జుట్టు నల్లగా సహజరంగుతో నిగనిగలాడాంటే: ఆయుర్వేద టిప్స్

జుట్టు సహజరంగు కాపాడుకోవడం చెప్పినంత తేలిక కాదు. నిగనిగలాడే నల్లని జుట్టు అందానికి ప్రతీకే అయినా దాన్ని సొంతం చేసుకోవడం కొద్దిగా కష్టమైన పనే అని నిపుణులు అంటున్నారు. జుట్టు సహజ రంగు కోల్పోకుండా రక్షించుకోవడానికి అవసరమైన చిట్కాలతో పాటు, జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

సాధారణంగా మన జుట్టు వయస్సు పెరిగే కొద్దీ , రంగు మరియు పటుత్వం కోల్పోయి తెల్లగా మారుతుంది, అంతేకాకుండా, జన్యుపరమైన సమస్యలు ,వంశపారంపర్య కారణాలు, అనారోగ్య కారణాల వల్ల సైతం ఈ ఇబ్బంది కలుగవచ్చు.

Natural Ayurvedic Hair Care Tips

అతి చిన్న వయస్సులోనే జుట్టు పొడిబారిపొవడం, పొట్లుగా మారిపోవడం ఎంతో బాదకలిగించే మరియూ ఇబ్బందిపెట్టే సమస్య, అయితే బాదపడకుండా, ఆలస్యం చెయకుండా ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకుందామా, మీరు చేయవలసిందల్లా

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

అరకప్పు ఆలివ్ ఆయిల్ ను బాగా వేడి చేసి అందులో కొన్ని చుక్కల రోజ్ మెరీ ఆయిల్ కలిపి ఈ మిశ్రమాన్ని జుట్టు లోపలి దాకా పట్టించి అరగంట పాటు అలాగే వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. తలస్నానం చేసే ప్రతి సారి ఈ విధంగా చేసినట్టయితే జుత్తుకు రంగు వేసుకోవల్సిన అవసరం దాదాపు రాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆలివ్ ఆయిల్ మరియు రోజ్ మెరీ ఆయిల్ జుట్టు సహజరంగను సంరక్షించడంతో పాటు జుట్టు పొడవుగా పెరగడానికి దోహదం చేస్తాయి.

మందార ఆకు

మందార ఆకు

మందార ఆకుల చిట్కా అందరికీ తెలసిందే. మందార ఆకులను మెత్తగా పేస్ట్ చేసి తలకి పట్టించి, ఆతర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా కొన్ని వారాల పాటు చేసినట్లైతే మంచి ఫలితాన్ని పొందవచ్చు. మందార ఆకులు వేడిని తగ్గించడంతో పాటు జుట్టు రంగును కాపాడుతాయి. జుట్టు పొడవుగా పెరగడానికి కూడా దోహదం చేస్తాయి.

 కరివేపాకు

కరివేపాకు

కరివేపాకును కొబ్బరి నూనెలో వేసి బాగా కాగిన తర్వాత నూనెను వడగట్టి చల్లార్చి ప్రతి రెండు రోజులకొకసారి కురులకు పట్టించి మర్ధన చేస్తుండాలి. ఈ విధంగా చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత మంచి ఫలితాన్ని పొందవచ్చు.

మెంతి ఆకు

మెంతి ఆకు

మెంతి ఆకుల చిట్కా అందరికీ తెలసిందే. మెంతి ఆకులను మెత్తగా పేస్ట్ చేసి తలకి పట్టించి, ఆతర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా కొన్ని వారాల పాటు చేసినట్లైతే మంచి ఫలితాన్ని పొందవచ్చు. మెంతి ఆకులు వేడిని తగ్గించడంతో పాటు జుట్టు రంగును కాపాడుతాయి. జుట్టు పొడవుగా పెరగడానికి కూడా దోహదం చేస్తాయి.

ఉసిరికాయ

ఉసిరికాయ

మన జుట్టుకి ఉసిరికాయ ప్రభావం ఎంతో మంచిది అని, ఎన్నో తరాలనుంచి అందరికి తెలిసిన విషయమే.అయితే ఎండబెట్టిన ఉసిరి ముక్కలని నీటిలో నానబెట్టి, మరుసటి రోజు మీ జుట్టుకి రాసుకుని తలస్నానం చేస్తే,ఎంతో మంచిది. మీ జుట్టు నున్నగా, లేదా మృదువుగా అవ్వాలంటే, ఉసిరి పేస్ట్ ని కాని, లేదా ఉసిరి ఆయిల్ ని కాని తలకు రాసుకుని తలస్నానం చేస్తే ఎంతో మంచిది..ఉసిరికాయను ముక్కలుగా చేసి కొబ్బరి నూనెలో వేసి బాగా మరగనిచ్చి అనంతరం ఆ నూనెను వడకట్టి చల్లార్చి తలకి రాసుకోవాలి. ఉసిరిలోని గుణాలు జుట్టును నల్లబరచడంతో పాటు తెల్లబడకుండా నిరోధిస్తుంది.

 అరటిపండు

అరటిపండు

బాగా మిగలమగ్గిన అరటిపండు, అవకోడా పండుగుజ్జు బాగా కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి బాగా ఆరిన తర్వాత తలస్నానం చేయాలి.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరలు ఒంటికే కాదు జుట్టు కు కూడా చాల మంచివి. వాటితో జుట్టుకూ నిగారింపు ఇవ్వొచ్చు. చుండ్రు, జుటు ్టరాల డం తగ్గించుకునేందుకు ఇవిఎంతో ఉపయోగపడతాయి. ఒక కప్పు పొనగంటి కూర, ఒక కప్పు గోరింటాకు పొడి, రెండు చెంచాల మెంతిపొడి, అరకప్పు పెరుగు, ఒక చెంచా నిమ్మరసం, నీళ్లు కలిపి పేస్‌‌టలా త యారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం, చుండ్రు తగ్గుతుంది.

 గోధుమగడ్డి:

గోధుమగడ్డి:

గోధుమ గడ్డి పేస్ట్ లా చేసి కేశాలకు పట్టించాలి. ఇలా పట్టించడం వల్ల జుట్టు మొదళ్ళు స్ట్రాంగ్ అవుతాయి. మరియు జుట్టు సహజరంగు కలిగి ఉంటుంది.

నువ్వులు:

నువ్వులు:

నువ్వు గింజలు: కొంచెం బాధం నూనె తీసుకుని , దానిలో నువ్వులపొడి కలిపి, మీ జుట్టుకి పట్టించండి,20-25 నిమిషాల తరువాత తలస్నానం చేస్తే మీ జుట్టులో అద్భుతాలు చూడవచ్చు.

మెంతులు:

మెంతులు:

మన చర్మ సౌందర్యానికే కాదు, మన జుట్టు సం రక్షణలో కూడా మెంతులు ఎంతో ఉపయోగపడతాయి, ఈ మెంతుపిండిని, రోజూ తలకు పట్టించుకుని తలస్నానం చేస్తే ఎంతో మృదువైన, అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

తులసి:

తులసి:

ఒక గుప్పెడు తులసి ఆకులను తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి, కాచిన తర్వాత ఆ నీటిని చల్లార్చి గోరు వెచ్చగా అయిన తర్వాత ఆ నీటిని కుదుళ్ళలోకి ఇంకేలా రోజూ రాస్తూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది.

 మామిడి ఆకులు

మామిడి ఆకులు

కొన్ని మామిడి ఆకులు తీసుకుని వాటిని పేస్ట్ లాగా చేసుకుని, తలకు పట్టించాలి, 15-20 నిమిషాల తరువాత, చల్లని నీటితో శుబ్రంచేసుకుంటే, అది మీ జుట్టు పెరుగుదలకే కాక అందమైన నల్లని జుట్టుని మీ సొంతం చేస్తుంది. అలాగే కొన్ని మామిడి ఆకులు, పచ్చి మామిడి పైన పచ్చని తొక్కను తీసుకుని,వాటిని పేస్ట్ లాగా చేసి,నూనెతో కలిపి ఎండలో ఎండబెట్టాలి,ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి శుబ్రం చేసుకుంటే జుట్టు ఊడిపోయే సమస్య తగ్గి అందంగా సహజమైన నల్లని జుట్టు పొందవచ్చు.

జామఆకులు:

జామఆకులు:

జామ ఆకులు మెత్తగా పేస్ట్ చేసి తలకు పట్టించి 15నిముషాల తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతుంటుంది.

క్యారెట్ ఆయిల్:

క్యారెట్ ఆయిల్:

క్యారెట్ ఆయిల్ మార్కెట్లో అందుబాటులో ఉంది, దీనికి కొద్దిగా నువ్వుల నూనె మిక్స్ చేసి తలకు పట్టించి 15 నుండి 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరి నీళ్ళు నిమ్మరసం:

కొబ్బరి నీళ్ళు నిమ్మరసం:

కొబ్బరినీళ్లు, నిమ్మరసాన్ని సమపాళ్లలో తీసుకుని తలకు బాగా పట్టించి పదిహేను నిమిషాల పాటు నడినెత్తిన మసాజ్‌ చేయండి.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

హెయిర్ లాస్ మరియు ప్రీమెచ్యుర్ గ్రేహెయిర్ నివారించడానికి ఉల్లిపాయ ఒకటి. ఉల్లిపాయ రసం ప్రీమెచ్యుర్ గ్రేహెయిర్ నివారిస్తుంది, జుట్టు రాలడాన్ని అరికడుతుంది. బట్టతల రాకుండా చేస్తుంది. ఉల్లిపాయ జ్యూస్ ను తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. ప్రతి రోజూ రాత్ర నిద్రించడానికి ముందు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆముదం:

ఆముదం:

ఆముదం నూనెలో యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ప్రీమెచ్యుర్ గ్రే హెయిర్ ను నివారిస్తాయి మరియు బట్టతల రాకుండా సహాయపడుతుంది . ఆముదం నూనెను తలకు పట్టించి మసాజ్ చేయాలి. దీన్ని వారింలో కనీసం రెండు సార్లు చేస్తే మంచిది

బ్లాక్ టీ:

బ్లాక్ టీ:

బ్లాక్ టీ తెల్ల జుట్టును నల్లగా మార్చుతుంది మరియు జుట్టును సాప్ట్ గా మరియు మంచి షైనీగా మార్చుతుంది . ప్రీమెచ్యుర్ గ్రేహెయిర్ నివారించడానికి ఈ ఫార్ములాను ఫాలో అయిపోవండి.

శికాయ్ మరియు ఆమ్లా:

శికాయ్ మరియు ఆమ్లా:

శికాకాయ్ మరియు ఆమ్లా రెండింటి కాంబినేషన్ ట్రెడిషినల్ హోం రెమెడీ. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ రెండింటి కాంబినేషన్ ఆయుర్వేద చిట్కాలను జుట్టుకు ఉపయోగిస్తున్నారు . ఇది ఒక బెస్ట్ హేర్బల్ ప్రొడకట్స్ మరియు మరియు నేచురల్ షాంపు . గ్రేహెయిర్ నివారించడానికి ఇది ఒక ఫర్ఫెక్ట్ కాంబినేషన్.

అలోవెర:

అలోవెర:

తలకు అలోవెర జెల్ అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం తలస్నానం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మీ జుట్టుకు అవసరం అయ్యే సెలీనియమ్ అలోవెర నుండి పూర్తిగా లభ్యం అవుతుంది. అంతే కాదు కేశాలకు నేచురల్ కలర్ ను అందిస్తుంది . తలకు రెగ్యులర్ గా అలోవెరాను అప్లై చేస్తుంటే తలలో చుండ్రు ఉండదు.

Desktop Bottom Promotion