Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే కొన్ని మూలికలు
అందమైన, పొడవాటి జుట్టు ఉండాలని ఎవరు కోరుకోరు? సాదారణంగా చాలామంది మహిళలు అందమైన మరియు పొడవాటి జుట్టు మీద అధిక ప్రేమను కలిగి ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు వారి జుట్టు మీద మంచి శ్రద్ధ వహించలేకపొతున్నారు. మీ జుట్టుకు దుమ్ము,కాలుష్యం మరియు సూర్యకాంతి వాటి వల్ల కొంత హాని కలగవచ్చు. దీని ఫలితంగా వెంట్రుకలు రాలిపోవడం మరియు జుట్టు పెరుగుదల తగ్గుతుంది.
సమస్య చికిత్స కొరకు రసాయన మార్గం కోసం వెళ్ళవచ్చు. మార్కెట్ లో అనేక షాంపూలు మీ జుట్టు సమస్యల పరిష్కారం కొరకు హామీ ఉంటుంది. కానీ అందులోఉండే రసాయనాలు మీ జుట్టుకు మరింత నష్టం కలిగిస్తాయని తప్పనిసరిగా తెలుసుకోవాలి. కాబట్టి సులభమయిన పరిష్కారం ఏమిటంటే సహజమైన మూలికా చికిత్స కోసం వెళ్ళవచ్చు. మూలికా చికిత్స జుట్టు పెరుగుదలకు మాత్రమే కాదు. మీ జుట్టు యొక్క నాణ్యతను కూడా పెంచుతుంది. ఇంకా మూలికలు ఒక సున్నితమైన జుట్టు ఉన్నవారి కోసం ఒక మంచి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు.

మూలికలు దుష్ప్రభావాలు ఏమి లేకుండా జుట్టు పెరుగుదల చికిత్సలో సహాయపడతాయి. ఇక్కడ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే కొన్ని మూలికలు ఉన్నాయి.
1. రోజ్మేరీ
ఇది మీ జుట్టు కోసం ఒక అద్భుతమైన హెర్బ్ అని చెప్పవచ్చు. రోజ్మేరీ మీ జుట్టును ప్రకాశ వంతం చేయుట,చుండ్రు మీద పోరాటం మరియు జుట్టు క్షీణతను నియంత్రిస్తుంది. రోజ్మేరీ ఆకులతో మీ జుట్టును శుభ్రం చేయవచ్చు. రోజ్మేరీ ఆకులను సాధారణ నీటిలో 10 నిమిషాలు కాచి చల్లారబెట్టాలి.ఆ తర్వాత ఆకులను తీసివేసి మీ జుట్టు మీద చల్లని రోజ్మేరీ నీటిని పోయాలి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి.
2. సీమ చామంతి
ఈ హెర్బ్ ఒక మనోహరమైన వాసన మరియు అనేక వైద్య లక్షణాలను కలిగి ఉంటుంది. జుట్టును శుభ్రం చేసిన తర్వాత జుట్టును సీమ చామంతి యొక్క కషాయంతో కడగాలి. తలపై చర్మం మీద దురద తగ్గించటానికి సహాయపడుతుంది.
3. హార్స్ టైల్
దీనిని టీ లో కలుపుకొని త్రాగవచ్చు. ఒక షాంపూలో మిళితం చేయవచ్చు. హార్స్ టైల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే ఒక గొప్ప హెర్బ్ అని చెప్పవచ్చు.
4. దురదగొండి
దురదగొండిని సాధారణంగా అడవిలో పండించడం జరుగుతుంది. ఒక గాజు జాడీలో ఆలివ్ నూనె మరియు తాజా దురదగొండి ఆకులు వేసి నానబెట్టాలి. దీనిని 2-3 వారాల వరకు ఒక చల్లని మరియు చీకటి స్థానంలో ఉంచండి. మీ తలపై చర్మం మీద మసాజ్ చేయటానికి ఈ ఆయిల్ ను ఉపయోగించండి. ఇది జుట్టు పలచన పడటాన్ని నియంత్రిస్తుంది. అంతేకాక జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
5. ముల్ల తుమ్మ
ఈ హెర్బ్ యొక్క మూలాల నుండి తీసిన ఆయిల్ జుట్టు పునరుద్ధరణ కొరకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతేకాక జుట్టు గ్రీవములో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.ఈ విధంగా జుట్టు పెరుగుదల కోసం ఉపయోగకరముగా కొన్ని మూలికలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన మరియు పొడవైన జుట్టు కొరకు మూలికా మార్గాన్ని ఎంచుకోండి.



Click it and Unblock the Notifications
