Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
జుట్టు సంరక్షణకు అద్భుతంగా సహాయపడే అలోవెరా జెల్
అలోవెర(కలబంద)ఆరోగ్యానికి, చర్మసంరక్షణకు ఎంత మేలు చేస్తుందో మనందరికి తెలుసు. అలోవెరా గుజ్జు శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు ఇటు చర్మానికి మరియు కేశాలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలకు వాడే వివిధ రకాల ఔషధాలలో అలోవెరాను ఉపయోగించారు. ఇంకా మొటిమల నివారణకు కూడా ఉపయోగించారు. చర్మ సమస్యల్లో మొటిమలు పెద్ద సమస్య. ముఖారవిందాన్ని పోగొడుతుంది. అందుకు ఈ గ్రీన్ కలర్ అలోవెరా అద్భుతంగా పనిచేస్తుంది.అంతే కాదు
చాలా రకాల హేర్బల్ ఫేస్ ప్యాక్ లు కూడా అలోవెరా జెల్ ను ఉపయోగించడం వల్ల చర్మంలో అద్భుతమైన మార్పులు ఇస్తుంది.
చర్మ సమస్యలను నివారించడం మరియు చర్మానికి మాయిశ్చరైజింగ్ చేయడం అలావుంచితే, అలోవెరా జెల్ ను కేశ సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు. అలోవెరాలో హెయిర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది హెయిర్ ఫాల్ ను అరికడుతుంది. కురులు పెరిగేలా చేస్తుంది. ఇంకా కురులు సాఫ్ట్ గా తయారవుతాయి. కాబట్టి మీరు మీ ఇంట్లో అలొవెరా చెట్టు పెంచుకోవడం వల్ల ఇటు స్కిన్, హెయిర్ బెనిఫిట్స్ ను మెండుగా పొందవచ్చు. లేదా అలొవేరా గుజ్జు బయట మార్కెట్లో అందుబాటులో ఉన్నది. అది తెచ్చి ఉపయోగించుకోవచ్చు. అలొవెరా జెల్ కేశాలను ఎలా ఉపయోగపడుతుందో ఒక సారి చూద్దాం...

షాంపు చేయడానికి ముందు అలోవెర జెల్:
చుండ్రును తొలగించడం కొంచెం కష్టమైన పని . చుండ్రును వదిలించుకోవడానికి ఏపని చేసినా తిరిగి మళ్లి చేయాల్సి ఉంటుంది. కాబట్టి, తలస్నానానికి ముందు తలకు షాంపు పెట్టడానికి ముందు అలోవెరా జెల్, వీట్ జర్మ ఆయిల్, కొబ్బరి నూనెను తలకు పట్టించి 10 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

అలోవెరా జెల్ ను షాంపుగా:
అలోవెర జెల్ ను షాంపుతో చేర్చి వాష్ చేసుకోవచ్చు. అలోవెర జెల్లో తేనె మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేయాలి. ముఖ్యంగా చుండ్రు ఉంటే కనుక అందులో నిమ్మరసం కూడా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 5 నిముషాల తర్వాత నీళ్ళు పోసి తలస్నానం చేయాలి.

అలోవెర జెల్ ను కండీషనర్ గా :
అలోవెరా నేచురల్ హెయిర్ కండీషనర్. ఇది హనికలిగించే రసాయనిక హెయిర్ కండీషనర్స్ కంటే చాలా మంచిది. కాబట్టి అలొవెరా జెల్ ను మీ కేశాలకు, తల మాడుకు బాగా పట్టించి, మర్దన చేసి తర్వాత తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.కొబ్బరి నూనె మరియు జోజోబా ఆయిల్ తో చేర్చి తలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. అధినపు పోషణను అందిస్తుంది.

జుట్టు పెరుగుదలకు:
అవును , ఖచ్చితంగా అలోవెర జెల్ తో అది సాధ్యం అవుతుంది. అలోవెరాను తలకు పట్టించడం వల్ల తలలో ఉండే డెడ్ స్కిన్ సెల్ తొలగిస్తుంది. డీప్ గా పోషణను అందిస్తుంది. దాంతో హెయిర్ ఫోలిసెల్స్ ఓపెన్ అవుతాయి. దాంతో అలోవెరా జుట్టు పెరుగుదలకు , జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది.

అలోవెర జెల్ హెయిర్ మాస్క్:
హెల్తీ హెయిర్ కోసం , అలోవెర షాంపు మరియు కండీషర్ మాత్రం సరిపోవు. మంచి పోషణను కూడా అందిస్తుంది. అలోవెరా జ్యూస్ తో ఫ్యాబులస్ హెయిర్ మాస్క్ కూడా వేసుకోవచ్చు. అలోవెర జెల్, ఎగ్ బైట్ మరియు ఆమ్లా మిశ్రమం వేసి మిక్స్ చేసి తలకు హెయిర్ మాస్క్ వేసుకోవాలి. దీన్ని వారానికి కనీసం ఒక సారైనా వేసుకోవాలి.

ఇన్ స్టాంట్ హెయిర్ స్టైల్:
తలస్నానం చేసిన తర్వాత చిక్కు విడిపించడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. తడిమీద తలదువ్వుడం వల్ల జుట్టు చిక్కుబడటం, బ్రేకేజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి, హెయిర్ స్టైల్ కోసం అలోవెరాను ఉపయోగించుకోవచ్చు.



Click it and Unblock the Notifications