Latest Updates
-
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?.
ఆరోగ్యకరమైన జుట్టు కోసం 10 ఆరోగ్యకరమైన చిట్కాలు
5 సులభమైన అందమైన హెయిర్ స్టైల్స్ ఎలా చేయాలి, ప్రకాశించే చర్మం కొరకు మీ ఇంట్లోనే ఫేషియల్ 4 ముఖ్యమైన మార్గాలు, చర్మం ప్రకాశవంతంగా ఉండటానికి కొబ్బరి నీరు త్రాగండి.
READ MORE: పురుషుల జుట్టు సమస్యలకు 20 బెస్ట్ హోం రెమడీస్...!
ప్రతి స్త్రీ మందపాటి, సిల్కీ, నునుపుగా ఉన్న జుట్టు కోసం కలలు కంటుంది. మిమ్మలిని చూసి మీ స్నేహితులు అసూయ చెందాలి అనుకుంటే, అందమైన ఆరోగ్యకరమైన జుట్టు కొరకు మా టెన్ కమాండ్మెంట్స్, అనుసరించండి.

మీ జుట్టు రక్షించుకోండి
మీ జుట్టుకు వొచ్చే అన్ని సమస్యలను దూరంగా ఉంచాలనుకుంటే దానికి ఉత్తమ మార్గం జుట్టును రక్షించుకోవటం ఒకటి. విపరీత ఉష్ణోగ్రత, సూర్యుడు, ధూళి మరియు కాలుష్యం నుండి మీ జుట్టును రక్షించేందుకు ప్రయత్నించండి. ఇవి అన్నీ జుట్టు రాలటం, చుండ్రు మరియు ఇతర జుట్టు సమస్యలకు దారి తీసే మీ తల ఇన్ఫెక్షన్ కలగటానికి కారణమవుతాయి.

జాగ్రత్తగా నిర్వహించండి
తలస్నానం తర్వాత,వెంటనే మీ జుట్టును బ్రష్ చేయకండి, దీనివలన మీ జుట్టుకు నష్టం కలుగుతుంది. తడిగా ఉన్న జుట్టు బలహీనంగా మరియు పెళుసుగా ఉంటుంది. అందువలన మీ జుట్టు ఆరేవరకు వేచి ఉండి మరియు అప్పుడు నిదానంగా దువ్వెనతో మీ జుట్టును దువ్వండి.

మీ జుట్టును కండిషన్ చేయండి
పెళుసుబారిన జుట్టు నివారించడానికి, ఒక మంచి కండీషనర్ తో మీ జుట్టు తేమను అందించండి. కండిషనింగ్ చేసిన తరువాత మీ జుట్టును, పూర్తిగా కడగండి ఆపై గాలికి ఆరేట్లుగా ఉంచండి.

హెయిర్ స్టైలింగ్ అలవాటుగా చేయవద్దు
ఎక్కువ జుట్టు స్టైలింగ్ కు వినియోగించే ఉత్పత్తులను రోజు క్రమంగా ఉపయోగించినప్పుడు తలలో వేడిని ఉత్పత్తి చేస్తాయి, దీనివలన జుట్టు దెబ్బతింటుంది. ఎప్పుడూ జుట్టు స్టైలింగ్ ఉత్పత్తులను మితిమీరి ఉపయోగించకూడదు మరియు ఎల్లప్పుడూ నష్టం తగ్గించుకోవడానికి, ఒక మంచి హెయిర్ సీరం ఉపయోగించండి.

జుట్టును గట్టిగా కట్టవద్దు
మరింతగా ముడులు తిప్పటం మరియు హెయిర్ బ్యాండ్ గట్టిగా బిగించటం వలన మీ జుట్టు దెబ్బతింటుంది. మొత్తం సమయం మీ జుట్టు గట్టిగా జడ వేయడం బదులు వదులుగా వదిలేయండి లేదా ఒక హెడ్ బ్యాండ్ లేదా ఒక క్లిప్ ఉపయోగించండి.

మీ జుట్టును పూర్తిగా శుభ్రపరచుకోండి
జుట్టు రాలటానికి చాలా ముఖ్యమైన కారణం చుండ్రు మరియు తల దురద. పబ్లిక్ లో మీ జుట్టు కులుకుతూ కాంతులీనాలి అనుకుంటే మీ జుట్టుపట్ల పూర్తి శుభ్రత నిర్వహించండి.

మీ హెయిర్ మాస్క్ తయారుచేసుకోండి
వారానికి ఒకసారి ఒక మంచి హెయిర్ మాస్క్ వేసుకోండి, ఈ విధంగా చేయటంవలన జుట్టుకు కొన్ని ముఖ్యమైన పోషకాలు అందుతాయి. హెయిర్ మాస్క్ తయారుచేసుకోవటం సులభం. ఒక అరటిపండును గుజ్జుగా చేయండి, దానికి గుడ్డును జోడింఛి బాగా కలపాలి మరియు దానిని జుట్టు మీద వర్తింపచేయండి. 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి.

సరైన ఆహారం తీసుకోండి
ఒక మంచి హెయిర్ మాస్క్ మరియు కండీషనర్ మీ జుట్టుకు ఉపయోగించటమే కాకుండా, మీరు తాజా పండ్లు మరియు కూరగాయలు తీసుకోవటం వలన అవసరమైన పోషకాలు అందుతాయి. సమతుల్య ఆహారం తీసుకోవటంవలన, మీ జుట్టు వేగంగా పెరుగుతుంది మరియు మెత్తగా మరియు ప్రకాశవంతంగా తయారవుతుంది.

మీ జుట్టుకు నూనె పట్టించండి
కనీసం వారానికి ఒకసారైనా ఖచ్చితంగా మీ జుట్టుకు నూనె పట్టించండి. ఇలా వారానికి ఒకసారైనా జుట్టుకు నూనె పట్టించటం వలన తలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మీరు మెరిసే, మందపాటి జుట్టు పొందడానికి కొబ్బరి నూనె లేదా బాదం నూనె ఉపయోగించవచ్చు.

క్రమం తప్పకుండా మీ జుట్టు బ్రష్ చేయండి
సహజంగా ఉండే చమురు తలచర్మం అంతటా వ్యాప్తి చెందటానికి మీ జుట్టును బ్రష్ చేయండి. ఈ విధంగా చేయటం వలన మీ జుట్టు మృదువుగా, ప్రకాశవంతంగా తయారవుతుంది.



Click it and Unblock the Notifications