Latest Updates
-
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు!
ఏయే ఆకులు కేశ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి ?
జుట్టు విషయంలో ఎప్పటికప్పుడు కేర్ తీసుకోకపోతే.. చాలా సమస్యలు ఎదురవుతాయి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా జుట్టు రాలిపోవడం, చుండ్రు, చిన్న వయసులోనే తెల్లజుట్టు రావడం, చివర్లు చిట్లిపోవడం వంటి రకరకాల సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జుట్టు సంరక్షణపై చాలా శ్రద్ధగా ఉండాలి. మార్కెట్ లో దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ కాకుండా సహజంగా దొరికే వాటితోనే జుట్టుకి మెరుగులు దిద్దుకోవడం మంచిది.
READ MORE: జుట్టురాలడం తగ్గించి, వేగంగా జుట్టు పెంచు ఉత్తమ హోం రెమెడీలు
జట్టు అందంకోసం ఆరాటపడని వాళ్లు లేరు. అందుకే శిరోజాల అందాన్ని మెరుగుపరచడంలో సహజసిద్ధమైన పచ్చని ఆకులు చాలా అవసరం. రకరకాల ఆకులు ఏ విధంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయో.. అలాగే శిరోజాల అందాన్ని కాపాడటంలో ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం. అందుకే.. కేశాల సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే రసాయనాల వాడకం లేకుండా సహజసిద్ధమైన ఈ ఆకులను వాడటమే ఎంతో శ్రేయస్కరమని చెబుతున్నారు.
READ MORE: 25ఏళ్ళలోపు జుట్టు రాలడానికి గల ముఖ్యమైన ఆరోగ్య కారణాలు
పచ్చని ఆకులు ఆరోగ్యాన్ని పదికాలాలు పచ్చగా ఉంచుతాయి. అలాగే శిరోజాల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. శిరోజాల అందాన్ని పెంచడంలో, కాపాడటంలో కొన్ని ఆకులు ముందు వరుసలో ఉన్నాయి. సహజసిద్ధమైన ఆకులతో నిగనిగలాడే జుట్టు పొందడం ఎలాగో తెలుసుకుందాం.

కరివేపాకు
కొబ్బరినునేలో కరివేపాకు వేసి మరిగించి, చల్లారక జుట్టు కుదుళ్ళకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తుంటే జుట్టురాలడం, వెంట్రుకలు తెల్లబడడం తగ్గుతుంది. జుట్టు షైనీగా మారుతుంది.

తులసి
తులసి ఆకులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది. గుప్పెడు తులసి ఆకుల్ని మెత్తగా పేస్ట్ చేసి అరలీటర్ నీళ్లలో వేసి కాచాలి. ఆ నీళ్లు చల్లారాక తలకు బాగా పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీని వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. వెంట్రుకలు రాలడం తగ్గిపోతుంది.

వేపాకు
వేపాకులో చాలా మెడికల్ వ్యాల్యూస్ ఉన్నాయి. ఇవి చిట్లిపోయిన వెంట్రుకలకు మంచి చికిత్స. లీటరు నీళ్లలో గుప్పెడు వేపాకులు వేసి బాగా మరగించాలి. చల్లారిన తర్వాత తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి ఒక్కసారి చేసినా చాలు. వీలైతే 2 లేదా 3 సార్లు చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

మందారం ఆకులు
మందార ఆకులను నానిన మెంతులతో కలిపి మెత్తగా నూరి తలకు ప్యాక్‌గా వేసి ఆరిన తర్వాత కుంకుడు కాయలతో తల స్నానం చేస్తే జట్టు మృదువుగా మారుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.

గోరింటాకు
ఒక కప్పు పొన్నగంటి కూర, ఒక కప్పు గోరింటాకు, రెండు చెంచాల మెంతిపొడి, అరకప్పు పెరుగు, ఒక చెంచా నిమ్మరసం, నీళ్లు కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.

టీ ఆకులు
కురులను లిక్కర్ (టీఆకులను ఉడికించిన నీటితో)తో శుభ్రం చేసుకోవడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. ప్రత్యేక సువాసనను అందిస్తుంది.

జామ ఆకులు
జామకాయల ఆకులు కురుల కుదుళ్లను బలపరచడమే కాదు, నిగనిగల మెరుపుని తీసుకొస్తాయి. లీటర్ నీటిలో గుప్పెడు జామ ఆకులను వేసి అరగంట సేపు అలాగే ఉంచాలి. తర్వాత ఆ నీటిని మరిగించి చల్లారనివ్వాలి. తర్వాత వడకట్టి, ఆకులను తీసేయాలి. ఆ నీటిని జుట్టు కుదుళ్లకు పట్టించి ఒక అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల కుదుళ్లు బలపడి, జుట్టు రాలడం తగ్గుతుంది.

కొత్తిమీర
తాజాగా ఉండే కొత్తిమీరను పేస్ట్ చేయాలి. దానిలోకి కొంచెం బాదాం ఆయిల్, ఉడికించిన మందార పువ్వులను కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

మెంతి ఆకు
జుట్టు సంరక్షణకు మెంతులే కాదు.. మెంతి ఆకులు కూడా సహాయపడతాయి. మెంతి ఆకులను పేస్ట్ లా చేసి తలకు డైరెక్ట్ గా పట్టించాలి. కాసేపటి తర్వాత షాంపూ వాడకుండా తలను శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల జుట్టు కొత్త నిగారింపును సంతరించుకుంటుంది.

చింత చిగురు
కొద్దిగా మజ్జిగలో చింత చిగురు, కప్పు గోరింటాకు పొడి, అరకప్పు శనగపిండి కలపాలి. తలకు బాగా నూనె రాసుకుని ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు కండిషనర్ లా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications