Latest Updates
-
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.! -
తెలంగాణలో వైభవోపేతంగా ఆషాఢ బోనాలు.. రంగంలో భవిష్యవాణి చెప్పిన సంగతులివే.!
సాప్ట్, స్ట్రాంగ్ అండ్ షైనీ జుట్టుకు పెరుగు హెయిర్ ప్యాక్స్
ఎన్ని కండీషనర్లు వాడినా జుట్టు మళ్లీ పొడిగానే తయారవుతోందా..? జుట్టు చివరల్లు చిట్లిపోయి..జుట్టంతా డ్యామేజ్ అవుతోందా..? చండ్రుతో వెంట్రుకలు బలహీనమై ఎక్కువగా రాలిపోతున్నాయా? అయితే వీటన్నింటినీ పరిష్కరించడానికి ఓ నేచురల్ మార్గం ఉంది. అదేంటంటే...పెరుగుతో తయారుచేసిన హెయిర్ ప్యాక్స్ ఉపయోగించడం .

తేనెతో షైనీ హెయిర్ పొందడం:
జుట్టు ఆరోగ్యంగా మెరుస్తుండాలంటే ఈ ప్యాక్ వేసుకోవడం మంచిది.
కావల్సినవి:
చిక్కటి పెరుగు: 1cup
నిమ్మరసం: 1tsp
తేనె : 1 చెంచా

ప్యాక్ వేసుకోవడం ఎలా:
ముందుగా చిక్కటి పెరుగులో కొద్దిగా నిమ్మరసం, తేనె వేసి పేస్ట్ లాగా అయ్యే వరకూ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేసి కండీషనర్ రాసుకోవాలి. ఫలితంగా జుట్టుకు మెరుపు రావడంతో పాటు ఆరోగ్యంగా ఎదుగుతుంది. వారంలో రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ుంటుంది. తలస్నానానికి ఉపయోగించే షాంపు తక్కువ గాఢత కలిగి ఉండేలా జాగ్రత్తపడాలి.
ఆలివ్ ఆయిల్ :
డ్రై హెయిర్ కు తోడు చుండ్రు బాధిస్తుంటే, ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల తక్షణ ఉపశనమం కలుగుతుంది.
కావాల్సినపదార్థాలు:
పెరుగు: 1 కప్పు
ఆలివ్ ఆయిల్: 3 టేబుల్ స్పూన్లు

ప్యాక్ వేసుకోవడం ఎలా:
ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకుని అందులో ఆలివ్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీనిలోంచి కాస్త మిశ్రమాన్ని తలపై వేసి ఓ పది నిముషాల పాటు గుండ్రంగా మసాజ్ చేయాలి. తర్వాత మిగిలిన పేస్ట్ తో జుట్టు మొత్తం కింది వరకూ ప్యాక్ లాగా వేసుకోవాలి. అరగంట తర్వాత షాంపుతో శుభ్రంగా తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వారంలో రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. తలస్నానానికి ఉపయోగించే షాంపు తక్కువ గాఢత కలిగి ఉండేలా జాగ్రత్త పడాలి.
సాప్ట్ హెయిర్ కోసం:
జుట్టు పొడిగా ఉంటే చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇలాంటి కురులను సాప్ట్ గా మార్చి , ఎప్పుడూ హైడ్రేషన్ లో పెట్టాలంటే ఈ ప్యాక్ గ్రేట్ గా సహాయపడుతుంది.

కావల్సినవి:
చిక్కటి పెరగు : 1 కప్పు
ప్యాక్ వేసుకోవడం ఎలా:
గట్టిగా ఉండే పెరుగు తీసుకుని పేస్ట్ లా అయ్యే వరకూ కలుపుతూ ఉండాలి. ఇలా తయారైన పేస్ట్ ను జుట్టుకు, కుదుళ్లకు పట్టించి మాస్క్ లాగా వేసుకోవాలి. తర్వాత తల చుట్టూ కాటన్ టవల్ చుట్టుకొని, అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత షాంపుతో తలస్నానం చేసి, కండీషనర్ అప్లై చేయాలి. దీని వల్ల జుట్టు సాప్ట్ గా తయారవ్వడంతో పాటు మెరుపు కూడా వస్తుంది.
నార్మల్ హెయిర్ ఉన్న వారు వారానికొకసారి, పొడి జుట్టు ఉన్నవారు వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ ట్రై చేయడం మంచిది, తలస్నానికి ఉపయోగించే షాంపు తక్కువ గాఢత కలిగి ఉండాలి.
మినుములతో:
జుట్టు సాప్ట్ గా మరియు స్టాంగ్ గా తయారుకావాలంటే ఈ ప్యాక్ ప్రయత్నించండి.
కావాల్సినవి:
మినుములు: 1/2కప్పు
పెరుగు: 1/2కప్పు

ప్యాక్ వేసుకోవడం ఎలా:
మినుముల్ని రాత్రంతా నానబెట్టుకుని, ఉదయాన్నే మెత్తటి పేస్ట్ లాగా వేసుకోవాలి. ఈ పేస్ట్ ని పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు, జుట్టు మొత్తానికీ పట్టించాలి. అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ వల్ల జుట్టు స్ట్రాంగ్ గా మరియు సాప్ట్ గా ..అందంగా తయారవుతుంది. ఈ ప్యాక్ ను వారంలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
మెంతులు:
స్ప్లిట్స్ ఎక్కువగా ఉండి, జుట్టు రాలిపోతుంటే ఈ ఫ్యాక్ తప్పకుండా హెల్ప్ అవుతుంది.
కావల్సినవి:
చిక్కటి పెరుగు : 1కప్పు
మెంతులు: అరకప్పు

ప్యాక్ ఇలా వేసుకోవాలి:
ముందుగా మెంతుల్ని మెత్తగా మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇలా తయారైన పొడిని పెరుగులో వేసి పేస్ట్ లా అయ్యేంత వరకూ కలుపుతూనే ఉండాలి. ఈపేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ, మాడుకు పట్టించి గంట పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత షాంపుతో తలస్నానం చేసి కండీషనర్ అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ ఉపయోగించిన మెంతుల వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండడంతో పాటు చివర్లు చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు ఎక్కువగా రాలిపోవడాన్ని అరికడుతుంది.
ఈ ప్యాక్ పొడిగా ఉన్న జుట్టు పైనే అప్లై చేసుకోవాలి. వారానికొకసారి ఈ ప్యాక్ ట్రై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ ప్యాక్ వేసుకోవడానికి కనీసం రెండు గంటల ముందు తయారుచేసి పెట్టుకోవాలి.
పెరుగుతో ఇన్ని రకాల జుట్టు సమస్యలను ఎలా నివారించుకోవచ్చో తెలుసుకున్నారుగా ..ఇలాంటి నేచురల్ , సింపుల్ టిప్స్ తో తయారుచేసుకునే హెయిర్ ప్యాక్స్ ప్రయత్నించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.



Click it and Unblock the Notifications