Latest Updates
-
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.! -
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే!
జుట్టు రాలడాన్ని తగ్గించి..జుట్టు సంరక్షించే సీడ్స్
సాదారణంగా ప్రతి మహిళకు తమ జుట్టు పొడవైన మరియు ఒత్తుగా ఉండాలని ఒక కల ఉంటుంది. దీని కొరకు సంరక్షణ చాలా అవసరం. మేము ఎల్లప్పుడూ మా జుట్టు సంరక్షణ కోసం కృత్రిమ ఉత్పత్తులు లేదా అందుబాటులో ఉండే మందులను ఉపయోగిస్తూ ఉంటాము. అయితే వాటి వల్ల జుట్టుకు హానికరమైన దుష్ప్రభావాలు కలుగుతాయని మర్చిపోకూడదు. జుట్టు సంరక్షణ కోసం పోషక ఆహారం తీసుకోవటం అనేది ఉత్తమ విషయాలలో ఒకటిగా చెప్పవచ్చు.
మేము రుతుపవనాలు తీసుకొచ్చే సున్నితత్వము,గాలి వాతావరణము,అందమైన పుష్పాలు మొదలైన వాటిని చూసి ఆశ్చర్యపోవటం జరగవచ్చు. అయితే వర్షాకాలం సమయంలో మా జుట్టు మరియు చర్మం నాశనం కావచ్చు. నేడు జుట్టు తెగిపోవటం అనే విషయం చాలా సాదారణం అని చెప్పవచ్చు. అందమైన జుట్టు కావాలంటే మాత్రం తగినంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి యవ్వనం లేదా ముసలి వయస్సు అనే పట్టింపు లేదు. ఒక మంచి మార్గంలో వారి జుట్టు పట్ల శ్రద్ధ వహించే వ్యక్తులు ఉన్నారు.
మీరు కృత్రిమ మార్గాలను అనుసరించుట వలన కొంతకాలం వరకు మీ జుట్టు మంచిగా నిర్వహించడానికి సహాయపడుతుంది. కానీ దీర్ఘకాలంలో అది హానికరముగా మారవచ్చు. ఏమైనప్పటికీ సీడ్స్(గింజలు) జుట్టు సంరక్షణ సురక్షితం అని చెప్పవచ్చు. మీరు ఈ గింజలను ఉపయోగించి సహజ జుట్టు సంరక్షణ కొరకు ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు. మీకు సులభంగా అందుబాటులో ఉండే గింజలతో అద్భుతమైన ఫలితాలను తీసుకురావచ్చు. ఇక్కడ మీకు మెరుగైన జుట్టు సంరక్షణకు ఉపయోగపడే గింజలు కొన్ని ఉన్నాయి.

జుట్టు నష్టం కొరకు మెంతులు
మెంతులు సులభంగా అందుబాటులో ఉండే సహజ జుట్టు సంరక్షణ పరిష్కారాలలో ఒకటిగా ఉందని చెప్పవచ్చు. మెంతి గింజల చికిత్స అనేది చవకైనది మరియు పూర్తిగా ఇంటిలో తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా సులభంగా సమీపంలోని స్టోర్ నుండి కొనుగోలు చేయవచ్చు. మెంతి గింజలు జుట్టు సంరక్షణకు ఎక్కువ లాభాలను చేకూర్చే జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నది. సహజ జుట్టు సంరక్షణ ప్యాక్స్ ను మెంతులను ఉపయోగించి తయారు చేయవచ్చు.ఇది జుట్టును బలంగా చేస్తూ కొంత మేరకు జుట్టు కోల్పోకుండా నిరోధిస్తుంది.

నువ్వు గింజలతో గ్రే కలర్ వదిలించుకోవటం
మీకు గింజలతో జుట్టు సంరక్షణ కోసం ప్రయత్నిస్తుంటే అప్పుడు నువ్వు గింజలు ఉపయోగించి ప్రయత్నించండి. నువ్వు గింజలు ఖచ్చితంగా చాలా మంచివి. గ్రే కలర్ ను తగ్గించటానికి బాగా సహాయపడతాయి. మీకు చెయ్యవలసిన పని ఏమిటంటే ప్రతి రోజు ఒక స్పూన్ నువ్వు గింజలను రెండు మూడు నెలల పాటు తీసుకొంటే మీరు గణనీయమైన తేడాను గుర్తించవచ్చు. ఇంకా అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు సహజ జుట్టు సంరక్షణ ప్యాక్స్ గా కూడా సిద్ధం చేయవచ్చు.

చేదు కానీ తీపి
మీరు వేప గురించి ఆలోచించినప్పుడు వెంటనే మీ మనస్సులో మొదటగా చేదు రుచి గుర్తుకువస్తుంది. ఏమైనప్పటికీ దానిలో చాలా ఔషధ లక్షణాలు ఉన్నాయి. వేప గింజ నూనె కూడా ఉత్తమ గింజల జుట్టు సంరక్షణలలో ఒకటిగా ఉంది. ఇది అద్భుతమైన ఫలితాలను తీసుకురావటం మరియు మీ జుట్టు అందంగా కనిపించేలా చేస్తుంది. అంతేకాక జుట్టును ఆరోగ్యంగా చేస్తుంది.

రుచికరమైన గింజలతో జుట్టు సంరక్షణ
దానిమ్మ ఒక రుచికరమైన పండు అని మేము అంగీకరిస్తున్నాము. దానిలో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మ గింజలు జుట్టు సంరక్షణ కొరకు ఒక కీలకమైనదిగా చెప్పవచ్చు. దీనిలో ఉండే హైడ్రేట్లు మీ జుట్టు పోషణకు సహాయపడతాయి. దీనిని మెరుగైన ఫలితాల కోసం బాదం నూనె లేదా జొజోబా నూనెతో పాటు ఉపయోగిస్తారు. మీరు కూడా దానిమ్మ రసం ఉపయోగించి సహజ జుట్టు సంరక్షణ ప్యాక్స్ ను సిద్ధం చేయవచ్చు.

గ్రేప్ సీడ్ నూనె
గింజల జుట్టు సంరక్షణ విషయానికి వచ్చినప్పుడు గ్రేప్ సీడ్ నూనె టాప్ పద్ధతులలో ఒకటిగా ఉంటుంది. గ్రేప్ సీడ్ నూనె చవకైనది మరియు మీ జుట్టులో తేమ నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. మీరు వేడి నూనె చికిత్సలలో కూడా దీనిని ఉపయోగించవచ్చు.

క్రాన్బెర్రీ సీడ్ మేజిక్
క్రాన్బెర్రీ గింజలను చాలా కాలం నుండి జుట్టు సంరక్షణ కొరకు ఉపయోగిస్తున్నారు. ఇది జుట్టు తేమను అలాగే ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాక పొడి జుట్టును నిరోధిస్తుంది. జుట్టుకు ఉన్న అత్యధిక సమస్యలలో పొడి జుట్టు సమస్య ఒకటిగా చెప్పవచ్చు. మీరు పొడి జుట్టు సమస్యను వదిలించుకుంటే అప్పుడు జుట్టు సంరక్షణ సులభం అవుతుంది. జుట్టు సంరక్షణకు గింజలతో చెప్పిన చిట్కాలను ప్రయత్నించి ప్రయోజనాలను ఆస్వాదించండి.



Click it and Unblock the Notifications