Latest Updates
-
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.?
గ్రే హెయిర్ నివారించడానికి అద్భుత చిట్కాలు..!
గ్రే హెయిర్: ప్రస్తుకాలంలో 20 ఏళ్ళకే కేశాలు రంగు మారుతున్నాయి. ఇలా ప్రీమెచ్యుర్ గ్రేయింగ్ హెయిర్ ఉందన్న స్ట్రెస్ హెయిర్ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. మీరు పనిచేసే చోటో పని ఒత్తిడి మరియు లక్ష్యాలను భయపడటం, వంటి వాటి వల్ల మీలో త్వరగా మీ బాస్, మధ్య వయస్సు వలే లేదా గ్రే హెయిర్ ఉన్నవారిలా మీరు కనబడవచ్చు. జుట్టులో మెలనిన్ వర్ణద్రవ్యం తరుగుదల వల్ల జుట్టు గ్రే కలర్ లో మారడానికి కారణం అవుతుంది. దాంతో చిన్న వయస్సులోనే చాలా మంది వయస్సు పైబడ్డవారిలా చేస్తుంది. 30-35ఏళ్ళలోపు వారికి గ్రే హెయిర్ కలిగి ఉండటం చాలా సాధార. జుట్టు మొదళ్ళల్లో మెలనోసైట్లు అనే కొన్ని కాణాలు ఉన్నాయి. అవి జుట్టుకు అవసరం అయ్యే సహజ రంగును ఉత్పత్తి చేస్తాయి.
మెలనోసైట్లు సహజ రంగును ఉత్పత్తి చేయడం ఆగిపోయినప్పడు జుట్టు సహజ రంగు కోల్పోతాయి. మహిళల్లో గ్రే హెయిర్ అత్యంత భయానకమైన పీడకల వంటిది. వారి అందంలో చిన్న లోపంలా కనిపించే ఈ గ్రే హెయిర్ ను నివారించాలంటే అందుకు కొన్ని హోం రెమడీస్ ఉన్నాయి. వాటి సహాయంతో గ్రే హెయిర్ ను నివారించవచ్చు. మరి ఆ హోం రెమడీస్ ఏంటో ఒకసారి చూద్దాం..

హెయిర్ ప్యాక్: హెయిర్ ప్యాక్ ను ఉసిరి మరియు హెన్నాతో తయారు చేస్తారు. ఈ రెండింటి మిశ్రమంతో తయారు చేసే ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల కొంత వరకూ గ్రేహెయిర్ ను నివారించవచ్చు. హెన్నాను పేస్ట్ లా తయారు చేసుకొని అందులో 3టేబుల్ స్సూన్ల ఉసిరి పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను జుట్టు మొదళ్ళ వరకూ బాగా పట్టించాలి. తర్వాత ఇది బాగా తడి ఆరే వరకూ ఉండి, నాణ్యమైన షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కేశాలకు నేచురల్ కలర్ మరియు ఆరోగ్యకరమైన జుట్టు పొందవచ్చు.

బ్లాక్ టీ: చిన్న వయస్సులోనే గ్రే హెయిర్ సమస్య ఉంటే, అందుకు బ్లాక్ టీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసి, అందులో టీఆకులు వేసి బాగా మరిగించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. తలస్నానం చేసిన తర్వాత ఈ నీటిని తలారా పోసుకోవాలి. బ్లాక్ టీ నీరు తలకు పోసుకొన్న తర్వాత షాంపూ వాడకూడదని గుర్తుంచుకోవాలి. ఈ హోం రెమడీ గ్రే హెయిర్ ను చాలా సున్నితంగా కవర్ చేసేస్తుంది.

కరివేపాకు: ప్రీమెచ్యుర్ గ్రే హెయిర్ ను నివారించుకోవాలంటే కరివేపాకును మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇవి హెయిర్ రూట్ కు శక్తిని అంధిస్తాయి. మరియు కొత్త కణాలకు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి మరియు నార్మల్ కలర్ ను కలిగి ఉంటాయి. కరివేపాకును చట్నీ రూపంలో లేదా మజ్జిగలో వేసుకొని తాగవచ్చు.

హెయిర్ ఆయిల్: కొబ్బరినూనెలో కరివేపాకు ఆకులను మరియు ఉసిరి కాయ ముక్కలను వేసి బాగా మరగ కాచి, చల్లార్చి బాటిల్లో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల కేశాలు స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా ఉంటాయి. మరియు ఒరిజినల్ కలర్ ను కలిగి ఉంటాయి. ఈ హెయిర్ ఆయిల్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల గ్రేహెయిర్ ను నివారించుకోవచ్చు.

అమారాంత్ జ్యూస్: కేశాలు తిరిగా ఒరిజినల్ కలర్ పొందడానికి మరియు ప్రీమెచ్యుర్ గ్రేహెయిర్ ను నివారించుకోవడానికి అమరాంత్ రసంను జట్టుకు మరియు తల మాడుకు పట్టించడం ఒక అద్భుతమైన మార్గం. ఈ వెజిటేబుల్ మీ జుట్టు పెరుగుదల వేగవంతం మరియు మృదువైన మరియు మెరిసేలా ఉంచడం కోసం ఉపయోగకరంగా ఉంటుంది.

ఆమ్లా: కేశాలను డార్క్ గా మరియు షైనింగ్ గా ఉంచడానికి ఆమ్లా హెయిర్ టానిక్ గా అద్భుతమైన ప్రయోజనాలను అంధిస్తుంది. ఇది జుట్టు పెరుగుదలతో పాటు మంచి రంగును అంధించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మీ ఒరిజినల్ హెయిర్ కలర్ కలిగి ఉండాలంటే బాదం ఆయిల్ ఆమ్లా జ్యూస్ ను మిక్స్ చేసి తలకు పట్టించాలి. చిన్న వయస్సులోనే ఆమ్లాను తలకు పట్టించడంలో ప్రీమెచ్యుర్ గ్రేహెయిర్ ను నివారిస్తుంది.



Click it and Unblock the Notifications
