Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
హెయిర్ ఫాల్, హెయిర్ బ్రేకేజ్ ను నివారించే టాప్ 13 ఫుడ్స్
మంచి పోషకాహారం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాంటి మంచి పోషకాహారలు హెల్తీ హెయిర్ గ్రోత్ కు కూడా చాలా ముఖ్యం. అందుకు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం జుట్టు ఎక్కువగా రాలుతున్నా, ఎక్కువ హెయిర్ డ్యామేజ్ ఉన్నా లేదా జుట్టు పెరగడం మందగించినా అందకు వెంటనే శ్రద్దతీసుకోవాలి . జుట్టు వేగంగా అభివృద్ధి చెందుతున్న కణజాలంగా ఉంటుంది మీరు తీసుకొనే ఆహారం జుట్టు పెరుగుదలలో ఎలా ప్రభావం చూపుతుందో తెలియజేస్తుంది . ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు వివిధ రకాల న్యూట్రీషియంట్స్ అవసరం అవుతాయి. అందులో ముఖ్యంగా విటమిన్ ఎ, సి, ఇ మరియు నియాసిన్, విటమిన్ బి5, బి12, ఐరన్, జింక్, ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, సిలికా, సల్ఫర్, మరియు జెర్మేనియం వంటివి చాలా అవసరం అవుతాయి.
సాధారణంగా చాలా మంది జుట్టురాలే సమస్యను నివారించుకోవడం కోసం వివిధ రకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కోసం ఎక్కువగా ఖచ్చుచేస్తుంటారు. అయితే జుట్టు రాలడంను నివారించుకోవడం ఉత్తమ మార్గం మరియు జుట్టు పెరుగుదలకు పెంచుకోవడానికి అందంగా జుట్టు కనబడేలా చేసుకోవడానికి మీరు తీసుకోవల్సినటువంటి ప్రత్యేక శ్రధ్ద మీరు తీసుకొనే ఆహారం. మీరు తీసుకొనే ఆహారంలో కొన్ని సూపర్ ఫుడ్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి మరియు జుట్టు రాలే సమస్యను నివారిస్తాయి. అటువంటి టాప్ 10 ఆహారాలు, క్రింది విధంగా ఉన్నాయి.
జుట్టు రాలడాన్ని నివారించే టాప్ 15 సూపర్ ఫుడ్స్:క్లిక్ చేయండి

ఆకుకూరలు
ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్స్ మరియు నేచురల్ న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతాయి. వీటిలోని విటమిన్ బి, సి, ఇ, క్యాల్షియం మరియు ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఐరన్ పుష్కలంగా ఉండి, జుట్టును బలంగా పెరగడానికి సహాయపడుతాయి.

గుడ్లు
మన జుట్టు ప్రోటీనులు అధికంగా కావల్సి ఉంటుంది. మన జుట్టు పెరుగుదలకు నిరంతరం ప్రోటీనుల అవసరం ఉంది. అటువంటి ప్రోటీనులు గుడ్లలో ఉన్నాయి. అంతే కాదు, గుడ్డులో విటమిన్ బి కాంప్లెక్స్ మరియు బయోటిన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. మరియు ఇది జుట్టు రాలడానికి అద్భుతంగా సహాయపడుతాయి. రెగ్యులర్ గా గుడ్డు తింటే, జుట్టు రాలే సమస్యను నివారించుకొన్నట్లే.

బీన్స్
బీన్స్ ఒక గ్రేట్ లోకాలరీ ఫుడ్. ఇందులో ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్ బి, విటమిన్ సి, జింక్ మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు చాలా అవసరం అవుతాయి. బీన్స్ లో కూడా ఐరన్ పుష్కలంగా ఉండి జుట్టురాలే సమస్యను నివారిస్తుంది. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా బీన్స్ ను చేర్చుకోవాలి.

నట్స్
నట్స్ లో ముఖ్యంగా బాదం, జీడిప్పు, వాల్ నట్స్ మరియు పీనట్స్ వంటంటివి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో జమరియు జుట్టు రాలడం నివారించడంలో బాగా సహాయపడుతాయి. అందుకు సహాయపడే విటమిన్స్, ఐరన్, జింక్, మినిరల్స్, ప్రోటీన్స్ మరియు హెల్తీ ఫ్యాట్స్ వంటివి వీటిలో అత్యధికంగా ఉన్నాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు.

సన్ ఫ్లవర్ సీడ్స్
జుట్టురాలడాన్ని సహజంగా నివారించాలంటే మీ రెగ్యులర్ డైట్ ప్లాన్ లో ప్రొద్దతిరుగుడు విత్తనాలను చేర్చుకోవాలి. విటిలో కాపర్, క్యాల్షియం, ఐరన్, బయోటిన్, మెగ్నీషయి, జింక్ ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ మరియు ప్రోటీలను అధికంగా ఉన్నాయి. పచ్చిగా ఉన్న సన్ ఫ్లవర్ సీడ్స్ ను గుప్పెడు తీసుకుంటే చాలు మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. గుప్పెడుకు మించి ఎక్కువగా తీసుకోకండి. చిన్న మొత్తంలో తీసుకోవడం వల్ల ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

సాల్మన్
సాల్మన్ ఫిష్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే, జుట్టు రాలడం అరికట్టవచ్చు . సాల్మన్ ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ బి12మరియు ప్రోటీనులు అధికంగా ఉన్నాయి. అధికంగా జుట్టు రాలడం, జుట్టు వీక్ గా ఉండటాన్ని నివారిస్తుంది.

బీఫ్
జుట్టు నాణ్యతను పెంచుకోవాలంటే బీఫ్ తినాల్సిందే. ఇందులో ప్రోటీనులు మరియు విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్, మరియు జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు నాణ్యతను పెంచి జుట్టు రాలడం తగ్గిస్తుంది . వారంలో రెండు మూడు సార్లు బీఫ్ ను మీరు తీసుకోవచ్చు.

ఓట్స్
హెయిర్ బ్రేకేజ్ ను నివారించి, జుట్టు రాలడాన్ని తగ్గించే ఒక నేచురల్ ఫుడ్ ఓట్స్. స్త్రీ మరియు పురుషుల ఇద్దరిలో సహజంగా జుట్టు పెరగాలనుకుంటే మీ రెగ్యులర్ డైట్ లో ఓట్స్ చేర్చుకోండి. ఇందులో కాపర్, జింక్, పొటాషియం, విటమిన్ బి, ప్రోటీన్స్ మరియు మైక్రోన్యూట్రీయంట్స్ అధికంగా ఉన్నాయి.

క్యారెట్స్
క్యారెట్స్ కంటిచూపుకు ఒక గ్రేట్ రెమడీ అని చెప్పవచ్చు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కూడా ఇది సహాయపడుతుంది. క్యారెట్ లోని బీటాకెరోటీన్ జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది.

స్వీట్ పొటాటో
స్వీట్ పొటాటో ఉపయోగించి జుట్టు రాలడాన్ని చాలా చౌకగా నివారించుకోవచ్చు. స్వీట్ పొటాటోలో అధికంగా బీటా కెరోటీన్స్ కలిగి ఉండి, అవి మన శరీరంలోకి చేరగానే విటమిన్ ఎగా మారుతాయి. జుట్టు పెరుగుదలకు, జుట్టు కణాల పెరుగుదలకు విటమిన్ ఎ చాలా అవసరం.

బాదం
రోజుకో ఆపిల్ తీసుకుంటే డాక్టర్ వద్దకు వెళ్లే అవసరం లేదనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయం బాదాంకు కూడా వర్తిస్తుంది. రోజుకు గుప్పెడు బాదాంలను తింటే కేవలం జుట్టుకే లాభం కాదు మీ గుండెకు కూడా మంచిది. టాపిక్ హెయిర్ గురించి కాబట్టి బాదాం వల్ల మీ హెయిర్ సరికొత్త మెరుపును సంతరించుకోవడంతో పాటు, జుట్టు రాలిపోవడం వంటి సవుస్యలు ఎదురుకావు.

గుమ్మడి/జింక్ కోసం
జుట్టుకు అవసరమైన జింక్ కోసం.. ఏదో ఒక రూపంలో గుమ్మడి గింజలు మీ ఆహారంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే జుట్టు విపరీతంగా ఊడిపోయేవారి ఆహారంలో జింక్ తో పాటు, ఐరన్ పుష్కలంగా ఉండాలని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషేన్ సిఫార్సు చేస్తోంది. జింక్ కు ఆహార పదార్థాలన్నింటిలోనూ పుష్కలమైన వనరు గుమ్మడి గింజలే.



Click it and Unblock the Notifications











