Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
హార్డ్ వాటర్ తో తలస్నానం చేసిన తర్వాత తీసుకోవల్సిన జాగ్రత్తలు
హార్డ్ వాటర్ అంటే, ఫ్యూరి ఫై కానీ నీరు లేదా బోర్ వెల్ వాటర్ లేదా బావీ నీరుతో తలస్నానం చేసుకోవడం వల్ల జుట్టు డ్రైగా మారడం లేదా డ్యామేజ్ అవ్వడం లేదా ఎక్కువగా చిక్కుబడుటం జరుగుతుంటుంది. ఎందుకంటే ఈ హార్డ్ వాటర్లో క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్ మొదలగునవి అధికంగా ఉంటాయి. ఇవి ఉండటం వల్ల జుట్టు నిర్జీవంగా మరియు డల్ గా మారడానికి కారణం అవుతుంది.
హార్డ్ వాటర్లో ఉండే ఈ మినిరల్స్ తల లేదా వెంట్రుకలకు చేరడం వల్ల మీ జుట్టు యొక్క మూలాల నుండి వెలువడే తేమ లేదా ఆయిల్ సరిగా జుట్టుకు అందక తేమను కోల్పోయి, జుట్టు పొడిగా, నిర్జీవంగా మరియు డ్రైగా మారుతుంది. ఈ మినిరల్స్ తలమాడు మీద కూడా చేరడం వల్ల తలలో దురద మరియు చుండ్రు వంటి సమస్యలకు దారి తీస్తుంది. READ MORE:అందమైన చర్మ సౌందర్యానికి హానికలిగించే హార్డ్ వాటర్..!
హార్డ్ వాటర్ జుట్టు రాలడానికి కూడా ప్రధాణ కారణం అవుతుంది. హార్డ్ వాటర్లో ఉండే క్యాల్షియం జుట్టును పొరికిగా లేదా పొట్టు రాలే విధంగా తయారుచేస్తుంది . ఇది జుట్టు చిట్లడానికి కారణం అవుతుంది. హార్డ్ వాటర్లో ఐరన్ అధికంగా ఉండటం వల్ల జుట్టు చిక్కుబడుట మరియు డ్రైగా మారడానికి కారణం అవుతుంది. హార్డ్ వాటర్ లో ఉండే కాపర్ జుట్టు యొక్క నేచురల్ కలర్ ను పాడుచేస్తుంది మరియు డిస్ కలరేషన్ ను మారిపోతుంది.
READ MORE: జుట్టుకు హాని కలిగించే హార్డ్ వాటర్ ను నివారించడం ఎలా
హార్డ్ వాటర్ నుండి జుట్టుకు హాని కలగకూడదనుకుంటే, ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టుకు తగిన రక్షణ కల్పించడానికి మరియు డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేయడానికి కొన్ని బెస్ట్ నేచురల్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. హార్డ్ వారట్ వల్ల డ్యామేజ్ అయిన జుట్టును తిరిగి రిపేర్ చేయడానికి కొన్ని నేచురల్ టిప్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

ఆపిల్ సైడర్ వెనిగర్:
హార్డ్ వాటర్ వల్ల జుట్టులో పేరుకుపోయిన మినిరల్స్ ను తొలగించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ గ్రేట్ గా సహాయపడుతుంది. అరబకెట్ నీటిలో మూడు చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్ ను మిక్స్ చేసి, షాంపుతో తలస్నానం చేసిన తర్వాత, ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసిన నీటితో తలారా పోసుకోవాలి.

కోకనట్ ఆయిల్:
హార్డ్ వాటర్ నుండి జుట్టుకు రక్షణ కల్పించడానికి కొబ్బరి నూనె గ్రేట్ గా సహాయపడుతుంది. స్నానం చేయడానికి వెళ్లే ముందు కొబ్బరి నూనెను తలకు మరియు కేశాలకు అప్లై చేయాలి. రెండు మూడు గంటల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి . ఇది మీ జుట్టుకు తేమను మరియు పోషణను అందిస్తుంది . డ్రైనెస్ ను నివారిస్తుంది.

గుడ్డు మరియు పెరుగు:
హార్డ్ వాటర్ తో తలస్నానం చేస్తున్నట్లైతే, హెయిర్ కండీషనర్ ను అప్లై చేయడం మర్చిపోకండి. హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా నేచురల్ హెయిర్ కండీషనర్ ను అప్లై చేయాలి . ఒక గుడ్డును అరకప్పు పెరుగులో మిక్స్ చేసతి తలకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

మయోనైజ్:
హార్డ్ వాటర్ వల్ల డ్యామేజ్ అయిన జుట్టు మోయనైజ్ ను అప్లై చేసి, 20నిముషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేయాలి.

నిమ్మరసం:
షాంపుతో తలస్నానం చేసిన తర్వాత నిమ్మరసం మిక్స్ చేసిన నీళ్ళను తలారా పోసుకోవాలి. ఇది నిర్జీవమైన జుట్టును తిరిగి కాంతివంతంగా మార్చుతుంది. మంచి వాసన కలిగి ఉంటుంది. చుండ్రు నివారిస్తుంది.

అవొకాడో ప్యాక్:
బాగా పండిన అవొకాడోను జుట్టుకు ప్యాక్ లా వేసుకోవాలి. అందుకు పాలలో అవొకాడో మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానంచేయాలి.

గ్లిజరిన్, నిమ్మ మరియు రోజ్ వాటర్ :
ఈ మూడింటిని నీటిలో మిక్స్ చేసి ఈ నీటితో తలస్నానం చేయాలి. లేదా ఈ మూడింటి మిశ్రమాన్ని తలకు పట్టించి 20నిముషాల తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications