Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్!
పొడి జుట్టు(డ్రై హెయిర్)ను సాప్ట్ అండ్ షైనీగా మార్చే హెయిర్ మాస్కులు
డ్రై హెయిర్(పొడి జుట్టు)??చాలా విసుగు పుట్టిస్తుంది కాదా? కొంత మంది జుట్టు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మరికొందరికి రఫ్ గా ఇబ్బంది కలిగిస్తుంది. మరి మీది కూడా అలాంటి జుట్టే (డ్రై హెయిర్)అయితే..మా దగ్గర కొన్ని సింపుల్ పరిష్కార మార్గాలున్నాయి. మీ పొడి జుట్టును నివారించుకోవడానికి ఈ సింపుల్ రెమెడీస్ ను ఉపయోగించుకోవచ్చు.
పొడి జుట్టు మరియు చిట్లిన జుట్టుకు హోం రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అదే విధంగా డ్రై హెయిర్ ను గమనించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే డ్రై హెయిర్ కు గుడ్ బై చెప్పవచ్చు.
జుట్టు చిట్లకుండా ఉండేందుకు నివారించాల్సి హోం రెమెడీస్
వంటింటి వస్తువుల్లో అరటిపండు గుజ్జు, ఓట్స్ హెయిర్ మాస్క్ మరియు ఆలివ్ ఆయిల్ చాలా సింపుల్ గా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ క్రింది ఆహారాలను కూడా అనుసరించమని ఎందుకు చెబుతామంటే ఇవి చౌకైనవి మాత్రమే కాదు, మార్కెట్లో లభించి రసాయనికి ఉత్పత్తుల కంటే మేలైనవి. ఈ నేచురల్ పదార్థాలతో జుట్టుకు ఎలాంటి హాని జరగదు.
శీతాకాలంలో పొడి జుట్టు కోసం జుట్టు సంరక్షణ చిట్కాలు
మరి మీరు కూడా ఈ ఆహారాపదార్థాలను ఉపయోగించి, డ్రై గా ఉన్న మీ హెయిర్ ను స్మూత్ గా మార్చుకోండి. మరి అవేంటో తెలుసుకుందాం...డ్రై హెయిర్ సమస్య నుండి బయటపడదాం...

అరటి పండు గుజ్జు:
అరటిపండును రెండుగా చేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో అరకప్పు పాలు పోసి బాగా మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్నిహెయిర్ మాస్క్ ల తలకు పట్టించి 20 నిముషాల తర్వాత తలస్నానం చేస్తే డ్రై హెయిర్ సమస్య తగ్గుతుంది.

ఒట్ మీల్:
డ్రై హెయిర్ సమస్యను నివారించే మరో ఆహార పదార్థం ఓట్ మీల్. దీంతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం ద్వారా, జుట్టు సాఫ్ట్ గా మారుతుంది మరియు జుట్టుకు నేచురల్ షైనింగ్ అందిస్తుంది.

పెరుగు మాస్క్:
చిక్కటి పెరుగును జుట్టుకు, తలకు పట్టించి మసాజ్ చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

ఎగ్ మాస్క్:
డ్రై హెయిర్ నివారించడానికి ఎగ్ హెయిర్ మాస్క్ మరో చక్కటి హోం రెమెడీ. గుడ్డులోని తెల్లని పదార్థంను తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నాం చేస్తే జుట్టుకు అవసరం అయ్యే పోషకాలు అందడంతో పాటు, డ్రై హెయిర్ నివారించబడుతుంది.

పాలు, తేనె:
రెండు టీస్పూన్ల తేనెను రెండు గ్లాసుల పాలలో మిక్స్ చేసి, తలకు షాంపుతో స్నానం చేసిన తర్వాత హనీ మిక్స్ చేసిన పాలను తలారా పోసుకోవాలి . కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీటిని పోసుకోవాలి.

స్ట్రాబెర్రీ-మిల్క్ మాస్క్:
స్ట్రాబెర్రీ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది . అందుకే ఇది జుట్టుకు పట్టించుటకు చాలా మంచి ఆహారం. రాత్రికి రాత్రే జుట్టును సాఫ్ట్ గా మార్చేస్తుంది.

మెయోనైజ్ మరియు అవొకాడో:
ఒక టేబుల్ స్పూన్ మయోనైజ్ ను ఒక కప్పు అవొకాడో పేస్ట్ లో మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

ఫ్రూట్ మాస్క్ :
డ్రై హెయిర్ ను స్మూత్ గా మార్చడానికి కొన్ని బెస్ట్ ఫ్రూట్స్ ను తలకు ప్యాక్ లా వేసుకోవచ్చు . కివి మరియు ద్రాక్ష వంటి ఫ్రూట్స్ ను కూడా హెయిర్ ప్యాక్ లా వేసుకోవచ్చు.

కీరదోసకాయ మాస్క్:
కీరదోసకాయ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి, ఆ నీటితో హెయిర్ వాష్ కు ఉపయోగించుకోవచ్చు . తర్వాత రోజ్ వాటర్ తో వాష్ చేసుకోవాలి . ఈ సింపుల్ హోం రెమెడీ ద్వారా మీ జుట్టును నేచురల్ గానే సాఫ్ట్ గా మార్చుకోవచ్చు.

గ్రీన్ ఫుడ్స్:
గ్రీన్ వెజిటేబుల్స్ లో మీకు నచ్చిన వాటిని తీసుకొని, చిక్కటి పేస్ట్ లా చేసి డ్రై హెయిర్ కు పట్టించవచ్చు. వారానికొకసారి పట్టించడం ద్వారా వీటిలో ఉండే విటమిన్ కె జుట్టు మొదళ్ళకు పోషణను అందిస్తుంది.



Click it and Unblock the Notifications











