Latest Updates
-
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక!
జుట్టును ఆరోగ్యంగా పెరిగిలా చేసే మన వంటగది ఔషధాలు...!
సాధారణంగా మనం అందరం మన అందంతో పాటు కేశ సంరక్షణకు కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కేశాలు ఎప్పుడు స్ట్రాంగ్ గా, పొడవుగా, మెరుస్తుండాలని కోరుకుంటాం. కేశ సంరక్షణ జాగ్రత్తలు పాటించడం చాలా కష్టం మరియు అందుకు పూర్తి అవగాహాన, సమయాన్ని వెచ్చించాలి. అందుకోసం బయట మార్కెట్లో చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఐతే ఈ కెమికల్ ప్రొడక్ట్స్ మీ కేశాలను డ్యామేజ్ చేయడంతో పాటు కేశాలలో షైనింగ్ తగ్గిపోతుంది. కాబట్టి రసాయబ్యూటీ ప్రొడక్ట్స్ మీద ఆధారపడకుండా మీ కేశాలను అందంగా కాపాడుకోవాలంటే కొన్ని హోమ్ ట్రీట్మెంట్స్ ను పాటించాలి.
మన వంటగదిలో ఉండే కొన్ని వస్తువులు కేశాలసంరక్షణలో అద్భుతమైన ఫలితాలను అంధిస్తాయి. ఉదాహరణకు, పెరుగు, నిమ్మరసం మరియు గుడ్లు వంటివి కురుల అందానికి నేచురల్ ప్రభావాన్ని కలిగిస్తాయి. మంచి కేశసంపదకోసం ఈ వస్తువులను కేశసంరక్షణలో ఉపయోగించే చాలా రకాల ట్రీట్మెంట్స్ లో ఉపయోగించి ఉంటారు. ఇవి ప్రకతి సిద్దమైనవి కను హెయిర్ డ్యామేజ్ ను తగ్గిస్తుంది.
ఈ వస్తువులను వివిధ హెయిర్ ప్రాబ్లెమ్స్ కు లేదా వివిధ రకాలై జుట్టుకు, నిర్జీవమైన కురులకు, చిక్కుబడిని కురులకు, చుండ్రు, పొడి జుట్టు, ఆయిల్ జుట్టు ఇలా రకరకాల హెయిర్ ట్రీట్మెంట్స్ కు ఉపయోగించి ఉంటారు. కాబట్టి మీరు కూడా మీ కేశాలను సంరక్షించుకోవడానికి నేచురల్ పద్దతులను ఉపయోగించి హెయిర్ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఐతే ఈ లిస్ట్ చూడండి. ఈ వంటగదిలో సులభంగా దొరికే, ఖర్చులేని వస్తువులను ఉపయోగించి మంచి ఆరోగ్యకరమైన కేశాలను సొంత చేసుకోండి.

గుడ్డు: వివిధ రకాల హెయిర్ ప్యాక్స్ లో గుడ్డును, ఉపయోగిస్తారు. గుడ్డును నిమ్మరసంతో కలిపి బాగా గిలకొట్టి అందులో రెండు చుక్కల తేనె మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయడం వల్ల మెరిసేటటువంటి, సున్నితమైన సిల్కీ హెయిర్ నేచురల్ గా పొందగలుగుతారు.

ఆపిల్ సైడర్ వెనిగర్: ఆపిల్ సైడర్ వెనిగర్ ప్రభావవంతమైన హెయిర్ కేర్ వస్తువు. దీన్ని పొడిబారిన మరయు డ్యామేజ్ అయిన హెయిర్ కేర్ ట్రీట్మెంట్ కోసం వినియోగిస్తారు. తలస్నానం చేసిన తర్వాత చివరగా ఆపిల్ సైడర్ వెనిగర్ ను కొన్ని చుక్కలు మగ్గులో వేసుకొని తల మీద పొసుకుంటే అందమైన కేశాలు మీ సొంతం అవుతాయి.

పెరుగు: పెరుగును వివిధ రకాల కురలు సమస్యలకు(చుండ్రు, చివరులు చిట్లడం, దురద, పొడిబారడం) ఉపయోగించి ఉంటారు. అంతే కాదు ఈ పెరుగుతో నేచురల్ గా కురులు సున్నితంగా తయారవుతాయి.

బేకింగ్ సోడ: బేకింగ్ సోడా నీళ్ళతో కలిపి, షాంపూ మరియు కండీషనర్ చేయడం వల్ల కురులు ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాదు బేకింగ్ సోడా తల మాడును పూర్తిగా శుభ్రపరుస్తుంది. తలలోని మలినాలను తొలగించి, జిడ్డు ను కూడా తొలగిస్తుంది.

నిమ్మరసం: హెయిర్ ఆయిల్ తో పాటు నిమ్మరసాన్ని కూడా తలకు పట్టించడం వల్ల తలమాడుకు సంబంధించి సమస్యలను నివారిస్తుంది. దురుద, జిడ్డు, చుండ్రు వంటివాటిని మంచి నివారినిగా దీన్ని ఉపయోగించవచ్చు.

తేనె: డ్యామేజ్ అయిన హెయిర్ చూడటానికి నిజంగా చిక్కుబడి ఉంటుంది. చర్మ సంరక్షణలోనూ, కేశ సంరక్షణలోనూ తేనె నేచురల్ మాయిశ్చరైజర్. ఇది మన వంటగదిలో ఎప్పుడూ నిల్వవుండే వస్తువే కాబట్టి మీ హెయిర్ ప్యాక్స్ లో దీన్ని కలుపుకోవచ్చు. దాంతో కురులు సాఫ్ట్ గా..సిల్కీగా మార్చుతాయి.

కార్న్ స్ట్రాచ్: మొక్కజొన్న పిండితో తయారుచేసే గంజి జిడ్డు వెంట్రుకలకు బాగా పనిచేస్తుంది. ఇది మన వంటగదిలో ఉండే వస్తువే కాబట్టి , కురుల్లో జిడ్డును తొలగించడానికి దీన్ని నేచురల్ గా వాడవచ్చు.

అవొకాడో్: చర్మ మరియు కురుల సంరక్షణలో అద్భుతమైన ఫలితాలనందిస్తుంది ఈ అవొకాడో. వివిధ రాకాలైన హెయిర్ ట్రీట్మెంట్స్ లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.



Click it and Unblock the Notifications
