జుట్టు రాలడాన్ని తగ్గించి..జుట్టు పెరిగేలా చేసే నీలగిరి థైలం...

సాధారణ జనాలకి కూడా నీలగిరి తైలంగా చేరవైన యూకలిప్టస్‌ ఆయిల్‌ సహజ సిద్దంగా ప్రకృతి ప్రసాదించిన ఓ దివ్వ ఔషధంగా చెప్తారు. శరీరంలోని అనేక రుగ్మతలనుతగ్గించే ఈ యూక లిప్టస్‌ ఆయిల్‌ మహిళలకు అందాలను కూడా ఇవ్వటంలోనూ ముందుంది. యూకలిప్టస్‌ ఆయిల్‌తో శరీరాన్ని మసాజ్ చేయించుకుంటే శరీరాన్ని చల్లబరచి, వేడిమి ఎక్కువ కాకుండా చూస్తుంది. అంతే కాకుండా అనేక రకాల బాక్టీరియాలను సంహరించటంలో ప్రత్యేకత చూపే ఈ ఆయిల్‌ వల్ల శరీరం తాజా దనాన్ని సంతరించుకోవటంతో కొత్త ఉత్సాహం పుట్టు కొస్తుంది. సహజ సిద్దంగా మంచి సువాసనలు కలిగినది కావటంతో చర్మంపై వచ్చే పుళ్లు, యోని సంబంధిత దురద వ్యాధులకు ఉపయోగ పడుతుంది. ఒళ్లునొప్పులతో బాధపడేవారు ఒక బకేట్‌ వేడి నీళ్లలో రెండు కప్పుల యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి స్నానం చేస్తే... కీళ్ల నొప్పు లు, శారీరక నొప్పులు కనుమరుగై హాయిగా నిద్ర పడుతుంది. భుజాలు, వీపు భాగాలలో యూకలిప్టస్‌ ఆయిల్‌కి కొద్దిగా విటమిన్‌ ఇని కలిపి మర్ధన చేస్తే ఫలితాలుంటాయి. చర్మంపై మచ్చలు ఉండే వారు వాటిపై ఈ నూనెను రాస్తే... మచ్చలు పోవటంతో పాటు చర్మం కొత్త నిగారింపులు సంతరించుకుంటుంది.

యూకలిప్టస్‌ ఆకులు నీటిలో మరగబెట్టి ఆ నీటిని చల్లని నీటితో గోరువెచ్చగా చేసుకుని స్నానం చేస్తే చర్మంలోని మలినాలు అన్నీ పోతాయి. సూక్ష్మక్రిములు నశించి, శరీరం లోని ఇతర నొప్పు లు కూడా తగ్గిపోతాయి. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏమిటంటే, అనుకోకుండా అపస్మారక స్థితిలో పడిపోయినవారికిగానీ, మూర్చ వచ్చి పడిపోయిన వారికి గాని, ఈ యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు చుక్కలు రుమాలులో వేసి ముక్కుదగ్గర పెడితే వెంటనే లేచి కూర్చుంటారు. ఈ యూకలిప్టస్‌లో ఉన్న సినియోల్‌ అనే పదార్ధం వల్ల ఇది యాంట ీబయాటికగాే కూడా ఉపయోగపడుతుంది. ఇందులో బాక్టీరియాని నాశనం చేసే గుణం ఉంది. ప్రతిరోజూ పెద్దవాళ్ళు యూకలిప్టస్‌ ఆకుల కషాయాన్ని పావు చెంచాడుగాని, అర చెంచాడుగాని ఒక కపðడు వేడి నీటితో ఉదయం, మద్యాహ్నం సాయంత్రం తీసు కుని, 10-15 నిముషాల సేపు మరే ఇతర పదార్ధం తీసుకోకుండా ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరంలోని సూక్ష్మక్రిములు నాశనం అవడమేకాకుండా, అంటువ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

Treat Hair Fall With Eucalyptus Oil

యూకలిప్టస్ ఆయిల్లో హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే కాదు బ్యూటీ బెనిఫిట్స్ కూడా అధికంగా ఉన్నాయి. ఈ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రో బాగా ఉంటుంది. చాలా మంది జుట్టు పొడవుగా, మందంగా పెరగడానికి ఈ యూకలిప్టస్ ఆయిల్ ను వినియోగిస్తుంటారు. ఈ యూకలిప్టస్ ఆయిల్ తల మాడు మీద బాగా పనిచేస్తుంది. దురద, చుండ్రు వంటి సమస్యలను రానివ్వదు. యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ మైక్రోబైల్ మరియు యాంటీ వైరల్ ప్రొపర్టీస్ వంటివి తల మాడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతాయి. కురులు పెరిగేలా చేస్తాయి. ఈ యూకలిప్టస్ ఆయిల్ చాలా రకాలైన హెయిర్ ఆయిల్స్ లో వినియోగించడం జరుగుతోంది. కాబట్టి మీ కురులు పొడవుగా దట్టంగా పెంచుకోవలంటే ఈ యూకలిప్టస్ ఆయిల్ ను వినియోగించడం మంచిది.

కేశాలకు యూకలిప్టస్ ఆయిల్ ట్రీట్మెంట్:
1. యూకలిప్టస్ ఆయిల్ ట్రీట్మెంట్: తల మాడును ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచి కురులు పెరిగేలా చేస్తుంది. కాబట్టి గోరివెచ్చని యూకలిప్టస్ ఆయిల్ ను తలకు బాగా మర్ధన చేయండి. రాత్రంతా ఆలాగే ఉంచి, ఉదయం షాంపూ మరియు కండీషనర్ తో తలస్నానం చేయడం వల్ల మంచి సువాసన వస్తుంది. అంతే కాదు కురులు పెరిగేలా చేసి, సున్నితంగా ఉంచితుంది.

2. యూకలిప్టస్ ఆయిల్ -నిమ్మరసం: ఒక గిన్నెలో గోరువెచ్చని యూకలిప్టస్ ఆయిల్ వేసి, అందులోనే కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి, ఈ వేడి నూనెను తలకు మర్ధన చేయలి. దాంతో బ్లడ్ సర్కులేషన్ జరిగి జుట్టు పెరగడానికి దోహదం చేస్తుంది. 10-15 ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ ను అరికడుతుంది. కొత్త హెయిర్ పెరగడానికి సహాయపడుతుంది.

3. యూకలిప్టస్ ఆయిల్-రోస్మెరీ ఆయిల్: ఇది మరొక హెయిర్ ఎసెన్సియల్ ఆయిల్. దీన్ని యూకలిప్టస్ నూనె, రోజ్మెరీ నూనె, కాస్ట్రో ఆయిల్ తో తయారు చేస్తారు. ఈ మూడింటిని కలిపి గోరువెచ్చగా వేడి చేసి తలకు మర్ధన చేయాలి. తర్వాత తలకు టవల్ చుట్టేసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే హెయిర్ గ్రోత్ అవుతుంది.

4. యూకలిప్టస్ -బాదాం ఆయిల్: ఈ నూనె జుట్టు పెరగడానికి, డ్యామేజ్ అయిన కురులను తిరిగి బాగు చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ రెండు ఆయిల్స్ ను మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల హెయిర్ స్ట్రాంగ్ గా ఉంటుంది. కురులు సున్నితంగా, మంచి మెరుపుతో ఉంటాయి.

5. యూకలిప్టస్ ఆయిల్-మందరాపువ్వులు: మందార పువ్వులను నీళ్ళలో బాగా ఉడికించి, వడగంటి పువ్వులను పేస్ట్ లా తయారు చేయాలి. ఈ పేస్ట్ కు యూకలిప్టస్ నూనె కొద్దిగా చేర్చి, తలకు మర్దనా చేయాలి. అరగంట అలాగే వదిలేసి తర్వాత మందారపువ్వు ఉడికించిన నీళ్ళను తలకు కండీషనర్ గా ఉపయోగించి ఆ తర్వాత తలస్నానం చేయాలి. దాంతో హెయిర్ ఫాల్ ను అరికట్టి, కురులు పెరిగేలా చేస్తుంది.

Story first published: Thursday, January 31, 2013, 15:08 [IST]
Desktop Bottom Promotion