Latest Updates
-
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.?
తలదురదకు 10 శాశ్వత పరిష్కార మార్గాలు..!
అలర్జీ... ఈ పదాన్ని గురించి దాదాపు అందరూ వినే ఉంటారు. వాతావరణ కాలుష్యం వల్ల, శరీరానికి సరిపడని పదార్థాలు, అతిగా మందులు వాడటం, ఎక్కువసేపు నీటిలో నానడం, కలుషితమైన నిల్వ ఆహారం లేదా ఇతర కారణాల వల్ల ఈ అలెర్జీ తలెత్తుతుంది. అంటే... పొగ, దుమ్ము, ఇవే కాకుండా మనం తినే ఆహారం వల్ల కూడా అలర్జీ వస్తుంది. దీన్నే 'ఫుడ్ అలర్జీ' అంటాము. కొంతమందికి వారివారి శరీర తత్వానికి కొన్ని ఆహార పదార్థాలు సరిపడవు. ఇలా శరీరానికి పడని వాటిని తిన్న అరగంటలోపే మార్పులు కనిపిస్తాయి. కొంతమందికి గుడ్డు, మాంసం పడదు. ఇంకొందరికీ చేపలు పడవు.
అలర్జీ అనేది కేవలం శరీరంపై దద్దుర్ల రూపేణా మాత్రమే వస్తుందనుకోరాదు. తలలో కూడా వస్తుంది. తల దురదకు కేవలం పేలు, డ్యాండ్రఫ్ మాత్రమే కారణం అనుకోరాదు. అలర్జీ కూడా కారణమే. తల దురద వచ్చిందంటే ఆ బాధ చెప్పలేము. బాస్‌తో, సహోద్యోగులతో, స్నేహితులతోనో మాట్లాడే సమయంలో లేదా ఏమయినా ముఖ్యమైన పనులలో ఉన్నప్పుడు తల దురద పెడితే కలిగే చికాకు ఇంతా అంతా కాదు. తలలో దురద వచ్చిందనుకోండి! ఏం చేస్తాం! గోళ్లతో గోకి తాత్కాలికంగా సాంత్వన పొందుతాం.అలా గోకడం వల్ల తల మాడు ఎర్రబడం, పుండ్లుగా తయారవడం, ఇన్ఫెక్షన్ సోకడం వంటి వాటితో మొదలై దురుదకు దారి తీస్తుంది.
అయితే ఈ దురద వల్ల జుట్టుకు అనేక విధాలుగా సమస్యలు ఏర్పడుతాయి. తల దురదు ఇన్ఫెక్షన్ కూడా ఒక ప్రాధాణ కారణం అని మీరు తెలుసుకోవాలి. దురద లేదా చుండ్రు ఏదైనా సరే అది ఇన్ఫెక్షన్ వల్లే కలిగి ఉంటుంది. తల పొడిబారటం కూడా దురదకు ఒక కారణం కావచ్చు. ఈ హెయిర్ సమస్యను పూర్తిగా తొలగించుకోవడానికి కొన్ని హోం రెమడీస్ ఉన్నాయి. అందుకు కాస్త ఓపికగా ప్రయత్నించడం వల్ల తిరిగి ఎప్పటికీ రాకుండా జుట్టును రక్షించుకోవచ్చు.
తల దురదును నివారించడానికి క్రింద కొన్ని హోం రెమడీస్ ఉన్నాయి . ఈ సమస్యను ఆలస్యం చేసి మరిన్ని జుట్టు సమస్యలకు దారితీసేవరకూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ పరిష్కార మార్గంను ఫాలో అవ్వండి. మంచి ఫలితాలను పొందండి...
తలదురదకు ఇలా చెక్ పెట్టండి...

తలదురదకు ఇలా చెక్ పెట్టండి...!
అవొకాడో: అవొకాడో ఆయిల్ ను ఉపయోగించడం వల్ల ఇది వివిధ రకాలుగా తలదురదను నివారించడానికి పనిచేస్తుంది. నీటిలో గోరువెచ్చనీ అవొకాడో ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించాలి. లేదా అవొకాడో ఆయిల్ ను డైరెక్ట్ గా ఉపయోగించడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు . ఈ అవొకాడో ఆయిల్ ను యూకలిప్టస్ ఆయిల్ తో మిక్స్ చేసి కూడా ఉపయోగించవచ్చు . దాంతో దురద తగ్గి, కేశాలు కూడా అద్భుతమైన వాసన కలిగి ఉంటాయి.

తలదురదకు ఇలా చెక్ పెట్టండి...!
టీట్రీ ఆయిల్: ఈ నూనెలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తలలోని దురదను తొలగించడానికి బాగా సహాయపడుతాయి. ఒక కప్పు టీట్రీ ఆయిల్లో, ల్యావెండర్ ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించాలి. 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

తలదురదకు ఇలా చెక్ పెట్టండి...!
ఆలివ్ ఆయిల్: మన శరీరంలో ఏ అవయవానికి ఏ సమస్య ఉన్నా ఈ ఆలివ్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దురద పెట్టే తలకు కూడా మంచి ప్రయోజనకారిగా ఉంది. కాబట్టి ఆలివ్ ఆయిల్ ను తలకు పట్టించి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ జుట్టు సమస్యకు ఇది ఒక బెస్ట్ హోం రెమడీ.

తలదురదకు ఇలా చెక్ పెట్టండి...!
నిమ్మ: జుట్టుకు అనేక పోషక విలువలను అంధించే విటమిన్లు మరియు సిట్రస్ యాసిడ్ పుష్కలంగా ఉండి జుట్టు సమస్యలకు మంచి ప్రయోజనం కలిగిస్తుంది. కాబట్టి తలలో దురదగా ఉన్నట్లైతే , తాజాగా ఉండే నిమ్మకాయను కట్ చేసి తలలో మర్ధన చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. షాంపును వాడకుండా తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కేశాలు మంచి సువాసన కలిగి ఉంటాయి.

తలదురదకు ఇలా చెక్ పెట్టండి...!
బేకింగ్ సోడా: మీకేశాల మందం, పొడవును బట్టి సరిపడా బేకింగ్ సోడా తీసుకోవాలి. ఈ బేకింగ్ సోడాను కొద్దిగా నీళ్ళలో కలిపి జుట్టుకు పట్టించి తర్వాత తలస్నానం చేయాలి.

తలదురదకు ఇలా చెక్ పెట్టండి...!
మెంతులు: మెంతులను మెత్తని పౌడర్ లా తయారు చేసి, అందులో రోజ్మెరీ ఆయిల్ మిక్స్ చేసి, పల్చగా, లిక్విడ్ గా తయారు చేసుకోవాలి . ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి . తర్వాత షవర్ క్యాప్ తో తలను పూర్తిగా కవర్ చేసి, అరగంట నుండి ఒక గంట వరకూ అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసుకోవాలి.

తలదురదకు ఇలా చెక్ పెట్టండి...!
అలోవెరాజెల్: అలోవెరాలో అర్గానిక్ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఈ అలోవెరా జెల్ ను దురదగా ఉండే తలకు పట్టించి, తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది జుట్టు సమస్యలను తీర్చడంలో కాదు, కేశాలను మంచి షైనింగ్ తో ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

తలదురదకు ఇలా చెక్ పెట్టండి...!
కొబ్బరి నూనె: గోరువెచ్చని కొబ్బరి నూనె, అనేక జుట్టు సమస్యలను నివారంచడాని అద్బుతంగా సహాయపడుతుంది. దురద పెట్టి తలకు ఈ హాట్ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి తలకు పట్టించి తర్వాత తలస్నానం చేయాలి.

తలదురదకు ఇలా చెక్ పెట్టండి...!
హనీ(తేనె)మాస్క్: తేనె, అరటిపండు, ఉల్లిపాయ గుజ్జు మూడింటిని చిక్కటి పేస్ట్ గా తయారు చేసి, ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. పట్టించి అరగంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత వేడి నీళ్ళు, షాంపూతో తలస్నానం చేయడం వల్ల తలలో ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కరించబడుతుంది.

తలదురదకు ఇలా చెక్ పెట్టండి...!
పెరుగు: పెరుగును గుడ్డులోని తెల్లసొనతో మిక్స్ చేసి, తలకు పట్టించిడం వల్ల మంచి ప్రయోజనం కలిగిస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ దురదగా ఉండే జుట్టు సమస్యను నివారిస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ ను రెండు వారాలకొక్కసారైనా అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications
