Latest Updates
-
తుల, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. భారీ ధనలాభం! - శుక్రవారం, 26 జూన్ 2026 -
భార్య ఎల్లప్పుడూ భర్తకి ఎడమవైపునే ఎందుకు కూర్చుంటుందో తెలుసా.? -
మగవారికి షాకింగ్ న్యూస్.. మీ శరీరంలో ఈ హార్మోన్ లెవెల్స్ పడిపోవడం గమనిస్తున్నారా.? -
ఆలయాల్లో దేవతలను మేల్కొలిపే సుప్రభాతం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం -
ప్రెగ్నెన్సీ సమయంలో యోగా, స్ట్రెచింగ్ చేయవచ్చా.?.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.! -
రెస్టారెంట్ రుచితో కరకరలాడే షెజ్వాన్ చికెన్ లాలీపాప్.. మీ ఇంట్లోనే చేసేయండిలా.. -
పరగడుపున నానబెట్టిన మెంతులు తింటే.. ఈ 5 అద్భుత ప్రయోజనాలు మీ సొంతం! -
గుడ్డిగా నమ్మి మోసపోకండి.. రిలేషన్ షిప్స్ పై చాణక్యుడి 6 హెచ్చరికలు -
హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. ఉద్యోగులు ఏ నగరాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో తెలుసా.! -
చికెన్, మటన్ కూడా దీని ముందు బలాదూర్.. స్పైసీ మష్రూమ్ చుక్కా రుచి చూశారా?
మీ జుట్టు ఏ రకమైనా ఈ హెయిర్ మాస్క్ లతో గ్రేట్ బెనిఫిట్స్..!
ప్రస్తుత జీవన శైలిలో అనేక మార్పుల వల్ల కేశాల మీద తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు . జుట్టును మెయింటైన్ చేయడం కూడా కష్టంగా మారింది. రెగ్యులర్ గా ఉపయోగించే కఠినమైన కెమికల్స్, వివిధ రకాల హెయిర్ ట్రీట్మెంట్స్, హెయిర్ స్ట్రెటనింగ్ , కాలుష్యం మరియు సన్ డ్యామేజ్ వల్ల జుట్టు నిర్జీవంగా, ఆయిలీగా, చిక్కుబడి, మ్యానేజ్ చేయడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది . ఇలాంటి పరిస్థితిలో జుట్టును మ్యానేజ్ చేయడం చాలా కష్టం.
హెయిర్ స్ట్రెయిటనింగ్ మరియు జుట్టును సాప్ట్ గా మార్చడం , కఠినమైన రసాయనిక హెయిర్ ప్రొడక్ట్స్, హెయిర్ ట్రీట్మెంట్ వల్ల హెయిర్ లాస్ మరియు హెయిర్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి, వీటన్నింటికి బ్రేక్ వేయాలంటే డబ్బు వ్రుదాచేయకుండా ఇంట్లోనే కొన్ని హెయిర్ మాస్క్ ను మీరే స్వంతంగా రెడీ చేసుకోవాలి . దాంతో జుట్టు మంచి షైనింగ్ తో , సిల్కీ హెయిర్ గా మారుతుంది. ఈ క్రింది తెలిపిన హెయిర్ మాస్క్ లను ప్రయత్నించి మార్పును మీరే గమనించండి..

కొబ్బరి పాలు -తేనెతో మాస్క్ :
ఒక టేబుల్ స్పూన్ తేనె ను అరకప్పు పాలలో మిక్స్ చేసి బాగా బ్లెడ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి . తలకు పట్టించి 20 నిముషాల తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి. ఈ హెయిర్ మాస్క్ వల్ల చిక్కుత తక్కువగా ఉంటుంది . మరియు జుట్టుకు షైనింగ్ ను అధికంగా ఇస్తుంది.

అరటి, గుడ్డు మరియు ఆలివ్ ఆయిల్ మాస్క్:
ఈ మాస్క్ తలకు పోషణను అందిస్తుంది . జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది. అరటిపండును మొత్తగా మ్యాష్ చేసి అందులో ఒక గుడ్డు వేయాలి (ముఖ్యంగా ఎగ్ వైట్ మాత్రమే వేయాలి). అందులో రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేసి, తలకు పట్టించి 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఈ మాస్క్ ను నెలకొకసారి అప్లై చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.

అవొకాడో హెయిర్ మాస్క్:
అవొకాడో హెయిర్ మాస్క్ డల్ అండ్ ఫిజ్జీ హెయిర్ ను నివారించడానికి ఒక ఉత్తమ మార్గం. ఇది జుట్టుకు మాయిశ్చరైజ్ చేస్తుంది . జుట్టును ఇంతకు ముందు ఎన్నడూ లేనివిధంగా సిల్కీగా మరియు స్మూత్ గా ఉంచుతుంది .

తేనె మరియు బాదం ఆయిల్ మాస్క్ :
మీ జుట్టు చూడటానికి చిక్కుబడి, అది విడదియ్యడానికి మీకు సాద్యం కానప్పుడు , ఈ హెయిర్ మాస్క్ ఉపయోగపడుతుంది. బాదం ఆయిల్ జుట్టుకు చాలా మేలు చేస్తుంది . ఇది హెయిర్ ఫాల్ ను నివారిస్తుంది . ఇందులో విటిమిన్ ఎ అండ్ విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇవి హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. ఈ రెండు విటమిన్స్ నేచురల్ మాయిశ్చరైజర్స్ గా పనిచేస్తాయి .జ కాబ్టటి తేనె మరియు బాదం ఆయిల్ ను సమంగా తీసుకొని మిక్స్ చేసి తలకు అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

గుడ్డు, నిమ్మ మరియు పెరుగు:
ఇది ప్రోటీన్ రిచ్ హెయిర్ మాస్క్ . దీని వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది . నిమ్మరసం చుండ్రును నివారిస్తుంది . గుడ్డు మీ జుట్టుకు అవసరం అయ్యేషైనింగ్ ను అందిస్తుంది . పెరుగు జుట్టుకు అవసరంఅయ్యే తేమను అందిస్తుంది. ఈ హెయిర్ మాస్క్ ను 15రోజులకొక్కసారి ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

స్ట్రాబెర్రీ మరియు పెరుగు హెయిర్ మాస్క్:
జ్యూసీ స్ట్రాబెర్రీ జుట్టుకు గ్లాసీ షైన్ అందిస్తుంది . ఆయిల్ హెయిర్ కు ఇది ఒక బెస్ట్ ట్రీట్మెంట్ వంటిది. రెండు మూడు స్ట్రాబెర్రీస్ ను అరకప్పు పెరుగులో వేసి మిక్స్ చేసి బాగా బ్లెడ్ చేసి , తలకు అప్లై చేయాలి . 20 నిముషాల తర్వాత కడిగేసుకోవాలి..

మెయోనైజ్:
ఈ హెయిర్ మాస్క్ డ్రై అండ్ డ్యామేజ్ హెయిర్ ను నివారిస్తుంది . మెయోనైజ్ ను తలకు అప్లై చేయాలి . హెయిర్ లెంగ్త్ ను బట్టి మెయోనైజ్ అప్లై చేయాలి . తర్వాత షవర్ క్యాప్ ధరించి20 నిముషాలు అలాగే ఉంచి , తర్వాత నార్మల్ షాంపుతో తలస్నానం చేయాలి.



Click it and Unblock the Notifications