Latest Updates
-
కార్మిక లోకానికి పాదాభివందనం..మే డే విషెస్ ను ఇలా అందంగా చెప్పుకోండి! -
బాడీలో అవయువాలన్నీ రిపేర్ చేసే అద్భుతమైన ఆకు కూర..ఎలా వండాలో చూడండి -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
వేసవిలో హై బీపీ, లో బీపీ.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు! -
అర్ధరాత్రి తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. ఎవరికీ తెలియకుండా ఆ ముహూర్తం ఎందుకు? -
డిన్నర్ తర్వాత తీయగా ఏదైనా తినాలనిపిస్తోందా? మ్యాంగో రసమలై బెస్ట్ ఛాయిస్.ఎలా చేసుకోవాలంటే.. -
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు?
తలపై పొట్టురాలే సమస్యకు గృహ నివారణోపాయాలు
తలపై పొట్టు రాలే చర్మం వలన అంటువ్యాధులు, ఇబ్బందిపడే క్షణాలు ఎదురుపడవచ్చు. ఇప్పుడు మీరు పొట్టు రాలే తలపై చర్మం అంటే ఏమిటో అని ఆశ్చర్యపోతూ ఉంటే, దీనిని మీకు వివరించనివ్వండి. తలపై పొట్టు రాలే చర్మం అంటే తలలోని చర్మంపై చేరిన మృతచర్మకణాలు. ఇవి దురదకు, చుండ్రుకు కారణమౌతాయి. ఇది తలపైన చర్మంలో నూనె ఉత్పత్తి లేకపోవడం వలన కల్గుతుంది. తలపై చర్మం పూర్తిగా ఎండిపోతే, ఇది పొట్టును రూపొందిస్తుంది. దీనిని నివారించకపోతే, ఈ పొట్టు తల నుండి ముఖం దాక పాకి చర్మవ్యాధులకు దారి తీస్తుంది.
తలపై పొట్టు రాలే చర్మం జుట్టుకు, చర్మానికి ఎంతో హానికరమైనది. తలపై పొట్టు రాలే చర్మం ఇబ్బదికరంగా అనిపించడమే కాక, మీరు తలను గోకినప్పుడు, మీ గోళ్ళల్లోకి మృతకణాలు వచ్చి మీ షర్ట్ పై పడతాయి. పైగా, జుట్టు రాలడానికి ఉన్న ప్రధాన కారణాలలో తలపై పొట్టు రాలే చర్మం ఒకటి.
తలపై పొట్టు రాలే చర్మం చికిత్సకు మార్కెట్ లో చాల జుట్టు ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే, చుండ్రు ఆధారిత షాంపూలలో హానికర రసాయనాలు మరింత జుట్టు నష్టానికి దారి తీస్తాయి. అందువల్ల, ఇంటిలోని నివారణోపాయాల ద్వారా తలపైన పొట్టు రాలే చర్మాన్ని తగ్గించడం ఉత్తమమైంది. ఉదాహరణకు, గోరువెచ్చని కొబ్బరి నూనెను, నిమ్మరసంతో కలిపి తలపై పొట్టు రాలే చర్మానికి పట్టించి మసాజ్ చేయడం, తలపై చర్మ౦లో రాలే పొట్టును తగ్గించడంతో బాటు జుట్టు కూడా పెరుగుతుంది. నూనె తలపై చర్మానికి పోషణను అందించి, తేమగా ఉంచుతుంది. ఇది తలపై చర్మాన్ని పొడిగా, దురదగా ఉండకుండా కాపాడుతుంది.
తలపై పొట్టు రాలే చర్మంను నివారించేందుకు ఇక్కడ కొన్ని ఉత్తమ నివారణోపాయాలు ఉన్నాయి.

బేకింగ్ సోడా మిక్స్:
బేకింగ్ సోడాను నీళ్ళతో కలిపి తలపై చర్మానికి పట్టించండి. ఇది మృత చర్మ కణాలను తొలగించి, తలపై చర్మాన్ని శుభ్రపరుస్తుంది. తలపై చర్మాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసి, షాంపూ, కండీషనర్ లతో శుభ్రం చేయండి.

కొబ్బరి నూనె:
గోరువెచ్చని కొబ్బరి నూనె, తలపై పొట్టు రాలే చర్మానికి మంచి గృహ నివారణోపాయం. గోరువెచ్చటి కొబ్బరినూనెను, నిమ్మరసంతో కలిపి ఆశించిన ఫలితాలను పొందవచ్చు.

నిమ్మరసం:
తలపై పొట్టు రాలే చర్మానికి చుండ్రుతో కూడా సంబంధం ఉంటుంది. అందుకని, తలపై చర్మాన్ని నిమ్మరసంతో మసాజ్ చేయడం వల్ల చర్మం శుభ్రపడుతుంది. పొట్టు వృద్ధి చెందకుండా కూడా నివారించే౦దుకు ఇది ఎంతో చక్కటి గృహ నివారణోపాయం.

ఆపిల్ సిడార్ వెనిగార్:
ఈ వెనిగార్ ను పులిసిన ఆపిళ్ళ నుండి తీస్తారు, స్వేదనం చేయరు. ఆపిల్ సిడార్ వెనిగార్ ను తలపైన చర్మంపైన రాసి జుట్టు ఆధారాలను మూసివేసి, తద్వారా తలపైన చర్మంలో పొట్టుకు కారణమయ్యే మృత చర్మకణాలను నివారించుకోవచ్చు.

కొబ్బరి పాలు:
కొబ్బరి పాలు తలపైన చర్మంలో పొట్టును నివారించుకోవడానికి మరొక గృహ నివారణోపాయం. మీ జుట్టును కొబ్బరి పాలతో శుభ్రం చేసి 10 నిమిషాల పాటు వదిలెయ్యండి. తలపైన చర్మాన్ని మసాజ్ చేయడానికి మీరు దీనితో బాటు నిమ్మరసాన్ని కూడా వాడవచ్చు.

అలోవీర:
అలోవీర కూడా జుట్టులో చుండ్రును నివారిస్తుంది. ఇది చర్మానికి తేమను అందించి, తలపైన దెబ్బతిన్న చర్మానికి చికిత్సనందిస్తుంది. ఈ జెల్ ను పూసి, రాత్రంతా వదిలెయ్యండి. ఒక టోపితో కప్పండి. దీని వలన ఇది తలపైని చర్మంలోనికి ఇంకుతుంది. ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రం చేయండి.

టీ చెట్టు నూనె:
తలపైన చర్మంలోని పొట్టు వలన బాక్టీరియా పుట్టవచ్చు. దీని కారణంగా చర్మవ్యాధులు రావచ్చు. అందువల్ల, టీ చెట్టు నూనెను పూయండి. ఇది బాక్టీరియాను చంపేస్తుంది. పైగా తలపైన చర్మంలో పొట్టు రాకుండా కాపాడుతుంది కూడా.

ఆలివ్ నూనె:
తలపైన చర్మానికి తేమను అందించి, పొట్టును నివారిస్తుంది. ఆలివ్ నూనె జుట్టు పెరుగుదలకు కూడా పేరొందింది.

విచ్ హాజెల్:
తలపైన చర్మంలో అంటువ్యాధులకు కారణమయ్యే బాక్టీరియాను నివారించేందుకు, విచ్ హాజెల్ ను తలపై ఉండే చర్మం పైన పూయవచ్చు. పూలను మరిగించి, ఒక మెత్తటి ముద్దను తయారు చేసి తలపై ఉండే చర్మం పైన పూయండి. 30 నిమిషాల పాటు వదిలేసి, తర్వాత శుభ్రం చేయండి.



Click it and Unblock the Notifications