే ఆహారం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మనం ప్రతి రోజూ తినే పోషకాలు మన జుట్టు మరియు హెయిర్ పోలిసెల్స్ మీద కీలక పాత్రను పోషిస్తాయి.
మరి ఆరోగ్యకరమైన జుట్టు పొందడానికి కొన్ని హెల్తీ హెయిర్ డైట్ టిప్స్ ను ఇక్కడ అందిస్తున్నాం..వాటిని పరిశీలించి మీ దీర్ఘకాలిక ఆరోగ్యంతో పాటు ఆరోగ్యకరమైన జుట్టును కూడా పొందండి..

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్: మనం శరీరం ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ ను ఉత్పత్తి చేయదు. కానీ మన శరీరానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యొక్క అవసరం చాలా ఉంది. ఇది శరీరం యొక్క కార్యాచరణకు బాగా సహాయపడుతుంది. ఈ పోషకాలు ఒక ఆరోగ్యకరమైన జుట్టును ప్రోత్సహించడానికి సహాయపడుతుంది . ఈ పోషకాంశాన్ని మీరు తగినంత మొత్తంలో తినకపోతే, జుట్టు, తల మాడుమీద ఉత్పత్తి అయ్యే నేచురల్ ఆయిల్ మీద ప్రభావితం చేస్తుంది. ఫలితంగా హెయిర్ లాస్ మరియు జుట్టు మద్యలో తెగిపోవడం జరుగుతుంది. కాబట్టి సాల్మన్, ఆలివ్ ఆయిల్ మరియు క్యాబేజ్ వంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఫుడ్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం చాలా ముఖ్యం.

ప్రోటీన్: హెయిర్ ఫోలీ సెల్స్ (జుట్టు గ్రీవము)ప్రోటీనులు కలిగి ఉంటాయి. ఈ పోషకాంశం లోపించడం వల్ల జుట్టు పెరుగుదలలో లోపం, నిర్జీవమైన కేశాలకు కారణం అవుతుంది. ప్రోటీనులను లీన్ మీట్, గుడ్లు, మరియు ఆర్గానిక్ పౌట్రీలో కనుగొనబడింది. కాబట్టి ఇటువంటి ఆహారాలకు అధిక ప్రధాన్యం ఇవ్వడం చాలా అవసరం.

నీళ్ళు: చర్మాన్ని హైడ్రేషన్ లో ఉంచడానికి మరియు పూర్తి శరీరఆరోగ్యం కోసం మాత్రమే నీటిని సిఫారస్సు చేయబడలేదు. కేశాలకు కూడా చాలా అవసరం. ప్రతి రోజూ మీరు 8 గ్లాసుల నీరు తీసుకోకుండా విస్మరించస్తే, మీరు పెళుసైన జుట్టు మరియు పొడి జుట్టుతో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి, రోజు వారీ మోతాదులో నీళ్ళు త్రాగడానికి నిర్ధారించుకోండి. దాంతో మెరిసేటి, మాయిశ్చరైజర్ చర్మం, కేశాలు మీ సొంతం అవుతాయి.

ఇనుము: శరీరంలో ఇనుము లోపించడం వల్ల హెయిర్ లాస్ కు ప్రధాన కారణం అవుతుంది. పీరియడ్స్ సమయంలో చాలా వరకూ శరీరంలో ఇనుమును కోల్పోవల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా మహిళలు ఐరన్ రిచ్ ఫుడ్స్ తినడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. రెడ్ మీట్, గ్రీన్ వెజిటేబుల్స్, మరియు గుడ్డు, గుడ్డులో ఉండే పచ్చసొన ఐరన్ పుష్కలంగా ఉండేటటువంటి అద్భుతమైన వనరు.

విటమిన్లు: జుట్టు రోగాలు..ఉదాహరణకు చుండ్రు లేదా దురద వంటి సమస్యలు విటమిన్ల లోపం వల్ల వచ్చేటివే. విటమిన్ సి మరియు విటమిన్ ఎతో తయారు చేయబడ్డ సిబం, ఆయిల్ ను జుట్టుకు మరియు హెయిర్ ఫోలీసెల్స్ కు కోట్ చేయాలి. మనం తీసుకొనే ఆహారంలో విటమిన్ సి లోపిస్తే జుట్టు మెరుపును మరియు హెయిర్ డ్యామేజ్ కు దారి తీస్తుంది. తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. క్యారెట్ మరియు మామిడి పండ్లు మరియు స్వీట్ పొటాటోలు విటమిన్ ఎను పుష్కలంగా అంధిస్తాయి. విటమిన్ బి లోపం వల్ల కూడా హెయిర్ లాస్ అధికంగా ఉంటుంది. అందుకు మీ రెగ్యులర్ డైట్ లో తృణధాన్యాలు, బీన్స్ మరియు అరటి పండ్లను చేర్చుకోవడం వల్ల జుట్టు సమస్యలను పరిష్కరించవచ్చు .

హెల్తీ ఫ్యాట్: జుట్టు పెరుగుదకు హెల్తీ ఫ్యాట్స్ చాలా అవసరం. ఇది ఇంకా హెయిర్ ఫాలీసెల్స్ కు మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది. కేశాలను మందంగా, పొడవుగా, షైనీగా ఉంచుతుంది. నట్స్ లో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ పుష్కలంగా ఉన్నాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఉదాహరణకు: ఫ్లాక్ సీడ్స్ , వాల్ నట్స్, మరియు బ్రాజిల్ నట్స్ ను మీ రెగ్యురల్ డైట్ లో చేర్చుకోవాలి.

జింక్: జింక్ జుట్టుకు పోషణను అందిస్తుంది అంతే కాదు జుట్టు పెరుగుదలకు మరియు నిర్వహణను బాగా సహాయపడుతుంది. జింక్ లోపం వల్ల జుట్ట పాడవడం, జుట్టు కణాజాలం డ్యామేజ్ అవ్వడం, అనారోగ్యకరమైన జుట్టుకు దారితీస్తుంది. కాబట్టి పుష్కలమైన జింక్ ను పొందాలంటే మీ రెగ్యులర్ డైట్ లో కాలే, బచ్చలికూర మరియు సీఫుడ్ వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వండి.



Click it and Unblock the Notifications











