Latest Updates
-
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.!
ఆయిలీ, స్మెల్లీ హెయిర్ కు చెక్ పెట్టే 10 మిరాకిల్ హోం రెమెడీస్..
అందమైన...ఒత్తైన...పొడవాటి జుట్టు ఉంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు. అలాంటి అందమైన జుట్టు నుండి ఇబ్బంది కలిగించే అసాధారణమైన వాసన వస్తుంటే ఎలా ఉంటుంది. ఇది స్మెల్లీ హెయిర్ సిండ్రోమ్ వల్ల కావచ్చు . ఎక్కువగా ఆయిల్ జుట్టు ఉన్నవారు ఈ సమస్యను ఎదుర్కుంటుంటారు.
అయితే ఈ ఆయిలీ అండ్ స్మెల్లీ హెయిర్ ను నివారించుకోవడం ఎలా? స్మెల్లీ హెయిర్ తగ్గించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి జుట్టుకు సురక్షితమైనవి మరియు నేచురల్ గా తలలో జిడ్డు మరియు ఎక్సెస్ ఆయిల్ ను తగ్గిస్తాయి.
స్టిక్కీ హెయిర్(జిడ్డు జుట్టుకు)కారణం స్ట్రెస్, ఎక్సెస్సీవ్ స్వెట్టింగ్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, చుండ్రు, ఆయిల్ హెయిర్ లేదా హార్మోనుల ప్రభావం . తలలో ఎక్సెస్ ఆయిల్ లేదా చెమట వల్ల తలలో మాత్రమే కాదు, .జుట్టు నుండి కూడా దుర్వాసన వస్తుంటుంది. ఇలాంటి పరిస్థితి నలుగురిలో ఇబ్బంది కలిగిస్తుంది. అంతే కాదు ఈ లక్షణాలున్నవారిలో కూడా చీకాకు కలిగిస్తుంది . స్ట్రెస్ కు గురి అవుతారు.
ఈ సమస్యను నివారించుకోవడానికి వెరీ సింపుల్ హోం రెమెడీస్ ఉన్నాయి. స్మెల్లీ హెయిర్ నివారించుకోవడం కోసం కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను ఈ క్రింది విధంగా లిస్ట్ తయారుచేయడం జరిగింది....

ఆపిల్ సైడర్ వెనిగర్ :
తలకు షాంపు చేసిన తర్వాత , కొద్దిగా నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో నుండి వచ్చే చెడు వాసన తొలగిపోతుంది.

అలోవెర జెల్:
అలోవెర జెల్ తో తలకు మసాజ్ చేయాలి. ఇది చుండ్రు మరియు ఎక్సెస్ ఆయిల్ ను నివారిస్తుంది. మరియు హీలింగ్ లక్షణాలు కూడా కలిగి ఉంది. కాబట్టి, అలోవెరాను తలకు అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. . అలోవెర జెల్ కు కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి అప్లై చేయవచ్చు.

బేకింగ్ సోడ:
బేకింగ్ సోడా తలలో మరియు జుట్టు నుండి వచ్చే వాసనను పూర్తిగా తొలగిస్తుంది. అంతే కాదు జుట్టులో ఆయిల్ నెస్ ను తగ్గిస్తుంది. బేకింగ్ సోడాకు వాటర్ మిక్స్ చేసీ ఈ పేస్ట్ ను తలకు పట్టించి 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేసుకోవాలి.

నిమ్మరసం :
నిమ్మరసం జుట్టును ఫ్రెష్ గా ఉంచుతుంది. ఇది చుండ్రును నివారిస్తుంది. జుట్టును షైనీగా మార్చుతుంది. తలకు నిమ్మరసం అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి. స్మెల్లీ హెయిర్ నివారించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

దాల్చిన చెక్క మరియు తేనె:
కొద్దిగా దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించాలి. తర్వాత ఈ నీటికి తేనె జోడించి అప్లై చేయాలి. దీన్ని అప్లై చేసిన ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. అలాగే దాల్చిన చెక్క పౌడర్ మరియు తేనె ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను నాశనం చేస్తుంది. దాంతో జిడ్డు వదులుతుంది. వాసన పోతుంది.

వేప నూనె :
వేపనూనె తలకు అప్లైచేయడం వల్ల ఇది తలలో ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది, జుట్టుకు వేపనూనె అప్లై చేయాలి. లేదా వేప పేస్ట్ అప్లై చేయడం వల్ల ఆయిల్ ను మరియు తలలో వాసన తగ్గిస్తుంది.

ఆరెంజ్ తొక్క:
ఆరెంజ్ తొక్కలో బ్యూటీ బెనిఫిట్స్ ఎక్కువ. అలాగే ఆయిల్ హెయిర్ మరియు స్మెల్లీ హెయిర్ ను నివారించడంలో కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఆరెంజ్ తొక్కను నీటిలో వేసి మరిగించాలి.తలకు షాంపు చేసిన తర్వాత ఈ నీటిని తలారా పోసుకోవాలి. జిడ్డు జుట్టుకు ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

టీట్రీ ఆయిల్ :
ఇది తలలో చుండ్రు, ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది. టీట్రీ ఆయిల్ ను నీటిలో వేసి మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. 30 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

టమోటో జ్యూస్:
టమోటోల్లో ఉండే అసిడిక్ నేచర్ తలలో పిహెచ్ లెవల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇది తలలోని ఎక్సెస్ ఆయిల్ సెక్రికేషన్ ను కంట్రోల్ చేస్తుంది. ఫ్యూయల్ స్మెల్ తగ్గిస్తుంది. బాగా పండిన టమోటోలో కొద్దిగా ఫుల్లర్స్ ఎర్త్ మిక్స్ చేసి తలకు పట్టించాలి. తర్వాత షవర్ క్యాప్ ధరించి అరగంట తర్వాత చల్లటి నీటితో తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

బీర్ వాష్ :
తలకు షాంపుతో స్నానం చేసిన తర్వాత బీర్ ను తలారా పోసుకోవాలి. పోసుకొన్నాక 10 నిముషాలు అలాగే ఉండి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. .ఇది జుట్టును షైనీగా మార్చుతుంది తలలో స్మెల్ నివారిస్తుంది. . ఇది బెస్ట్ స్మెల్లీ స్కాల్ఫ్ రెమెడీ..



Click it and Unblock the Notifications
