Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
చుండ్రును నివారించే ఉత్తమ చికిత్స్ ఆనియన్ హెయిర్ ప్యాక్స్
ప్రస్తుత రోజుల్లో అందరినీ ఇబ్బంది పెట్టే ఒక సాధారణ సమస్య చుండ్రు. టీనేజ్ వారిలో మరియు పెద్దవారిలో కూడా కారణాలు తెలియకుండానే చుండ్రుకు గురిఅవుతుంటారు. చుండ్రు సమస్య వయస్సుతో నిమిత్తం లేకుండా అన్ని వయస్సుల వారికి వస్తుంది. ఈ సమస్య వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే తలలో చుండ్రుఉన్నట్లైతే అది జుట్టు నుండి రాలుతూ భుజాల మీద దుస్తుల మీద తెల్లని పొట్టుగా రాలుతూ ఆసహ్యంగా మార్చుతుంటుంది. చుండ్రు సమస్యకు సాధారణ లక్షణం తలలో మంట, దురద మరియు తలలో చర్మం పొట్టు పొట్టుగా ఉండటం.
చుండ్రు సమస్యను నివారించడంలో అనేక ఇంటి చిట్కాలున్నాయి. అయితే వాటిలో ఒకటి ఆనియన్ ట్రీట్మెంట్. ఉల్లిపాయ రసంతో చుండ్రు చాలా ఎఫెక్టివ్ గా తొలగింపబడుతుంది. ఇది క్రమంగా చుండ్రును నివారిస్తుంది. ఉల్లిపాయ రసం నేచురల్ రెమెడీ . కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరి, ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించి చుండ్రును ఎలా వదిలించుకోవచ్చు చూద్దాం....

మెంతులు:
చుండ్రును నివారించడంలో ఉత్తమ రెమడీ చుండ్రు. మొంతులను నీళ్లలో వేసి రాత్రంతా నానెబట్టి, మరుసటి రోజు ఉదయం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా ఉల్లిపాయ రసం కూడా వేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

అలోవెర:
కలబంద రసానికి కొద్ది ఉల్లిపాయ రసం మిక్స్ చేసి తలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. ఈ మిశ్రమం వల్ల తలను చాలా కూల్ గా చేస్తుంది. దురదను నివారిస్తుంది. 10నిముషాల తర్వాత తలస్నానం చేసేయాలి.

పెసరపిండి:
పెసరపిండి కొద్దిగా తీసుకొని అందులో కొద్దిగా ఉల్లిపాయ రసం వేసి బాగా మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను వారానికి రెండు సార్లు తలకు పట్టించి మంచి ఫలితం ఉంటుంది.

బీట్ రూట్ :
బీట్ రూట్ చుండ్రును నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దుంపలను నీటిలో వేసి బాగా మరిగించి, ఆ నీటికి కొద్దిగా ఉల్లిపాయ రసం మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి వేళ్ళతో బాగా మసాజ్ చేయాలి.

పొట్లకాయ:
చుండ్రును నివారించడంలో ఉత్తమ ఫలితాలను చూపిస్తుంది. ఈ పొట్లకాను మెత్తగా పేస్ట్ చేసి, అందులో ఉల్లిపాయ రసం మిక్స్ చేసి తల మొత్తానికి పట్టించి , 20 నిముషాల తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయ రసంలో ఆర్ధోడాక్స్ అనే పదార్ధం కలిగి ఉండటం వల్ల ఇది జుట్టు రాలే సమస్యలను నివారిస్తుంది. ఉల్లిపాయ రసం తలలో బ్యాక్టీరియాను నివారిస్తుంది మరియు తెల్లగా రాలో పొట్టును ను కూడా నివారిస్తుంది. ఇది జుట్టుకు తగినంత పోషణ మరియు బలాన్ని అందిస్తుంది. తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. హెయిర్ ఫాల్ ను అరికట్టడంలో ఒక ఉపయోగకరమైన రెమడీ. ఉల్లిపాయను కట్ చేసి పేస్ట్ చేసి తలకు పట్టించి 30నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

నిమ్మరసం:
చుండ్రు నివారించడానికి ఉల్లిపాయ రసంలో కొద్దిగా నిమ్మరసం కూడా మిక్స్ తలకు పట్టించడం వల్ల తలలో వాసనను నివారిస్తుంది. అలాగే చుండ్రుకు మంచి చికిత్స వంటిది. తలలో దురదను నివారిస్తుంది.

తేనె:
ఉల్లిపాయ రసంలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల, తలను శుభ్రం చేస్తుంది, చుండ్రును నివారిస్తుంది మరియు ఇతర ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది . ఇంకా జుట్టు మంచి షైనింగ్ తో స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది. ఉల్లిపాయ రసంలో కొద్దిగా తేనె మిక్స్ చేసి, తలకు పట్టించి 10నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

ఆలివ్ ఆయిల్:
ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకొని అందులో నిమ్మరసం మిక్స్ చేసి తలకు పూర్తిగా పట్టించాలి. తర్వాత వేడినీటిలో ముంచిన టవల్ ను తలకు చుట్టి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇది చాలా ఎఫెక్టివ్ గా చుండ్రును నివారిస్తుంది.

కొబ్బరి నూనె:
ఒక చెంచా నిమ్మరసం, 5చెంచాల కొబ్బరినూనె, 3చెంచాల నిమ్మరసం తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు బాగా పట్టించి 20నిముషాల తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు నివారించబడుతుంది.

వెనిగర్:
వెనిగర్ లో పొటాషియం అధికంగా ఉంటుంది. చుండ్రును నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, తర్వాత తలకు మసాజ్ చేయాలి.

గుడ్డు:
జుట్టు సైజును బట్టి 1 లేదా 2 గుడ్లను తీసుకొని, అందులో నిమ్మరసం మిక్స్ చేసి బాగా బీట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. గుడ్డు జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది. చుండ్రును నివారిస్తుంది.

ఆపిల్ జ్యూస్ :
రెండు చెంచాల ఆపిల్ జ్యుూస్ లో 2చెంచాల ఉల్లిపాయ రసం మిక్స్ చేసి తలకు పట్టించి20 నిముషాల తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications