Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
నార్మల్ లేదా డ్రై జుట్టు మంచి షైనింగ్ తో మెరవాలంటే కొన్ని నేచురల్ రెమెడీస్
జుట్టు సంరక్షణలో వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటాము. ముఖ్యంగా అందులో బ్రాండెడ్ హెయిర్ కండీషనర్స్, షాంపులు మరియు సెరమ్స్ హెయిర్ ప్రొడక్ట్స్ గా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి కాబట్టే మనం నేచురల్ రెమెడీస్, కిచెన్ ఇనిగ్రెంట్స్ మర్చిపోతున్నాము. మన జుట్టుకు బ్యూటిఫుల్ షైన్ తీసుకు రావడంలోవంటగది నేచురల్ రెమెడీస్ ను మర్చిపోతున్నారు .
పొడవైన షైనింగ్ హెయిర్ పొందాలంటే 15 నేచురల్ టిప్స్
మన వంటగదిలో ఉండే బ్యూటి ప్రొడక్ట్స్ నిమ్మ, ఆపిల్ సైడర్ వెనిగర్, ఆలివ్ ఆయిల్, గుడ్డు వంటివి జుట్టుకు మంచి షైనింగ్ ను తీసుకొస్తుంది . వీటితో పాటు, ప్రొపర్ గా హెయిర్ కేర్ తీసుకోవడం రెగ్యులర్ డైట్ లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మరియు పండ్లు చేర్చుకోవడం ద్వారా జుట్టుకు మంచి షైనింగ్ పొందవచ్చు . జుట్టు ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో అప్పుడు జుట్టు మెరుస్తుంటుంది.!ఈ విషయాన్ని మీరు కూడా అంగీకరిస్తారు . మరి జుట్టుకు నేచురల్ హెయిర్ షైనింగ్ ను కొన్ని నిముషాల్లోనే పొందాలంటే కొన్ని నేచురల్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా...

నిమ్మరసం మరియు వెనిగర్:
హెయిర్ పిహెచ్ లెవల్స్ పెంచడానికి వెనిగర్ గ్రేట్ గా సహాయపడుతుంది. మరి నిమ్మరసం జుట్టుకు మంచి సైనింగ్ ను అందిస్తుంది. ఈ రెండి పదార్థాలను సమంగా తీసుకిని కొద్దిగా వాటర్ మిక్స్ చేసి, తలస్నానం పూర్తి అయిన తర్వాత వెనిగర్ లెమన్ వాటర్ ను తలారాపోసుకోవాలి. జుట్టు స్మూత్ గా మారుతుంది.

గుడ్డు పచ్చసొన:
గుడ్డులోని పచ్చసొన, మరియు ఆలివ్ ఆయిల్ తీసుకొని రెండింటిని బాగా కలిసిపోయే వరకూ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి షవర్ క్యాప్ ధరించి 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఈ హోం రెమెడీ డ్రై అండ్ డ్యామేజ్ హెయిర్ కు గ్రేట్ గా పనిచేస్తుంది. కొన్ని నిముషాల్లోనే జుట్టుకు అవసరమయ్యే పోషణను మరియు షైనింగ్ ను అందిస్తుంది.

గ్రేట్ అండ్ స్వీట్ బాదం ఆయిల్:
గుడ్డుపచ్చ లేదా గుడ్డు హెయిర్ మాస్క్ లను ఇష్టపడని వారు నేచురల్ ఆయిల్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. తలస్నానం చేయడానికి ముందు కొద్దిగా బాదం ఆయిల్ తీసుకొని గోరువెచ్చగా చేసి తలకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ జుట్టుకు కండీషనర్ గా పనిచేస్తుంది మరియు లవ్లీ షైనింగ్ ను అందిస్తుంది.

.మెయోనైజ్:
మెయోనైజ్ కేవలం చీజ్ బర్గర్స్ కు మాత్రమే కాదు, మెయోనైజ్ ను మనం జుట్టుకు కూడా ఉపయోగించుకోవచ్చు . మెయోనైజ్ ను హెయిర్ మాస్క్ గా ఉపయోగించడం వల్ల ఇది డ్రై హెయిర్ ను నివారిస్తుంది. జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది. మీకు సెన్సిటివ్ ముక్కు లేదా ఈ వాసన పడని వారు, మెయోనైజ్ లో కొద్దిగా వెనీలా ఎక్స్ ట్రాక్ట్ ను జోడించి తలకు అప్లై చేయాలి.

సొరకాయ:
సొరకాయను మెత్తగా పేస్ట్ చేసి అందులో నుండి జ్యూస్ తియ్యాలి. ఈ జ్యూస్ ను తలకు మరియు జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

టీ:
జుట్టుకు నేచురల్ షైన్ పొందాలంటే పంచదార వేయ్యని టీనిి తలకు పట్టించాలి. షాంపు చేసి తలస్నానం చేయాలి. ఫైనల్ గా కూడా గ్రీన్ టీ వాటర్ ను తలారా పోసుకోవడం వల్ల డ్రై హెయిర్ మిళమిళ మెరుస్తుంటుంది.

పాలు:
పాలు కూడా జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది మరియు జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది . బ్రష్ ఉపయోగించి చల్లటి పాలను తలకు అప్లై చేయాలి . లేదా తలకు స్ప్రే చేయాలి . తర్వాత తలను నైస్ గా దువ్వుకోవాలి . అరగంట తర్వాత బేబీ షాంపుతో తలస్నాం చేయాలి. ఈ నేచురల్ హెయిర్ షాంపు జుట్టును షైనీగా మరియు సాప్ట్ అండ్ స్మూత్ గా మార్చుతుంది.

అవొకాడో హెయిర్ మాస్క్:
అవొకాడోను మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు అందులో గుడ్డు పగులగొట్టి వేసి, రెండు చెంచాల తేనె మరియు కొద్దిగా ఓడ్కా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

పెరుగు హెయిర్ మాస్క్:
పెరుగును జుట్టుకు మరియు తలకు పట్టించి మసాజ్ చేయాలి. అరగంట తర్వత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పెరుగు జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది మరియు నేచురల్ కండీషనర్ గా పనిచేస్తుంది డ్రై అండ్ డ్యామేజ్ హెయిర్ ను నివారించడంలో ఇది ఒక బెస్ట్ నేచురల్ హెయిర్ మాస్క్

నిమ్మరసం
కురల సహజ నిగారంపు కోసం కొబ్బరి నూనెలో కొన్ని చుక్కలు నిమ్మరసం కలపి తలకు మసాజ్ చేయండి . మరుసటిరోజు దాన్ని షాంపూతో కడగండి జుట్టులో మెరుపు వస్తుంది.



Click it and Unblock the Notifications











