Latest Updates
-
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి! -
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా?
సెక్సీ సమ్మర్ హెయిర్ స్టైల్ ట్రెండ్ 2013
మండు వేసవి ఎండ ఎంత చికాకు పెడుతుందో అది వర్ణనాతీతం. చంటిపిల్లల దగ్గర్నించి పండు ముసలివాళ్ళు కూడా తట్టుకోలేనంత ఉష్ణోగ్ర తలు పెరిగిపోతున్నాయి. ఈ వేసవిలో పగలు బయట అడుగు పెట్టాలంటే మనకు టైట్ గా ఉండే దుస్తులు ధరించాలంటే అస్సలు ఇష్టం ఉండు. కాటన్ దుస్తులు, షర్ట్స్, స్లిప్పర్ మొదలగునవన్నీ బేసిక్ సమ్మర్ ఫాషన్ హెయిర్ స్టైల్. అయితే హెయిర్ స్టైల్ సంగతేంటి..?అంటే ఇక్కడ వివిధ రకాల హెయిర్ స్టైల్స్ ఉన్నాయి. ఇవి మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి..మరియు సహజంగా కనబడేలా ఆకర్షనీయంగా ఉంటాయి. అయితే మనందరమూ వేసవి కాలంలో అతి చురుకైన బలమైన సూర్యకిరణాల నుండి వెలువడే యూవీ కిరణాల నుండి రక్షణ పొందాలి. మరియు భుజాల మీద తాకకుండా కాపాడుకోవాలి.
వేసవి ఫ్యాషన్లు చాలా కూల్ మరియు స్టైల్ గా ప్రస్తుత ట్రెండ్ ను అలరిస్తుంటాయి. ఒక వేళ మీరు జుట్టును ముడి వేసుకొన్నా కూడా అది స్టైల్ గానే కనబడుతుంది. అంతే కాదు ఇది చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది.! వేసవిలో ఏర్పడే అధిక చెమట వల్ల మీ కేశాలు అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి. అంతే కాదు చిక్కు బడకుండా ఉంటాయి. పోనీటైల్స్, బ్రైడ్స్, రఫ్ కర్ల్స్, వేవ్స్, పిక్సీ కట్ మొదలగువన్నీ 2013 సమ్మర్ హెయిర్ స్టైల్స్. ఈ సెక్సీ హెయిర్ స్టైల్స్ సమ్మర్ లో ఏ అకేషన్(సందర్బానికైనా)సరిపోతాయి. మరి ఆ సమ్మర్ సెక్సీ హెయిర్ స్టైల్స్ ఏంటో ఒకసారి చూద్దామా...

రఫ్ ఫిష్ స్టైల్ సైడ్ బ్రైడ్: ప్రముఖ హాలివుడ్ సెలబ్రెటీ క్రిస్టెన్ స్టీవర్ట్ రీసెంట్ గా ఈ హెయిర్ స్టైల్ ను స్టైల్ గా ధరించింది. ఇది చూడటానికి కూల్ గా సెక్సీగా కనిపించింది.

పిన్ హెయిర్: ఇది చాలా అందంగా ఉండటమే కాదు ఇది సాయంత్ర సమయాల్లో బయట వెళ్ళే వారికి ఫర్ ఫెక్ట్ లుక్ ను అందిస్తుంది . ఇది చాలా సింపుల్ కేశాలకు ఒక పిన్ పెట్టి కేశాలను అలాగే ఫ్రీగా వదిలేయాలి అంతే. మీరు ఇంకా కావాలనుకుంటే పోనీటైల్ మాదిరిగా వేసుకోవచ్చు.

రఫ్ హెయిర్: ఈ హెయిర్ స్టైల్ చాలా సెక్సీగా కనబడుతుంది. ఈ సమ్మర్ హెయిర్ స్టైల్ తో స్టార్స్ సైతం కోలే కర్ధాషియన్, దీపికా పదుకొనే, మరియు సెలీన గోమేజ్ వంటి స్టార్స్ ఈ 2013ట్రెండీ హెయిర్ స్టైల్స్ తో అలరిస్తున్నారు.

లూజ్ హెయిర్: మీకు స్ట్రెయిట్ హెయిర్ ఉన్నట్లైతే, ఈ బ్రైట్ సమ్మర్ లో మీరు ఈ హెయిర్ స్టైల్ ను ప్రయత్నించవచ్చు. ఇది చూడటానికి చాలా కూల్ గా ఉంటుంది.

సాఫ్ట్ కర్ల్స్: కర్లీ హెయిర్ స్టైల్ గతంలో బాగా ఫేమస్ . మరి ఈ స్టైల్ మళ్ళీ మనముందుకు ట్రేండీగా వస్తోంది. కర్లి హెయిర్ చూడటానికి ఒత్తుగా అందగా..ఆకర్షణీయంగా కనబడుతాయి.

స్ట్రెయిట్ హెయిర్: ప్రస్తుత రోజుల్లో ఈ హెయిర్ స్టైల్ కు చాలా మంది ప్రాధాన్యత ఇస్తున్నారు . ఈ హెయిర్ స్టైల్ మీ అందాన్ని పూర్తిగా మార్చేస్తుంది మరియు హాట్ గా కనబడేలా చేస్తుంది. ఒక సారి ప్రయత్నించి చూడండి

వెట్ హెయిర్: ఎప్పుడైతే హాలీవుడ్ సెలబ్రెటీ జెన్నీఫర్ లారెన్స్ ఆస్కార్స్ లో రెడ్ కార్పెట్ మీద ఈ వెట్ హెయిర్ స్టైల్ తో నడిచినప్పుడు..అప్పుడు అనిపించి ఇది ఈ హాట్ సమ్మర్ కు ట్రెండీ హెయిర్ స్టైల్ అని! వెట్ హెయిర్ చూడటానికి సెక్సీ గా కనిపిస్తుంది.

పిక్సి కట్(మెరిసేలా కట్ చేసుకోవడం): మైలీసైరస్ ఈ బోల్డ్ మరియు రాక్ స్టార్ హెయిర్ కంట్ ట్రెండ్ తో రెడ్ కార్పెట్ మీద అలరించింది. సమ్మర్ ఫాషనర్స్ కు కొత్త ట్రెండ్ ను పరిచయం చేసింది. మీ కేశాలను ఇలా షార్ట్ గా మరియు స్టైలిష్ గా చూసుకోవాలంటే ఈ సమ్మర్ హెయిర్ స్టైల్ ను ట్రై చేయండి.

టాప్ నాట్(నడినెత్తిమీద ముడి వేయడం):చాలా మంది సెలబ్రెటీలు టాప్ నాట్ హెయిర్ స్టైల్ ను ప్రస్తుత ట్రెండ్ లో బాగా ఫాలో అవుతున్నారు. ఇది సౌకర్యవంతంగా మరియు చాలా నైస్ గా కనిపిస్తుంది.

బీహైవ్ పోనీటైల్: ఈ సమ్మర్ పార్టీలో అల్ట్రా చిక్ లుక్ తో కనబడాలనుకుంటున్నారా? మరి అయితే ఈ సెక్సీ బీహైవ్ పోనీటైల్ ను ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications