Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ప్రొఫెషనల్ స్టైల్ లో జుట్టును తీర్చిదిద్దడానికి 12 చిట్కాలు
జుట్టును దువ్వడం కంటే అందంగా బ్రష్ చేయడంలోనే సిరోజాల సౌందర్యం దాగి ఉందని నిపుణులు అంటున్నారు. జుట్టును బ్రష్ చేయడం వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? మీ జుట్టును బ్రష్ చేయడం ద్వారా జుట్టుకు రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది, తద్వారా జుట్టు ఎదుగుదల బాగుంటుదని నిపుణులు సూచన.
మీరు జుట్టుని బ్రష్ చేసే తీరు బట్టి కూడా మీ జుట్టు అందం రెట్టింపు అవుతుంది. అంతే కాకుండా, జుట్టు కూడా ఒత్తుగా ఉంటుంది. కోమ్బింగ్ కంటే బ్రషింగ్ వల్ల జుట్టు క్లీన్ గా ఉంటుంది. అయితే, అన్నిటికన్నా ముందు బ్రష్ చేసే విధానం గురించి మీరు తెలుసుకోవాలి. సులభమైన పద్దతుల ద్వారా జుట్టుని బ్రష్ చేసుకుంటే మృదువైన జుట్టు మీ సొంతం.
బోల్డ్ స్కై వివిధ రకాల బ్రషింగ్ పద్దతులను మీకు తెలియచేస్తుంది. ఈ సింపిల్ వేస్ ద్వారా మీరు సౌందర్యవంతమైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. జుట్టు వల్ల కలిగే ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు.

సరైన డైరెక్షన్
దువ్వెన నుంచి బ్రష్ కి మారేటప్పుడు మీ జుట్టుకు తగిన బ్రష్ ను ఎంచుకోవాలి. మార్కెట్ లో వివిధ రకాల బ్రషేస్ అందుబాటులో ఉంటాయి. వాటిలో మీకు తగిన బ్రష్ ను ఎంచుకోండి.

జుట్టు తీరును బట్టి
మీ జుట్టు స్టైల్ బట్టి బ్రష్ ను ఎంచుకోవాలి. కర్లీ హెయిర్ ఉన్న వారు వైడ్ ప్యానల్ బ్రష్ లను ఎంచుకుంటే మంచిది. సిల్కీ స్ట్రెయిట్ హెయిర్ ఉన్నవారికి థిన్ ప్యానెల్ బ్రషెస్ సూట్ అవుతాయి.

ఎప్పుడు బ్రష్ చేయాలి
జుట్టును ఎప్పుడు బ్రష్ చేయాలి అన్న విషయంపై అవగాహన ఉండాలి. తడిగా ఉన్నప్పుడు జుట్టును బ్రష్ చేయకూడదు. పూర్తిగా జుట్టు ఆరిన తరువాతే బ్రష్ చేయాలి.

ముందు దువ్వాలి
కర్లీ హెయిర్ ఉన్నవారు జుట్టుని బ్రష్ చేసే ముందు దువ్వడం మంచిది. దీని వల్ల జుట్టు చిట్లే అవకాశం ఉండదు.

తడిగా ఉన్నప్పుడు దువ్వకూడదు
జుట్టు పూర్తిగా ఆరిన తరువాతే బ్రష్ చేయాలి. కొద్దిగా తడి ఉన్నా పరవాలేదు. తడి జుట్టును బ్రష్ చేయడం వల్ల జుట్టు ఊడిపోయే అవకాశాలు ఎక్కువ.

డివైడ్ చేయాలి
జుట్టును బ్రష్ చేసే ముందు జుట్టును రెండు భాగాలుగా విభజించాలి. మొదటగా దువ్వెనతో జుట్టును రెండు భాగాలుగా విభజించి అప్పుడు బ్రష్ చేయాలి.

కింద నుంచి మొదలుపెట్టాలి
జుట్టును బ్రష్ చేయడాన్ని కింది నుంచి మొదలు పెట్టాలి. దీని వల్ల జుట్టు చిట్లే సమస్య తగ్గుతుంది.

మధ్య భాగం
జుట్టును కింద నుంచి బ్రష్ చేసిన తరువాత మధ్య భాగానికి రావాలి. సున్నితంగా జుట్టును బ్రష్ చేసి కండిషనర్ ను అప్లై చేసి జుట్టును ఆరనివ్వండి.

పైజుట్టును చివరన బ్రష్ చేయండి
జుట్టును బ్రష్ చేయడాన్ని కింద నుంచి మొదలుపెట్టాలి. పై జుట్టును చివరకు బ్రష్ చేయాలి. పై జుట్టును బ్రష్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. మసాజ్ చేస్తూ జుట్టును బ్రష్ చేయాలి. ఇలా చేస్తే రక్తప్రసరణ సజావుగా జరిగి హెయిర్ గ్రోత్ మెరుగవుతుంది.

బ్రష్ చేయడం ఇబ్బందిగా ఉంటే
బ్రష్ చేయడం ఇబ్బందిగా ఉన్నప్పుడు కొద్దిగా నీళ్ళు లేదా కండిషనర్ ను జుట్టుపై జల్లి అలా వదిలేయాలి. దీని వల్ల జుట్టు చిక్కుపడడం తగ్గుతుంది. సులభంగా జుట్టుని బ్రష్ చేసుకోవచ్చు.

ఫోకస్ ని కోల్పోకండి
జుట్టును బ్రష్ చేసేటప్పుడు ఏకాగ్రతతో ఉండాలి. ఏ మాత్రం అశ్రద్ద వహించినా జుట్టు దెబ్బతినే అవకాశాలు కలవు. జుట్టుని బ్రష్ చేసేటప్పుడు కింద నుంచి బ్రష్ చేయాలన్న సంగతి మరువకండి.

స్టాటిక్ ని అవాయిడ్ చేయడానికి
హెయిర్ స్ప్రే ని జుట్టుపై జల్లి జుట్టును బ్రష్ చేయడం మొదలుపెడితే జుట్టు అందంగా ఉంటుంది. ప్రొఫెషనల్ గా జుట్టును అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఇవి పాటించాలి.



Click it and Unblock the Notifications