మహిళల్లో జుట్టు రాలడానికి గల 10 ముఖ్య కారణాలు ...

By Mallikarjuna

మహిళల్లో జుట్టు నష్టం - ఈ 10 కారణాలు ఇది మీదే కలిగిస్తున్నాయి?
ప్రస్తుత రోజుల్లో పురుషుల్లోనే కాదు, మహిళలు కూడా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు . అయితే పురుషుల్లో వివిధ కారణాల వల్ల జుట్టు రాలిపోతుంటుంది. అది కూడా వివిధ పాట్రన్స్ లో జుట్టురాలుతుంది. అయితే మహిళల్లో ఎక్కువగా తలలో మొత్తం భాగంలో జుట్టు పల్చబడటం, జుట్టు రాలడం, జుట్టు సాంద్రత తగ్గించడం వంటి సమస్యలున్నట్లు కంప్లైంట్స్ ఉన్నాయి.

అందువల్ల జుట్టు రాలడానికి నిజమైన కారణాలను గుర్తించడం చాలా ముఖ్యం. సరైన టైమ్ లో గుర్తించినట్లైతే వెంటనే పరిష్కారం చూడవచ్చు. అది కూడా జుట్టుఎంత మేరకు నష్టపోయారో అన్నదాని మీద కూడా చికిత్స అవసరం అవుతుంది. అందుకు తగినపరిష్కారం కనుక్కోవచ్చు . మహిళల్లో జుట్టు రాలడానికి 10 సాధారణ కారణాలు ఈక్రింది విధంగా ఉన్నాయి:

జుట్టు సరిగా మెయింటైన్ చేయకపోవడం:

జుట్టు సరిగా మెయింటైన్ చేయకపోవడం:

ఎక్కువగా హెయిర్ స్టైల్స్ చేయడం వల్ల జుట్టు బలహీనపడుతుంది మరియు జుట్టును కర్లింగ్ ఐరన్ లేదా హెయిర్ ప్రొడక్టస్ జెల్, మౌసెస్, స్ప్రేలు, కలర్స్ మొదలగునవి జుట్టు సాఫ్ నెస్ ను దెబ్బతీస్తాయి మరియు ఇలా దీర్ఘకాలం చేయడం వల్ల ఇది హెయిర్ గ్రోత్ ను అడ్డుకుంటుంది. టైట్ పోనీ స్టైల్స్, దువ్వెనలు సరైనవి వాడకపోవడం, జుట్టును లాగడం, పరిస్థితిని మరింత వేగవంతం చేస్తుంది.

పిసిఓస్:

పిసిఓస్:

ఈ పరిస్థితిలో పురుష హార్మోనుల లేదా ఆండ్రోజెన్ వంటివి ఎక్కువగా ఉండటం వల్ల మరియు వాటిని తిత్తులు అంటారు. ఇవి అండాశయాల్లో చిన్న నీటితిత్తుల్లా ఏర్పడుతాయి . ఇది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఏర్పడుట వల్ల ఇది జుట్టు పెరుగుదలలో నెగటివ్ ఎఫెక్ట్ ను కలిగిస్తాయి. అలాగే శరీరంలో మరింత జుట్టు పెరుగుదలను మీరు గమనించవచ్చు. ఇది మీ జుట్టు మరింత ఎక్కువగా రాలడానికి దారి తీస్తుంది .

అనీమియా(రక్తహీనత):

అనీమియా(రక్తహీనత):

రక్తహీనత మీరు తీసుకొనే రెగ్యులర్ డైట్ లో చాలా తక్కువ ఐరన్ కలిగిన ఆహారాలను తీసుకోవడం. అలాగే చాలా మంది మహిళల్లో ఎక్కువ పీరియడ్స్ వల్ల మరియు శరీరంలో ఫోలిక్ యాసిడ్ సరిపడనంతగా లేనందు వల్ల హీమోగ్లోబిన్ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది . అంటే మీ జుట్టు గ్రీవాలకు తగినంత ఆక్సిజన్ అందకుండా పోతుంది. ఫలితంగా మీ జుట్టు బలహీనంగా మరియు చాలా సులభంగా బ్రేకేజ్ అవుతుంది . ఫలితంగా జుట్టు మరింత రాలడానికి కారణం అవుతుంది.

మోన పాజ్:

మోన పాజ్:

మహిళలు మోనోపాజ్ స్థితికి చేరుకోగానే వారి శరీరంలో అనేక మార్పలు చోటు చేసుకుంటాయి. అందులో ఒకటి హెయిర్ ఫాల్ . అందుకు ప్రధాన కరాణంలో శరీరంలో ఈస్ట్రోజన్ అనే ఆర్మోనుల స్థాయిలు తగ్గిపోవడం. అప్పుడు, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జుట్టు డ్రైగా మారడం మరియు జుట్టు రాలడం జరుగుతుంది. కాబట్టి, అట్టి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, నాణ్యమైన షాంపులను మరియు కండీషనర్స్ ను ఉపయోగించడం మరియు కరెక్ట్ డైట్ తీసుకోవడం మంచిది.

లేబర్ :

లేబర్ :

చాలా మంది మహిళలు ప్రసవం తర్వాత, లేదా గర్భధారణ సమయంలో జుట్టు మరింత రాలే సమస్యను అనుభవించే ఉంటారు. అందుకు ప్రధాన కారణం గర్భధారణ సమయంలో ఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రసవం తర్వాత కొద్ది రోజుల తర్వాత తిరిగి నార్మల్ స్థితి చేరుయుంటుంది. ఇది హార్మోనుల ప్రభావం వల్ల ఇలా జరగవచ్చు.

ప్రోటీనుల లోపం:

ప్రోటీనుల లోపం:

కెరోటిన్ అనే ప్రోటీన్ తోనే జుట్టు పెరుగుదల ఆధారపడి ఉంటుంది. మనం సరైన ప్రోటీనులో అధికంగా ఉండే ఆహారం తీసుకోకపోతే, జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది జుట్టు మూలాలను వీక్ గా మార్చుతుంది . దాంతో హెయిర్ ఫాల్ జరుగుతుంది.

మెడికేషన్స్:

మెడికేషన్స్:

కొంత మంది మహిళలు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడకం వల్ల సైడ్ ఎఫఎక్ట్స్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. . అలాగే ఇతర హార్మోనల్ పిల్స్ మరియు థెరపిలు వంటివి కూడా అదే ఎఫెక్ట్స్ ఉంటాయి. కీమోథెరపీ కూడా జుట్టు రాలడానికి దారితీస్తుంది.

వైద్యపరమైన అనారోగ్యాలు థైరాయిడ్, ఆటో ఇమ్యూన్ డిసీజ్:

వైద్యపరమైన అనారోగ్యాలు థైరాయిడ్, ఆటో ఇమ్యూన్ డిసీజ్:

థైరాయిడ్, ట్రైయోడిన్ థైరాయిడ్ మరియు థైరాక్సిన్ హార్మోన్స్ సరైన జుట్టు పెరుగుదలకు అవసరం అవుతుంది. ఎవరైతే హైపో లేదా హైపర్ థైరాయిడిజంతో బాధపడుతుంటారో హార్మోనుల ప్రభావం ఎక్కువ తక్కువ సమస్యత జుట్టు రాలడం కూడా ప్రరంభం అవుతుంది.

క్రోనిక్ మెడికల్ కండీషన్స్:

క్రోనిక్ మెడికల్ కండీషన్స్:

డయాబెటిస్, సోరియాస్, వంటి ఆరోగ్య సమస్యల వల్ల కూడా జుట్టు రాలుతుంది. శరీరంలోని జీవక్రియలు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల తగినన్ని పోషకాంశాలు అందక జుట్టు రాలడం ప్రారంభం అవుతుంది.

బరువు తగ్గడం:

బరువు తగ్గడం:

క్రాష్ డైటింగ్ మరియు సడెన్ గా ఎక్కువ బరువు తగ్గడం వల్ల కూడా సడెన్ గా జుట్టు పెరుగుదల మీద ప్రభావం చూపుతుంది. అందుకు కారణం, సాధారణంగా డైట్ మీ శరీరానికి తగినన్ని న్యూట్రీషిన్స్ అందకపోవడం, కొన్ని ఆహారాల వల లకూడా జుట్టు పెరుగుదల మీద ప్రభావం చూపుతుంది.

Story first published: Sunday, April 6, 2014, 13:21 [IST]
Desktop Bottom Promotion