Latest Updates
-
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.!
ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు అవసరం ఈ పోషక ఆహారాలు..
కొంత మందిని గమనించినట్లైతే వారి జుట్టు హెల్తీగా మరియు షైనిగా మెరుస్తుంటుంది. అందకు కారణం వారి జుట్టుకు తగినన్ని పోషకాలు పుష్కలంగా అందుతున్నాయన్న విషయం గుర్తించాలి. మరి మీ జుట్టు ఎలా ఉంది? మీరు కూడా మీ హెల్తీ హెయిర్ కోసం హెల్తీ ఫుడ్స్ తీసుకుంటున్నారా?
ఆహారం శరీర ఆరోగ్యానికి ఎంత అవసరమో...జుట్టు ఆరోగ్యానికి కూడా అంతే అవసరం. ముఖ్యంగా జుట్టు స్ట్రాంగ్ గా హెల్తీగా పెరగాలంటే పోషకాహారం ఎంతో అవసరం అవుతుంది. పోషకాల లోపం వల్ల జుట్టు రాలడం మరియు హెయిర్ బ్రేకేజ్ అవ్వడం జరగుతుంది . పోషకాల లోపం వల్ల కేశాల యొక్క నాణ్యత లోపిస్తుంది మరియు ఫోలిసెల్స్ కూడా బలహీనపడుతాయి . అందువల్లే కొన్ని సందర్భాల్లో జుట్టు మరియు చర్మ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవల్సి ఉంటుంది.
ఆరోగ్యకరమైన జుట్టుకు అద్భుత ఆహారాలు
జుట్టు పెరగడానికి అవసరం అయ్యే ఆహారాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మరి జుట్టు పెరుగుదలకు, ద్రుడత్వానికి అవసరం అయ్యే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

గుడ్డు
జుట్టు ఆరోగ్యంగా స్ట్రాంగ్ గా పెరగాలంటే గుడ్డును ఇంటర్నల్ గాను మరియు ఎక్సటర్నల్ గా తీసుకోవాలి. గుడ్డులో ఉండే ప్రోటీన్ కంటెంట్ జుట్టును మొదళ్ళ నుండి బలోపేతం చేస్తుంది. అందువల్ల చాలా వరకూ హెయిర్ ప్యాక్స్ లో గుడ్డును ఎక్కువగా చేర్చుతుంటారు.

ఓట్స్:
ఓట్స్ లో ప్రోటీన్స్, కాపర్, జింక్ మరియు విటమిన్ బి అధికంగా ఉండటం వల్ల బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి మాత్రమే కాదు, బరువు తగ్గడానికి కూడా గ్రేట్ గా సహాయపడుతాయి.

సాల్మన్:
ఒక ఆరోగ్యకరమైన జుట్టు మరియు తలపై చర్మం కొరకు కావాల్సిన ముఖ్య పదార్థాలు ప్రోటీన్ మరియు విటమిన్ డి అని చెప్పవచ్చు. సాల్మన్ లో ప్రోటీన్,విటమిన్ డి మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉన్నాయి. మీ జుట్టును బాగా ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచటానికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లం చాలా ముఖ్యమైనది. ఆరోగ్యకరమైన జుట్టు ఒక ఆరోగ్యకరమైన చర్మంతో మొదలవుతుంది. అందువల్ల మీ ఆహారంలో ఎక్కువగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉండేలా చూసుకోండి.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్( ఆకుకూరలు):
గ్రీన్ లీఫ్ అంటే ఆకుకూరలు, కరివేపాకు వంటి వాటిలో ఐరన్ అధికంగా ఉంటుంది. దీంతో పాటు అత్యవసర పోషకాలైన ఐరన్, బీటా కెరోటిన్స్, ఫ్లొల్లెట్ మరియు విటమిన్ సి, పొటాషియం అధికంగా ఉండి కురుల ఫోలీసెల్స్ ను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతాయి.

స్వీట్ పొటాటో:
స్వీట్ పొటాటో కేశాలకు ఏం చేస్తుంది? స్వీట్ పొటాటోలో ఉండే విటమిన్ ఎ, యాంటీయాక్సిడెంట్స్ మరియు బీటా కెరోటిన్ ఇవన్నీ జుట్టు సంరక్షణకు అయ్యే పోషకాలను పుష్కలంగా అందిస్తుంది. చిట్లిన జుట్టుతో బాధపడే వారు వీటిని తీసుకోవడం మరింత మంచిది.

క్యారెట్:
క్యారెట్లలో ఉండే విటమిన్ A మీ దృష్టి తీవ్రతరం చేసేందుకు మాత్రమే కాకుండా మీ జుట్టు ఆరోగ్యాన్ని నిర్వహించేందుకు కూడా సహాయం చేస్తుంది. విటమిన్ A తలపై చర్మంలో సిబం ఆయిల్ ఏర్పడటానికి సహాయపడుతుందని డాక్టర్ సందీప్ చెప్పారు.సిబం చర్మం మరియు జుట్టు బాగా తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. తలపై చర్మం మీద తేమ ఉంటే ఆరోగ్యకరమైన జుట్టు అని అర్థం.

పచ్చిబఠానీలు:
పచ్చిబఠానీలు ఆరోగ్యకరమైన జుట్టు కొరకు అందుబాటులో ఉన్న సమతుల్యమైన ఆహారంగా చెప్పవచ్చు. దీనిలో జింక్,ఇనుము మరియు విటమిన్ B వంటి ఖనిజాలు మరియు విటమిన్లు ఉన్నాయి. అవి మీ జుట్టు మరియు తలపై చర్మ ఆరోగ్యాన్ని నిలబెట్టడానికి సహాయపడతాయి.

అవొకాడో
అవొకాడోను బహిర్గతంగా అప్లై చేయెచ్చు మరియు అంతర్గతంగాను తీసుకోవచ్చు. ఎలా ఉపయోగించుకొన్న, ఇది జుట్టుకు మంచి మాయిశ్చరైజింగ్ ను అందిస్తుంది మరియు జుట్టకు అవసరం అయ్యే తేమను, విటమిన్ సి, ఇ మరియు ఇతర న్యూట్రీషియన్స్ సప్లైను అందిస్తుంది.

నట్స్ మరియు సీడ్స్:
నట్స్ మరియు ధాన్యాలు, ముఖ్యంగా బాదాం మరియు వాల్ నట్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు వీటిలో విటమిన్ ఇ అధికంగా ఉండే హెయిర్ సెల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. వాల్ నట్స్ లో కాపర్ అధికంగా ఉంటుంది. ఇది కురులను నేచురల్ కలర్ లో మెరిసేలా చేసేందుకు సహాయపడుతాయి.



Click it and Unblock the Notifications