Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
కురుల సోయగాలకు కాకర చేసే మేలు
కాకరకాయ పేరు వింటేనే ముఖం చిట్లించుకొనే వారు చాలా మందే ఉంటారు. కాకరకాయతో చేసిన వంటకాలు తినాలంటే ‘అబ్బా చేదు' అనుకోకుండా ఉండలేరు. అయితే కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు
చేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మధుమేహగ్రస్తులకు చాలా మంచిది. అటువంటి కాకరకాయ చర్మం సంరక్షణకు మరియు శరీర సంరక్షణకు అనేక ప్రయోజనాలు చేకూర్చుతుంది. అంతే కాదు, అనేక జుట్టు సమస్యలకు మంచి చికిత్సను అంధిస్తుంది. కాకరకాయ రసంతో హెయిర్ కేర్ ట్రీట్మెంట్ వల్ల జుట్టుకు ఒక మంచి షైనింగ్ మరియు కేశాలకు దీర్ఘాయువును అంధిస్తుంది. చేదుగా ఉండా ఈ కాకర కాయ కేశాలకు ఏవిధంగా సహాయపడుతుందని మీకు ఆశ్చర్యం కలగవచ్చు, అందుకే కొన్ని విషయాలను మీతో బోల్డ్ స్కై పంచుకుంటోంది..
జుట్టు సంరక్షణలో కాకరకాయను మీరు ఉపయోగించడానికి, మీరు ఖచ్చితంగా ఒక ఇంట్లో ఉండే ఒక నేచురల్ పదార్థంతో మిక్స్ చేయాలని గుర్తుంచుకోవాలి. చేదుగా ఉండే కూరగాయలను లేదా కూరగాయల రసాన్ని నేచురల్ పదార్థాలతో మిక్స్ చేసి, జుట్టుకు ప్యాక్ వేసుకొన్నప్పుడు, మీరు మరిన్ని అదనపు ప్రయోజనాలు పొందవచ్చు . కాకరకాయ రసాన్ని జుట్టుకు పట్టించడం వల్ల కుదుళ్లు ద్రుడంగా, కురులు ఒత్తుగా తయారవుతాయి. అలాగే దీనిలో ఉన్న యాంటీ మైక్రోబియల్ గుణాల వల్ల చుండ్రు, తలలో వచ్చే ఇతర ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా ఉంటాయి. ఈ ప్రయోజనాలు పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం...

జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది:
మీ దువ్వెను ఎక్కువగా వెంట్రుకలు ఊడి, చుట్టుకొన్నప్పుడు మీకు బాధగా అనిపిస్తుంది. చాలా మందిలో హెయిర్ లాస్ చాలా సాధారణ సమస్య. జుట్టు సమస్య నివారించుకోవడం కోసం కాకరకాయ జ్యూస్ లో కొద్దిగా పంచదార మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ నేచురల్ గా తగ్గించుకోవచ్చు.

జుట్టు చివర్లు చిట్లితే:
మీ జుట్టు చివర్లు చిట్లడంతో బాధపడుతుంటే, ఈ సమస్యను నివారించడం కోసం కాకరకాయ జ్యూస్ ను మీ జుట్టుకు అప్లై చేయాలి. కాకరకాయ రసం మీ జుట్టుకు అప్లై చేయడం వల్ల చిట్లడం తగ్గుతుంది మరియు తిరిగి సహజ జుట్టులా పెరుగుతుంది . జుట్టు చిట్లడాన్ని తగ్గించడం కోసం ఈ పద్దతిని వారానికి రెండు సార్లు ప్రయత్నించాలి.

చుండ్రు తగ్గించడానికి :
ప్రస్తుత రోజుల్లో ఆహారం మరియు వాతావరణం, కాలుష్యం వల్ల చుండ్రు సాధారణ సమస్యగా మారుతోంది. కాకర కాయ రసంతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల చుండ్రు నివారించుకోవచ్చు. కాకరరసం మరియు జీలకర్రను మిక్స్ చేసి తలకు పట్టించడం ద్వారా ఒక నెలలోపు మీరు ఈ సమస్య నుండి బయటపడగలుగుతారు.

తెల్ల జుట్టు రాకుండా:
చిన్న వయస్సులో జుట్టు తెల్లబడటం ప్రస్తు రోజుల్లో ఎక్కువ మంది చూస్తున్నాం. ఈ సమస్యకు కాకరకాయ రసంతో చికిత్స అందించవచ్చు. తాగా ఉండే బిటర్ వెజిటేబుల్ రసాన్ని మీ తెల్ల జుట్టు మూలాలకు అప్లై చేయాలి. ఇలా ప్రతి 10రోజులకొకసారి చేయడం వల్ల తెల్ల వెంట్రుకల సమస్యను నివారిస్తుంది.

తలలో దురద:
దరుదగా ఉండే తలకు ఇది ఒక బెస్ట్ హోం రెమడీ. ఈ కాకరకాయ జ్యూస్ ను అవొకాడో లేదా అరటిపండుతో మిక్స్ చేసి తలకు హెయిర్ ప్యాక్ లా వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దురదను పోగొట్టుకోవడానికి వారానికి ఒకసారి అప్లై చేయాల్సిందే.

పొడిబారిన జుట్టుకు:
పొడిబారిన జుట్టు మరీ దురదగా ఉంటుంది. దురదతో పాటు ఇతర హెయిర్ సమస్యలకు కూడా ఏర్పడుతాయి. ఈ పొడి జుట్టును నివారించడానికి, తాజాగా ఉండే ఒక కాకర కాయ ముక్కను తలమాడుకు బాగా రుద్దాలి. కాకరకాయ ముక్కతో తలలో సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications
