Latest Updates
-
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక
వింటర్ హెయిర్ కేర్: నివారించాల్సిన తప్పిదాలు
ప్రస్తుతం శీతాకాలం, ప్రతి ఒక్కరు వారి చర్మం పై కేర్ తీసుకోవడంతోనే బిజీగా ఉంటారు. కానీ మీజుట్టు సంరక్షణ ఆలోచించారా? ముఖ్యంగా వింటర్ సీజన్ లో మహిళలలు కాస్త బద్దగించి చర్మం సంరక్షణ, జుట్టు సంరక్షణకు గురించి నిర్లక్ష్యం చేస్తుంటారు ఫిలితంగా చర్మం మీద మరియు జుట్టు మీద చెడు ప్రభావ ఏర్పడుతుంది. చర్మం పగుళ్ళు ఏర్పడి, చర్మసమస్యలకు దారితీస్తుంది. అలాగే జుట్టు మీ చల్లని గాలు ప్రభావం జుట్టు మీద కూడా ఏర్పడి, చుండ్రు, జుట్టు రాలడం, జుట్టు పొడిబారడం వంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.
ఉదాహరణకు: చాలా మంది మహిళలు శీతాకాలంలో వారి తలకు స్నానం చేయడానికి ఇష్టపడరు. అందువల్ల, జుట్టుకు సరైన జాగ్రత్తలు పాటించక పోవడం వల్ల అనేక జుట్టు సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. మేము మీ జుట్టు సంరక్షణ కొరకు ఈ సీజన్లో కొన్ని చేయాల్సినవి మరియు చేయకూడనివి చిట్కాలుగా ఇస్తున్నాం పరిశీలించండి.
శీతాకాలంలో పొడి జుట్టు కోసం జుట్టు సంరక్షణ చిట్కాలు: క్లిక్ చేయండి
హెయిర్ వాష్ చేసుకోకపోవడం వల్ల జుట్టు సమస్య: మీకు అవసరం అయినప్పుడు తలస్నానం చేస్తుండాలి. శీతాకాలంలో దినం మార్చి దినం తలస్నానం చేయకపోయినా, మీ జుట్టు మురికిగా మీకు అనిపించినప్పడు, జుట్టు ఆయిలీగా అనిపించినప్పుడు, వెంటనే తలస్నానం చేయండం మంచిది. తలస్నానం చేయకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమౌతుంది.

మరీ వేడిగా ఉన్న నీరు ఉపయోగించడం: షాంపు చేసుకోవడానికి వేడినీళ్ళు ఉపయోగించకండి . చల్లటి నీటిని ఉపయోగించి జుట్టు రాలడాన్ని తగ్గించుకోండి . చల్లటి నీటిని ఉపయోగించి తక్కవు హెయిర్ బ్రేకేజ్ మరియు వాల్యూమ్ ను తగ్గించండి. వేడినీళ్ళతో స్నానం చేయడం శరీరం రిలాక్స్ అవ్వడానికి మరియు ఒళ్ళు నొప్పులు నివారించడానికి మంచిదే. అయితే, వేడినీళ్ళు పోసుకోవడం వల్ల జుట్టు మరింత పొడిగా, చిక్కుబడుతుంది. హెయిర్ తేమను కోల్పోతుంది. దాంతో జుట్టు సమస్య మొదలవుతుంది. కాబట్టి, కేశ సంరక్షణకు వేడినీళ్ళు నివారించండి.
వింటర్ సీజన్ లో బ్యూటిఫుల్ హెయిర్ కోసం టాప్ టిప్స్: క్లిక్ చేయండి
పొడి జుట్టు: వింటర్ అంటే డ్రై సీజన్. ఈ సీజన్ లో చర్మాన్ని మాత్రమే పొడిగా ఉంచడం కాదు, జుట్టుకూడా డ్రైగా మారుతుంది. అందువల్లే, మీ జుట్టు పొడిబారకుండా కాపాడుకోవాలి. పొడి జుట్టు వల్ల తలలో దురద మరియు చుండ్రుకు దారితీస్తుంది. కాబట్టి, ఎప్పుడూ హెయిర్ ఆయిల్ అప్లై చేయమని సలహా. మీ తలస్నానం చేయడానిక అరగంట ముందు అప్లై చేసినా సరిపోతుంది.
తడి జుట్టును ముడివేయకూడదు: జుట్టును గాలికి వదిలివేయడం కన్నా జడ వేసుకోవడం మంచిది. దీంతో చలిగాలులు వల్ల జుట్టు త్వరగా పాడయ్యే అవకాశాన్ని తగ్గించవచ్చు. అయితే తలస్నానం చేసిన తర్వాత జుట్టు ముడివేయడం వల్ల కోల్డ్ చేస్తుంది . ముఖ్యంగా తడిజుట్టు ముడి వేయడం వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది.
జుట్లు తడిగా వున్నప్పుడు తలదువ్వుకోకూడదు. కుదుళ్ళలో నుండి వెంట్రుకలు వూడి వస్తాయి. జుట్టు తడి పొడిగా వున్నప్పుడు దువ్వుకోండి. తలకు రోజూ నూనె రాసుకోవటం (లేదా వారానికి రెండుసార్లయినా) అన్నది కేశఆలను బలంగా వుంచుతుంది. జుట్టు జిడ్డుగావున్న కారణంగా దానికి నూనె అవసరం లేదని భావించవద్దు. ఇలా చేయడం ద్వారా మాడు నూనెను బాగా గ్రహిస్తుంది. పొడిగా, పేలవంగా జుట్టు ఉన్నట్లయితే ఒక కప్పు తేనె, అరకప్పు ఆలివ్ ఆయిల్ లేదా నువ్వుల నూనె, రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం కలిపి ఓ రాత్రంతా ఉంచేసి కొద్దిగా తీసుకుని తలకు మసాజ్ చేయాలి.
వేడి టవల్ చుట్టుకుని కొద్దిసేపు షాంపూ చేసుకోవాలి. జుట్టు పొడిగా, దెబ్బతిని ఉన్నట్లయితే ఒక టీస్పూన్ ఆముదం, రెండు స్పూన్లు స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను కలిపి మసాజ్ చేసుకుని వేడినీటి టవల్ చుట్టి ఆపై స్నానం చేయాలి. చుండ్ర విపరీతంగా వుంటె నాలుగు టొమోటోలను తీసుకుని వాటిని మెత్తగా నలిపి ఆ గుజ్జును తలకు బాగా పట్టించడండి. రెండు నిమిషాలు మర్థన చెయ్యండి ఆ తర్వాత తలస్నానం చెయ్యాలి. వీటినంటిని పాటించినట్టైతే మీ జట్టు పదిలంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications