Latest Updates
-
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై
హెయిర్ ఫాల్ తగ్గించి, జుట్టు పెరిగేలా చేసే హెర్బల్ రెమెడీస్..!
అడల్ట్స్ లో హెయిర్ ఫాల్ మరియు హెయిర్ థిన్నింగ్ చాలా సర్వసాధరమైన సమస్య. ఈ మద్యకాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. హెయిర్ ఫాల్ , హెయిర్ థిన్నింగ్ వల్ల బట్టతల వస్తుంది. జుట్టు రాలిపోయి, పల్చగా మారడం వల్ల జుట్టు చూడటానికి అందంగా కనబడదు సరికాదా..గతంలో కంటే డిఫరెన్స్ ఎక్కువగా తెలుస్తుంది. జుట్టు రాలడం, జుట్టు పల్చగా మారడం, బట్టతల వల్ల మొత్తం అందం పాడవుతుంది.
హెయిర్ ఫాల్ మరియు హెయిర్ థిన్నింగ్ కు వివిధ కారణాలున్నాయి. అవేంటంటే:
హెరిడిటి సమస్యలు
హెయిర్ ప్రొడక్ట్స్ లో ఉపయోగించే కెమికల్స్
హెయిర్ డైస్ (కెమికల్స్ )
ఆహారపు అలవాట్లు
హెయిర్ స్టైలింగ్ టూల్స్
పొల్యూషన్
స్ట్రెస్
ఐరన్ లోపం
జుట్టు రాలడం లేదా జుట్టు పల్చగా మారడానికి కారణమేదైనా కావచ్చు. సమస్య మరింత తీవ్రం కాకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఇటువంటి పరిస్థితిలో జుట్టు పెరగడానికి బదులు, మరింత ఎక్కువగా రాలిపోతాయి. అందువల్ల ఎప్పటికప్పుడు హెయిర్ కండీషర్స్ ను ఎక్కువగా అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ ను తగ్గించుకోవచ్చు. హెయిర్ కండీషనర్స్ హెయిర్ ఫాల్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.
హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి మార్కెట్లో ఉండే ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల వాటిలో ఉండే కెమికల్స్ మరియు సింథటిక్ సబ్ స్టాన్సెన్ వల్ల సమస్య మరింత ఎక్కువ అవుతుంది. జుట్టు రాలడం అలాగే క్రమంగా పెరుగుతూ పోతుంటే చివరకు జుట్టు విపరీతంగా పల్చబడిపోతుంది. ఇలాంటి సమయంలో బెస్ట్ నేచురల్ హెర్బల్స్ ఎంపికచేసుకోవడం మంచిది.
జుట్టు రాలడం నివారించి, జుట్టు పెరుగుదలకు ఇవి గొప్పగా సహాపడుతాయి. అంతే కాదు ఈ నేచురల్ పదార్థాల వల్ల జుట్టుకు ఎలాంటి హాని జరగదు . అటువంటి హెర్బ్స్ ఈ క్రింది విధంగా..!

1. మెంతి:
మెంతులు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం మెత్తగా పేస్ట్ చేసి తలకు ప్యాక్ చేసుకోవాలి. ఈ ప్యాక్ ను తలకు మసాజ్ చేయడం వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దాంతో జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

2. అలోవెర:
కలబందలో స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీబెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి. అలోవెర గుజ్జును కొబ్బరినూనెతో మిక్స్ చేసి తలకు పట్టంచాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు పోషణ మరియు మాయిశ్చరైజింగ్ అందుతుంది.

3. అల్లం:
జింజర్ రూట్ ను తలకు మర్దన చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఒక గంట తర్వాత రెగ్యులర్ షాంపు, కండీషనర్ తో తలస్నానం చేయాలి.

4. వేప:
వేపను అన్ని రకాల స్కిన్ అండ్ స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో గ్రేట్ గా ఉపయోగిస్తారు. వాస్తవానికి, వేపఆకులను చికెన్ పాక్స్ ను నివారించడంలో గ్రేట్ రెమెడీ అని చెప్పొచ్చు. అలాగే హెయిర్ ఫాల్ తగ్గించడంలో కూడా గ్రేట్ రెమెడీ. కొన్ని వేపఆకులను కొబ్బరి నూనెలో వేసి మరిగించి , వడగట్టి తర్వాత తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి.

5. హెన్నా:
హెన్నాను నేచురల్ మెయిర్ డైలాగా ఉపయోగిస్తారు . మరియు దీన్ని హెయిర్ కండీషనింగ్ మాస్క్ వలే కూడా ఉపయోగిస్తారు. దీని వల్ల జుట్టు ఒత్తుగా మరియు షైనీగా పెరుగుతాయి. హెన్నాకు కొద్దిగా వాటర్ మిక్స్ చేసి పేస్ట్ చేసి అప్లై చేసుకోవాలి. అలాగే ఇతర హెయిర్ ప్యాక్స్ కూడా జోడించి అప్లై చేసుకుంటే మరింత బెటర్ గా సహాయపడుతుంది.

6. రీట:
కుంకుడుకాయ పౌడర్ నీటితో మిక్స్ చేసి తలంటు పోసుకోవాలి. హెయిర్ ఫాల్ తగ్గించడంలో ఇది చాలా ఉత్తమ హెర్బల్ హోం రెమెడీ.

7. జింగ్కో:
ఈహెర్బ్ హెయిర్ ఫాలిసెల్స్ లోపాన్ని తగ్గిస్తుంది. దీన్ని చాలా రకాల షాంపులలో ఉపయోగిస్తుంటారు . దీన్ని నేచురల్ గా ఉపయోగించడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

8. జిన్సింగ్ :
మరో హెర్బ్ ఇది. దీన్ని కూడా వివిధ రకాల షాంపులలో ఉపయోగిస్తుంటారు. ఇది చైనీస్ హెర్బ్ . ఇది బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. దాంతో హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది.

9. పుదీనా:
మింట్ ఆయిల్లో కూలింగ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది తలను మరింత కూలింగ్ గా ఉంచుతుంది . జుట్టుకు పెరుగుదలకు రక్తప్రసరణను మెరుగుపరచడంలో ఇది ఒక గ్రేట్ సొల్యూషన్. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే ఇక ముందు జుట్టు రాలకుండా సహాయపడుతుంది.

10. రోజ్మెర్రీ:
డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్ ను ఆలివ్ ఆయిల్ తో మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. ఇతర జుట్టు సమస్యలను నివారిస్తుంది మరియు జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.

11. ల్యావెండర్:
ల్యావెండర్ ఆయిల్ నాడీకణాలను ఉత్తేజపరుస్తుంది. హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి లావెండర్ షాంపును ఉపయోగించుకోవచ్చు.

12. ఆమ్లా:
ఆమ్లా (ఉసిరికాయ) దీన్ని పౌడర్ చేసి కొబ్బరి నూనెతో మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల జుట్టుకు పోషణ అందుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి జుట్టుకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది.



Click it and Unblock the Notifications