Latest Updates
-
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే!
అనేక జుట్టు సమస్యలకు మంచి పరిష్కారం మెంతులు.!
ప్రస్తుత రోజులలో జుట్టు రాలటమనే సమస్యను మహిళలు సైతం ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలడానికి అనేక పరిష్కార మార్గాలున్నాయి. అందులో రసాయనిక ఉత్పత్తులు మరియు హోం రెమెడీస్. జుట్టురాలడాన్ని అరికట్టడంలో అనేక మార్గాలున్నా కూడా వాటిలో ఏ ఒక్కటీ మంచి ఫలితాలను ఇవ్వలేదు. ఇప్పటీకి జుట్టు సమస్యలు అలాగే ఉన్నాయి. కొద్దో గొప్పో మార్పు కనపిస్తుంది కానీ పూర్తిగా ఎటువంటి మార్పు ఉండదు. అందులో ఈ మద్యకాలంలో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్స్ పుట్టుకొచ్చాయి . కాబట్టి కెమికల్ బేస్డ్ ఉత్పత్తులను జుట్టుకు ఉపయోగించడం కంటే సహజంగా ప్రక్రుతి పరంగా లభించే వాటిని మనం ఉపయోగించడం చాలా మేలు.
ప్రస్తుత రోజుల్లో 40 ఏళ్లు పైబడితే చాలు బట్టతల వచ్చేస్తోంది. దీనికి కారణం ఒత్తిడి. ఒత్తిడిని సహజమైన ఔషధమూలికలు తప్ప వేరేవీ తగ్గించలేవు. అదికూడా ఏ మాత్రం అధిక వ్యయం లేకుండానే తగ్గిస్తాయి. వాటిలో ఒకటి మెంతులు. మెంతులు తలపై భాగాన వున్న వేడిని తగ్గిస్తాయి. చుండ్రు నివారిస్తాయి, వెంట్రుకలను బిరుసుగా వుంచుతాయి. జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. జుట్టును సున్నితంగా, మెత్తగా ఉంచుతాయి. కళ్ళకు, మెదడుకు చల్లదనాన్ని కలిగిస్తాయి. అనేక హెయిర్ ప్రాబ్లెన్స్ ను నివారిస్తాయి. మెంతులు నికోటినిక్ యాసిడ్ మరియు ప్రోటీన్ ను కేశాలకు పుష్కలంగా అందేలా చేస్తాయి. ఇది కేశాలు తిరగి పెరగడానికి మరియు బలంగా ఉండటానికి ఇవి బాగా ఉపయోగపడుతాయి.
మెంతులు మరియు మెంతి ఆకులను ఉపయోగించి కొన్ని హోం మేడ్ హెయిర్ మాస్క్ ఉపయోగించి అనేక హెయిర్ ప్రాబ్లెమ్స్ ను నివారించుకోవచ్చు . మెంతులతో హోం మేడ్ హెయిర్ మాస్క్ తయారు చేసేటప్పుడు మెంతులతో పాటు చాలా చౌకగా, విరివిగా ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. మెంతులను ఏ రకంగా ఉపయోగించాలో, వాటి ప్రయోజనాలేమిటో చూద్దాం!

నానబెట్టిన మెంతులు:
మెంతులను రాత్రంతా నానబెట్టి, ఉదయం బాగా మెత్తగా పేస్ట్ చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయడం వల్ల కేశాలకు మంచి మెరుపు, బలం చేకూరుతుంది. చుండ్రును మాయం చేస్తుంది. జుట్టు బ్రేక్ కాకుండా ఎనర్జీ అందిస్తుంది.

మెంతి నీళ్ళతో స్నానం:
మెంతులను నీళ్ళలో వేసి బాగా ఉడికించాలి. తర్వాత ఆ నీటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత తలకు పోసుకోవడం వల్ల జుట్టుకు కావల్సిన శక్తిని అందించి, డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.

కొబ్బరి నూనె:
మెంతులను మెత్తగా పౌడర్ చేసి, ఈ పొడిని కొబ్బరినూనెలో మిక్స్ చేసి తలకు మాస్క్ లా వేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో దురద మరియు పొడి బారడాన్ని అరికడుతుంది. మరియు ఈ హెయిర్ మాస్క్ జుట్టు పెరిగేలా ప్రోత్సహిస్తుంది మరియు హెయిర్ లాస్ ను నివారిస్తుంది.

మెంతి ఆకులు మరియు పెరుగు:
నీళ్ళలో మెంతి ఆకులను వేసి బాగా ఉడికించాలి. ఈ ఆకులను నీటినుండి వేరుచేసి మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి పెరుగు కలిపి. తలకు జుట్టుకు బాగా అప్లై చేయాలి. చేసిన తర్వాత 45నిముషాలు అలాగే ఉంచాలి . తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేసుకోవాలి.

మెంతి పొడి మరియు నిమ్మరసం:
జుట్టు పొడిబారడం, చుండ్రు వంటి జుట్టు సమస్యలను నివారించడం కోసం ఈ మెంతి హెయిర్ మాస్క్ చాలా మేలు చేస్తుంది. నిమ్మరసంలో పెరుగు మరియు మెంతి పొడి మిక్స్ చేసి, తలకు అప్లై చేయాలి.

మెంతులు మరియు పాలు:
మెంతులను మెత్తగా పొడి చేసుకొని, పాలతో కలపి పేస్ట్ లా తయారు చేసి, తలకు హెయిర్ మాస్క్ లా అప్లై చేయాలి. ఇది హెయిర్ కండీషన్ గా పనిచేసి జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.

మెంతులు మరియు ఉసిరి:
ఉసిరి కాయలను పచ్చివి లేదా ఎండినవి ఏవైనా ఉపయోగించవచ్చు. మెంతులను మరియు ఉసిరిని కలపి పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా నిమ్మరసం, పెరుగు పట్టించి పేస్ట్ లా చేసి తలకు పట్టించాలి . అరగంట తర్వాత తలస్నానం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications