Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
జుట్టు చిట్లకుండా ఉండేందుకు నివారించాల్సి హోం రెమెడీస్
అందం విషయంలో జుట్టు కూడా ప్రధాన పాత్రను పోషిస్తుంది. మీ జుట్టు హెల్తీగా మరియు షైనీగా ఉంటేనే జుట్టు చూడటానికి అందంగా కనిపిస్తుంది. జుట్టు ఎంత పొడవున్నా, డ్యామేజ్ అయిన జుట్టు కన్నా, చిన్నగా మరియు ఆరోగ్యంగా ఉన్న జుట్టే చూడటానికి అందంగా కనిపిస్తుంది.
జుట్టు ఎంత ఒత్తుగా ఉన్నదనడం కన్నా ఎంత అందంగా మరియు ఆరోగ్యంగా ఉన్నదనేది చాలా అవసరం. చాలా మంది పొడవాటి జుట్టు కలిగి ఉంటుంది. అయితే ఆ జుట్టు డ్రైగా మరియు డ్యామేజ్ అయి ఉంటే ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. జుట్టు సమస్యల్లో జుట్టు చిట్లడం చాలా సహజం. ఈ సమస్యను చాలా మంది అమ్మాయిలు ఎదుర్కొంటుంటారు .చిట్లిన జుట్టు జుట్టు పెరగనివ్వకుండా చేస్తుంది మరియు నిర్జీవంగా మరియు కళ లేకుండా చేస్తుంది.
జుట్టు చిట్లడానికి కారణం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం లేదా కెమికల్ హెయిర్ డైలను అప్లై చేయడం మరియు సలోన్ లో ఉపయోగించే ఇతర కెమికల్ ప్రొడక్ట్స్ అంతే కాదు మరీ ముఖ్యంగా హాట్ హెయిర్ స్ట్రెయిట్నర్ ను ఉపయోగించడం వల్ల లేదా బ్లో డ్రైయింగ్ మరియు తడి జుట్టును దువ్వడం వల్ల కూడా జుట్టు చిట్లడానికి కారణం అవుతుంది.
కారణం ఏదైనా చిట్లిన జుట్టును నివారించడం వల్ల ముందు ముందు ఈ సమస్యను ఎదుర్కోకుండా మరియు డ్యామేజ్ అవ్వకుండా నివారించుకోవచ్చు. డ్రై హెయిర్ మరియు చిట్లిన జుట్టును నివారించడానికి వివిధ రకాల హోం రెమెడీస్ ఉన్నాయి.. మరి అవేంటో ఒకసారి చూద్దాం...

1. పెరుగు మరియు గుడ్డు:
పెరుగు మరియు గుడ్డును ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించి 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. తర్వాత నేచురల్ గా తలను ఆర్పుకోవాలి.

2. మోయోనైజ్ అండ్ రోజ్ వాటర్:
ఇది చాలా సింపుల్ హోం రెమెడీ. అరకప్పు మోయోజైజ్ లో రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20నిముషాలు అలాగే ఉండి తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి.

3. అరటిపండు మరియు అవొకాడో ప్యాక్:
బాగా పండిన అరటిపండు గుజ్జులో బాగా పండిన అవొకాడోను వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రామాన్ని తలకు పట్టించి 20నిముషాల తర్వాత మంచి షాంపుతో తలస్నానం చేయాలి. చిట్లిన జుట్టును నివారించడానికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ.

4. తేనె మరియు రోజ్ వాటర్:
చిట్లిన జుట్టును నివారించడానికి మరో ఉత్తమ హోం ట్రీట్మెంట్ ఇది. అరకప్పు తేనెలో మూడు టేబుల్ స్పూన్ల తేనె మిక్స్ చేసి తలకు పట్టించి 20నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

5.కొబ్బరినూనె:
కొబ్బరి నూనెను గోరువెచ్చగా వేడి చేసి, తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత హాట్ వాటర్లో టవల్ ను డిప్ చేసి నీరు బాగా పిండేసి, హాట్ టవల్ ను తలకు చుట్టి15నిముషాలు అలాగే ఉంచాలి . ఇలా వారానికొకసారి చేయడం వల్ల చిట్లిన జుట్టును నివారించుకోవచ్చు.

6. బాదం ఆయిల్ మరియు ఆలివ్ ఆయిల్ :
బాదం మరియు ఆలివ్ ఆయిల్ ను సమంగా తీసుకొని, తలకు పట్టించి మసాజ్ చేయాలి . తల మరియు జుట్టుకు పూర్తిగా పట్టించి, రెండు మూడు గంటల తర్వాత తలను దువ్వాలి . తర్వాత చల్లటి నీటితో, మిల్క్ షాంపుతో తలస్నానం చేయాలి.

7. మిల్క్ క్రీమ్ మరియు రోజ్ వాటర్:
అరకప్పు మిల్క్ క్రీమ్ మరియు రెండు చెంచాలా నీళ్ళు మిక్స్ చేసి పేస్ట్ లా చేసి తలకు పట్టించి 20నిముషాల తర్వాత, గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

8.బీర్ వాష్ :
మీ జుట్టును షాంపుతో వాష్ చేసిన తర్వాత, ఒక మగ్గు నీటిలో బీర్ మిక్స్ చేసి తలరా పోసుకోవాలి. ఇలా జుట్టుకు బీర్ ను కండీషనర్ గా ఉపయోగించడం వల్ల ఇది చిట్లిన జుట్టును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. జుట్టు డ్యామేజ్ అవ్వకుండా రక్షణ కల్పిస్తుంది.

9. అలోవెరా జెల్:
అరకప్పు అలోవెర జెల్లో 3 చెంచాల కోకోనట్ వాటర్ మిక్స్ చేసి, ఈ మిశ్రామాన్ని తలకు పట్టించాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయడం ద్వారా చిట్లిన జుట్టును నివారించుకోవచ్చు. మరియు జుట్టు డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు.

10. హెన్నా మరియు ఆయిల్:
హెన్నా బెస్ట్ నేచురల్ కండీషనర్. హెన్నా పౌడర్ ను, గ్రీన్ టీతో మిక్స్ చేసి పేస్ట్ లా చేసి, అందులో అరకప్పు వేడిగా ఉండే ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించాలి . దీన్ని రెండు గంటల పాటు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికొకసారి చేస్తుంటే జుట్టు డ్యామేజ్ కాకుండా నివారించుకోవచ్చు.



Click it and Unblock the Notifications
