Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
వేసవిలో చెమట వల్ల రాలే జుట్టుకు నివారణ చిట్కాలు...!
వేసవి కాలంలో చెమటకారణంగా జుట్టు రకరకాల సమస్యలను ఎదుర్కొంటుంది. జుట్టు మరింత జిడ్డుగా, డ్రై జుట్టు పొడిగా, నిర్జీవంగా మారిపోతాయి. చిట్లిపోతాయి. సాధారణంగా వెంట్రుకల్లో చెమట రావడం కారణంగా జుట్టు జిడ్డుగా మారతాయి. దీంతో స్కాల్ఫ్ పై మొటిమలు, చుండ్రు లాంటివి ఏర్పడి జుట్టు రాలిపోతుంటాయి. ఈ కాలంలో జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తుండా లంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
వాతావరణంలో వచ్చే తేడాల వలన, ఉష్ణోగ్రతల తారతమ్యం వలన రకరకాల కేశసంపద కలిగిన వ్యక్తులను ఒకే చోట చూసే అవకాశం అప్పుడప్పుడు మనకు కలుగుతుంది. సాధారణంగా వివిధ రకాల శిరోజాలు (కర్లింగ్, సాప్ట్, రఫ్, పొడి, జిడ్డు జుట్టు)కలిగిన వ్యక్తులను ఒకే చోట చూసే అవకాశం అప్పుడప్పుడు మనకు కలుగుతుంది. సాధారణంగా జుట్టు ఏరకానికి చెందినదైనా అవి ఆరోగ్యంతో నిగనిగలాడుతుంటేనే వాటికి చక్కగా అలంకరించడం సాధ్యమవుతుంది.
ఎండిపోయి నిర్జీవంగా మారిపోతే వాటిని ఎటువంటి స్టైయిల్ లో అలంకరించినా అతికించినట్లుగానే ఉంటాయి తప్ప సహజసిద్దమైన రంగు వాటికి కనబడదు. జుట్టు నిర్జీవంగా మారిపోకుండా ఉండాలంటే వాటికి అప్పుడప్పుడు ఎంత తేమ అవసరమవుతుందో పరీక్షించి చూసుకోవడం చాలా మంచిది. మరి కేశాలకు సంబంధించిన కొన్ని చిట్కాలు మీకోసం...

చెమట వల్ల రాలే జుట్టుకు నివారణ చిట్కాలు...!
అరటి పండు-తేనె: రెండు అరటి పండ్లను మెత్తని గుజ్జులా చేసుకోవాలి. రెండుటేబుల్‌స్పూన్ల తేనెను అందులో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, అరగంట తర్వాత తల స్నానం చేయాలి. ఇది పొడిబారిన జుట్టుకు చక్కని పరిష్కారం. ఇలా చేస్తే మీ జూట్టు పట్టులా మెరుస్తుంది.

చెమట వల్ల రాలే జుట్టుకు నివారణ చిట్కాలు...!
నువ్వుల నూనె-ఉసిరికాయ: జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఉసిరికాయ రసం, నువ్వుల నూనె సమపాళ్ళలో కలిపి, కాచి తలకు రాసుకోవాలి.

చెమట వల్ల రాలే జుట్టుకు నివారణ చిట్కాలు...!
గుడ్డు - నిమ్మరసం:ఒక కోడిగుడ్డులోని సొనను చిన్న గిన్నెలో వేసి బాగా చిలకరించి అందులో ఒక నిమ్మపండు రసం కలపండి. నాలుగు చెంచాల పెరుగును కూడా ఈ సొనకు కలిపి తలకు పట్టించి అరగంటసేపు వుండండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మీ వెంట్రుకలు మృదువుగా, కాంతివంతంగా వుంటాయి.

చెమట వల్ల రాలే జుట్టుకు నివారణ చిట్కాలు...!
కొబ్బరి నూనె-వెల్లుల్లిపాయ: కొబ్బరినూనెలో వెల్లుల్లిపాయలను ఉడికించి, వడకట్టి ప్రతిరోజూ తలకు రాస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి.

చెమట వల్ల రాలే జుట్టుకు నివారణ చిట్కాలు...!
ఉసిరి పొడి: ఉసిరి పొడిని ఇనప పాత్రలో రాత్రిపూట నానవేసి ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని బ్రష్‌తో వెంట్రుకలకు పట్టించండి. అనంతరం తలకు షవర్ క్యాప్ పెట్టుకోవడం వల్ల మిశ్రమం ఒంటి మీద పడదు. గంట తర్వాత స్నానం చేస్తే సరి.

చెమట వల్ల రాలే జుట్టుకు నివారణ చిట్కాలు...!
సన్ స్క్రీన్ లోషన్: ఎండలో బయటకి వెళ్ళినపుడు సన్‌స్క్రీన్‌ని చర్మ సంరక్షణ కోసం వాడుతుంటారు. అలాగే ఎక్కువ సేపు ఎండలో తిరగాల్సి ఉన్నప్పుడు సన్‌స్క్రీన్ ఉన్న జుట్టు ఉత్పత్తులను వాడవచ్చు.

చెమట వల్ల రాలే జుట్టుకు నివారణ చిట్కాలు...!
ఉల్లిపాయ-తేనె: ఎక్కువగా జుట్టు రాలుతోందా ఒక ఉల్లిపాయను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచాడు తేనె కలపాలి. తలకు పట్టించి గంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.

చెమట వల్ల రాలే జుట్టుకు నివారణ చిట్కాలు...!
దంపుడు బియ్యం: ఒక కప్పు దంపుడు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. అన్నం ఉడికిన తర్వాత బియ్యాన్ని విడిగా తీయగా వచ్చిన గంజిని చల్లారబెట్టాలి. ఈ గంజిని ఆరిన తర్వాత కనీసం మూడుసార్లు జుట్టుకు పట్టించాలి. తర్వాత చల్లని నీటితో శిరోజాలను శుభ్రపరుచుకోవాలి. ఇది జొన్న పీచులా పలుచగా ఉండే జుట్టును ఒత్తుగా చేస్తుంది.

చెమట వల్ల రాలే జుట్టుకు నివారణ చిట్కాలు...!
బీట్ రూట్ రసం: ఒక్కోసారి తలంతా దురద పుడుతుంది. అలాగని ఊరికే గోకుతుంటే మాడు పుండు పడుతుంది తప్ప దురద మానదు. ఇందుకు బీట్ రూట్ రసం మంచి చికిత్స. అందుకు ఏం చేయాలంటే తాజా బీట్ రూట్‌ను చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో చిక్కటి రసం తీయాలి. దీనిని నేరుగా తలకు పట్టించుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. జుట్టు పట్టులా మెరుస్తుంది.

చెమట వల్ల రాలే జుట్టుకు నివారణ చిట్కాలు...!
పెరుగు: కొంతమంది జుట్టు జిడ్డుగా, నూనె కారుతూ ఉంటుంది. తలస్నానం చేసిన కొద్దిసేపటికే జుట్టు జిడ్డుగా తయారై రాలిపోతుంటుంది. ఇటువంటివారు ఒకవేళ కండీషనర్ వాడదలుచుకుంటే పెరుగును మాత్రం వాడుకోవాలి. కండీషనర్‌ను తలకు కాకుండా వెంట్రుకల కొసలకు ప్రయోగించాలి. స్నానానికి ఉపయోగించే నీళ్లకు కొద్దిగా నిమ్మరసాన్ని చేర్చితే జిడ్డు వదులుతుంది.



Click it and Unblock the Notifications