Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
మీ జుట్టును నల్లగా.. ఒత్తుగా.. పొడవుగా మార్చే నూనెలు-మూలికలు
ఇప్పుడు ఎన్ని రకాల హెయిర్ డైలు, కలరింగ్‌లు వచ్చినా అమావాస్య చీకటంత నల్లగా నిగనిగలాడుతూ కురులు ఉండాలని ఏ మహిళైనా కోరుకుంటుంది. నల్లని ఒత్తైన జుట్టు ఆడవారికి మరింతగా అందాన్ని చేకూరుస్తాయి. అందుకే తమ అందానికి ప్రతిరూపమైన నల్లని నిగనిగలాడే జుట్టుకోసం ఆశపడని స్త్రీలు ఉండరంటే అతిశయోక్తి కాదు. కాని కొందరికి వెంట్రుకలు రాగి రంగులో నిర్జీవంగా ఉంటాయి. అలాంటి వారు నల్లని జుట్టు పొందడానికి చేయని ప్రయత్నమంటూ ఉండదు. అందమైన, నల్లని కురుల సంపద కోసం ఆడవారి తాపత్రయం చాలా ఉంటుంది. ఎవరికైనా ఒతైన జుట్టు కావాలని కోరుకుంటారు. అయితే జుట్టు పట్ల సరైన జాగ్రత్తలు, సంరక్షణ కలిగి వుంటే కురులను కాపాడుకోవచ్చు.
అందుకు కొన్ని హోం రెమడీస్ బాగా పనిచేస్తాయి. ఈ హోం రెమడీస్ ను ఫాలో అవ్వడం వల్ల తిరిగి మీ అందమైన నల్లటి కురులను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ హోం రెమెడీస్ మీ కేశాలను నల్లగా మార్చడమే కాకుండా కేశాలను బాగా ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఈ హోం రెమడీస్ లో కొన్ని సహజనూనెలు కూడా ఉన్నాయి. ఈ నూనెలు మీ కేశాలను సహజంగానే నల్లగా మార్చుతాయి. ఇంకా కేశాలను నల్లగా మార్చడానికి హేర్బ్ కూడా ఉన్నాయి. మీ కేశాలు ఎరుపు రంగులోనికి మారుతున్న కూడా ఈ హోం రెమడీస్ తిరిగా నల్లగా మార్చుతాయి. అందుకే మీరూ నల్లని కురులను సొంతం చేసుకోవాలనుకుంటే ఈ సలహాలు పాటించి చూడండి. నల్లగా నిగనిగలాడే అందమైన కురులు మీ సొంతమౌతాయి.

హాట్ ఆయిల్ మసాజ్: కేశాలకు కొన్ని నెలలుగా నూనెను పెట్టుకోకపోయినా కూడా బ్లాక్ రెడ్ హెయిర్ సమస్య మీకు ఏర్పడుతుంది. అంటే మీ కేశాలకు పోషణా అవసరం అని తెలుసుకోవాలి. కాబట్టి గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మీ కేశాలు తిరిగి నలుపు రంగులోనికి మారుతాయి.

కరివేపాకు: జుట్టును నల్లగా మార్చడంలో అద్భుతమైన ఫలితాలను ఇచ్చే మూలిక కరివేపాకు. తాజా కరివేపాకు ఆకలును వేడి నూనెలో వేసి కొద్దిగా వేడి చేయాలి. ఈ నూనెను బాగా చల్లరనివ్వాలి. ఒక వారం తర్వాత ఈ నూనెను తలకు మసాజ్ చేసుకోవడం వల్ల మీ కేశాలు నల్లగా మారుతాయి.

మందార నూనె: హెయిర్ పిగ్మెంటేషన్ కు హైబిస్కస్ ఆయిల్(మందార నూనె) చాలా అద్భుతంగా పనిచేస్తుంది. హైబిస్కస్ ఆయిల్ బయట మార్కెట్లో అందుబాటులో ఉంది. లేదా మందారం పువ్వు మొగ్గలను రెగ్యులర్ గా మీరు తలకు ఉపయోగించే నూనెలో వేసి వేడి చేసి చల్లరనిచ్చి తర్వాత లకు పెట్టుకుంటుండాలి.

ఆమ్లా ఆయిల్: ఉసిరికాయ ఆరోగ్యానికి మాత్రమే కాదు కేశాలకు కూడా బహువిధాలుగా సహాపడుతుంది. కాబట్టి మీ కేశాలకు నూనెతో మసాజ్ చేసుకొన్న తర్వాత ఆమ్లా ఎసెన్స్ లేదా ఉసిరి కాయ రసాన్ని తలకు పట్టించాలి. ఉసిరి కాయలను తినడం వల్ల ఆరోగ్యానికి ఇటు కేశాలకు చాలా మేలు చేకూరుతుంది.

సన్ డ్యామేజ్: ఎండలో ఎక్కువగా ఉండటం లేదా ఎక్కువగా తిరగడం వల్ల కూడా జుట్టు యొక్క రంగు మారిపోతుంది. సూర్యరశ్మిలోని యూవీ కిరణాలు చర్మానికి మాత్రమే కాదు కేశాలకు కూడా హాని కలిగించి జుట్టు రంగును మార్చడంతో పాటు జుట్టును డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి తలకు డైరెక్ట్ సన్ లైట్ (సూర్యకిరణాలు)తగలకుండా కాపాడుకోవాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో బయటకు వెళ్ళకూడదు. వెళ్ళినా తలకు క్యాప్ లేదా క్లాత్ వంటిది పెట్టుకోవాలి.

అశ్వగంధతో జుట్టు సంరక్షన: అశ్వగంధం పురాతకాలం నుండి ఉపయోగిస్తున్నా ఓ ఔషధ మూలిక. ఇది హిమాళయాల్లో పెరుగుతుంది. ఈ మూలికను జుట్టు సంరక్షణకు ఉపయోగించే అనేక ఔషదాల్లో ఉపయోగించడం జరిగింది. కాబట్టి ఈ అశ్వగంధం మూలిక యొక్క పౌడర్ ను నూనెతో మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల మీ కేశాలు ఒత్తుగా, నల్లగా పొడవుగా పెరుగుతాయి.

నువ్వుల నూనె: నువ్వుల నూనె జుట్టు ముదురు వర్ణం పొందడానికి బాగా సహాయపడుతుంది. కాబట్టి నువ్వులను నూనెను తలకు మసాజ్ చేయడంతో పాటు అప్పుడప్పుడు నువ్వులను తినడం కూడా ఇటు ఆరోగ్యానికి అటు కేశ సంరక్షణకు చాలా మంచిది.

క్యారెట్ జ్యూస్: కేశాల రంగును స్థిరంగా ఉంచడానికి మరియు ముదు వర్ణంలోనికి తీసుకు రావడానికి క్యారెట్ లోని కెరోటినాయిడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. అయితే క్యారెట్ రసాన్ని జుట్టుకు పట్టించడం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి జ్యూస్ కు బదులు క్యారెట్స్ అలాగే తినడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.

నిమ్మరసం: నిమ్మరసం కేశాలకు బహు ప్రయోజనాలు కలిగిస్తాయి. నిమ్మరసం కేశాలకు పట్టించడం వల్ల మీకేశాలు నల్లగా మారడంతో పాటు, తలలో చుండ్రును సులభంగా వదలగొడుతుంది. ఇంకా నేచురల్ హెయిర్ కండీషనర్ గా ఉపయోగపడుతుంది.

తలస్నానానికి రీటాను ఉపయోగించండి: కఠినమైన రసాయనిక షాంపూలు జుట్టును రంగును మార్చడంతో పాటు, జుట్టును డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ఆర్టిఫిషియల్ షాంపులకు బదులుగా నేచురల్ వస్తువులు (శీకాకాయ, కుంకుడుకాయ)వంటివి ఉపయోగించడం చాలా మంచిది.



Click it and Unblock the Notifications











