Latest Updates
-
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.!
హెయిర్ లాస్ నియంత్రణకు ఆహార చిట్కాలు
జుట్టు కోల్పోవడం కొరకు కేవలం చుండ్రు,సూర్యరశ్మి మరియు బాహ్య కారణాలే కాకుండా ఒక అనారోగ్యకరమైన ఆహారం కూడా కారణం అవుతుంది. సాధారణ జుట్టు పెరుగుదలకు అనేక పోషకాలు అవసరం. మీ శరీరంనకు అవసరమైన పోషకాలు అందనప్పుడు జుట్టు కోల్పోవటం జరుగుతుంది. మీరు దాని గురించి ఆలోచించకపోతే, త్వరలోనే బట్టతల అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని నియంత్రించడానికి మరియు పోషణ కొరకు ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. ఇక్కడ మీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన చిట్కాలు ఉన్నాయి.

విటమిన్ B-కాంప్లెక్స్
తలపై చర్మం మరియు జుట్టు గ్రీవమునకు ఆక్సిజన్ సరఫరా కొరకు హెమోగ్లోబిన్ సహాయం అవసరమవుతుంది. మరింత ఆక్సిజన్ ఒక ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. విటమిన్ B-కాంప్లెక్స్ లేకపోవడం వలన పోషకాహార లోపంతో జుట్టు బలహీనం మరియు దెబ్బతింటుంది. దీనిని మీరు చికెన్,ట్యూనా మరియు సాల్మొన్ వంటి సహజ వనరుల నుండి పొందవచ్చు. అంతేకాక విటమిన్ మాత్రలను కూడా తీసుకోవచ్చు.

జింక్
తలపై చర్మం మీద నూనె గ్రంధులు ఉంటాయి. ఈ నూనె గ్రంధులు తగినంతగా నునెను ఉత్పత్తి చేయకపోతే,పొడి చర్మం,చుండ్రు మరియు చివరికి జుట్టు నష్టానికి దారితీస్తుంది. మీ జుట్టుకు తగినంత మొత్తంలో జింక్ ను అందించడానికి నట్స్,తృణధాన్యాలు,కాయధాన్యాలు,మాంసం,సముద్రపు ఆహారం వంటి ఆహారాలను తినాలి.

కాపర్
హెమోగ్లోబిన్ మన శరీరంలో జుట్టు మరియు వివిధ అవయవాలకు తగినంత ఆక్సిజన్ మరియు రక్త సరఫరాకు అవసరమైనది. కాపర్ మరింత హిమోగ్లోబిన్ ఏర్పడడానికి సహాయపడుతుంది.ఇది లేకపోవడం వలన జుట్టు బలహీనం,పెళుసు,జుట్టు నష్టానికి దారి తీస్తుంది. కాపర్ నువ్వు గింజలు,సోయా,జీడిపప్పు,మాంసం మరియు సముద్రపు ఆహారంలో సమృద్దిగా ఉంటుంది.

ఐరన్
ఐరన్ పురుషులు చాలా అవసరం. అలాగే ముఖ్యంగా మహిళలు తమ ఋతు చక్రంలో రక్తం మరియు ఇనుము కోల్పోతారు. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తి సహాయపడుతుంది. అంతేకాకుండా గర్భవతి మరియు పాలు ఇచ్చేమహిళలకు ఇనుము ఎక్కువగా మోతాదులో అవసరం. ఇనుము లేకపోవడం వలన మూలాల నుండి మీ జుట్టు నిర్వీర్యం అయ్యి త్వరలో బ్రేక్ కు కారణం అవుతుంది. ఒక రోజులో 100 పోగుల కంటే ఎక్కువ జుట్టు కోల్పోతే ఐరన్ లోపానికి చిహ్నం అని చెప్పవచ్చు. ఐరన్ బచ్చలికూర,సోయాబీన్స్,దాల్,రెడ్ బీన్స్, చికెన్,మాంసం,గుడ్లు మరియు చేపలలో సమృద్దిగా ఉంటుంది. జంతు మూలాల నుండి ఐరన్ మరింత సులభంగా మన సిస్టమ్ శోషిస్తుంది.

విటమిన్ సి
జుట్టు కణజాలంనకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి సహాయపడుతుంది. ఇది లేకపోవుట వలన తరచుగా జుట్టు చివర చీలికలు,జుట్టు పతనం మరియు పెళుసైన జుట్టుకు దారితీస్తుంది. మీ ఆహారంలో నారింజ,నిమ్మ,బెర్రీలు,తీపి నిమ్మ,పుచ్చకాయ మరియు టమోటా వంటి పండ్లను చేర్చండి. మీకు స్మోకింగ్ అలవాటు ఉంటే,స్మోకింగ్ అలవాటు తగ్గటానికి మరిన్ని విటమిన్ సి ఉన్న పండ్లను ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి.

ప్రోటీన్
తలపై చర్మం మరియు జుట్టుతో సహా మన శరీరంలో ప్రతి కణజాలం యొక్క నిర్మాణానికి పనిచేస్తుంది. ఇది చాలా ముఖ్యమైన పోషకం. ప్రోటీన్ మన కొరకు అత్యంత అవసరమైనది. ఇది కోల్పోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు ఉత్పత్తిలో సహాయపడుతుంది. ప్రోటీన్ లేకపోవడం వలన జుట్టు పలుచబడటం,పొడి మరియు పెళుసు జుట్టు,అలాగే చివరికి జుట్టు నష్టానికి దారితీస్తుంది. బీన్స్,నట్స్,తృణధాన్యాలు,పాలు,చీజ్,చేపలు, గుడ్లు,చికెన్ వంటి ఆహారాలలో ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది.

జుట్టు ఫాల్
సరైన ఆహారం అలవాట్లు భారీ స్థాయిలో జుట్టు ఫాల్ ను నియంత్రించడానికి సహాయపడతాయి. కేవలం షాంపు మరియు సీరం వంటి వాటి మీద ఆధారపడకుండా,మీరు తీసుకునే ఆహారం నుండి ఈ పోషకాలను సరైన మోతాదులో పొందడానికి నిర్ధారించుకోండి.



Click it and Unblock the Notifications
