Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసే 7 ఆయుర్వేదిక్ ఆయిల్స్
మనం అందరం మన జుట్టు పోషణకు మరియు జుట్టు పెరుగుదల కోసం కొన్ని బెస్ట్ ఆయిల్స్ ను ఎంపిక చేసుకుంటాం. తలకు, ఆయిల్ మసాజ్ చాలా మంచిది. ఆయిల్ మసాజ్ హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది, తల, జుట్టుకు సంబంధించి కొన్ని సమస్యలను అరికడుతుంది మరియు పొడిబారిన కేశాలను మరియు చిక్కుబడిన కేశాలకు నేచురల్ గా చికిత్సనందిస్తుంది. జుట్టు సంరక్షణలో చాలా రకాల నూనెలు ఉన్నాయి వాటిలో కొబ్బరి నూనె చాలా ప్రసిద్ది చెందినది.
జుట్టుకు పెరుగుదల కోసం ఉపయోగించే నూనెల్లో చాలా రకాలు ఉన్నాయి. అయితే ఎన్ని రకాల నూనెలున్నప్పటికి జుట్టుకు సంబంధించనంత వరకూ నేచురల్ గా పెరిగేలా చేసే నూనెలు మన ఇండియన్ ఆయిల్సే. ఈ ఆయుర్వేద జుట్టు రహస్యాన్ని పురాతన గ్రంథాలలో రాసినట్లు చెప్పబడింది. ఆయుర్వేదంలో చాలా రకాల మూలికా తైలాలు ఉన్నాయి. అవి మీ హెయిర్ డ్యామేజ్ ను అరికడుతుంది మరియు జుట్టుకు కావల్సిన పోషణను అందించడానికి సహాయపడుతాయి. ఈ నూనెలను మందారపువ్వులు, పెరుగు లేదా నిమ్మరసంలో కలిపి హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల కేశాలను చాలా మేలు చేస్తుంది.
జుట్టు పోషణకు వివిధ రకాల నూనెలు ఉన్నాయి. అందులో కొన్ని జుట్టు పెరుగుదలతో పాటు జుట్టు రంగును(నల్లగా) మార్చే నూనెలు కూడా ఉన్నాయి.మనం రోజూ వాడుకునే నూనెలను కూడా సౌందర్య సాధనాలుగా వాడుకోవచ్చు. అరోమా, సుగంధ నూనెలతోపాటు, మేని సౌందర్యాన్ని పెంచడానికి నూనెలు ఎంతగానే దోహదంచేస్తాయి. చర్మం నిగారింపు తగ్గ కుండా, మృదుత్వాన్ని కోల్పోకుండా నూనెలు ఉపయోగపడతాయి. అలాగే జుట్టు రాలకుండా నివారించడంలో కూడా సహాయపడతాయి.. మరి జుట్టు రాలడం తగ్గించే ఆయుర్వేదిక్ నూనెలు గురించి తెలుసుకుందాం..

ల్యావెండర్ ఆయిల్ : ల్యావెండర్ ఆయిల్లో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ఇది చాలా అద్భుతమైన నూనె . అనేక రెమెడీస్ లో దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. దీని ఆరోమా వాసన వల్లే బాతింగ్ ఆయిల్ గా బాగా పాపులర్ అయ్యింది. . అందుకే దీన్ని ఎక్కువగా థెరఫీలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. హెయిర్ రూట్స్, హెడ్ మజిల్స్ ను ను రిలాక్స్ చేస్తుంది. దాంతో జుట్టు రాలడం తగ్గి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.


లెమన్ ఆయిల్ ఆరోమా థెరఫీలల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు . జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . నిర్జీవమైన జుట్టును పెరుగుదలను ఇది గ్రేట్ గా సహాయపడుతుంది . చుండ్రు నివారించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

కొబ్బరి నూనె: స్వచ్ఛమైన కొబ్బరి నూనెను శిరోజాల సౌందర్యానికి వాడతారు. కొబ్బరి నూనె వెంట్రుకలను మృదువుగా, నల్లగా చేస్తుంది. కేశాల ఎదుగుదలకు, ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడటమే కాక చర్మాన్ని నల్లగా ఉంచుతుంది. శీతాకాలంలో చర్మం పగలకుండా రక్షణగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె కొన్ని సౌందర్య సాధనాలలోనూ, క్రీములు, బేబీ ఆయిల్స్ షాంపుల తయారీలోనూ వాడుతున్నారు. కాలిన గాయాలపై కొబ్బరి నూనె రాస్తుంటే మచ్చ ఏర్పడకుండా ఉంటుంది.

ఆల్మండ్ ఆయిల్: సూర్య కిరణాలను తట్టుకునే శక్తి ఈ నూనెలో ఉంది. ఇది చర్మ రక్షణగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఎ, బి, ఫాస్పరస్, కాల్షియం, సల్ఫర్, క్లోరిన్, మాగ్నీషియం అధికంగా లభిస్తాయి. ఈ కారణంగా ఆల్మండ్ ఆయిల్‌ను సౌందర్య సాధనాల తయారీలో ఈ నూనెను ఉప యోగిస్తారు. ఈ నూనె కోల్డ్ క్రీమ్స్, బాడీ లోషన్లు, హాండ్‌క్రీమ్స్, కొన్ని రకాలైన సబ్బులలోనూ ఉంటుంది.

ఆలివ్‌నూనె: చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఆలివ్ నూనెది ప్రత్యేక స్థానం. చిన్నారులకు మర్ధన చేయడానికి ఎక్కువగా ఈనూనెను ఉపయోగిస్తారు. చర్మానికి వాడే మందులు, ఆయింట్‌మెంట్స్ తయారీ లోనూ దీనిని ఎక్కువగా వాడుతారు. ఈ నూనెతో చర్మాన్ని మసాజ్ చేసి 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చర్మం మృదువుగా, కాంతిగానూ మారుతుంది.

ఆముదం నూనె: ఈ నూనెను చర్మానికి పైపూతగా ఉపయోగి స్తారు. చర్మంపై ఏర్పడే పులి పిరులు, చెమట పొక్కులు, పాదాలకు ఏర్పడే అనెలకు లోతైన గాయాల తాలూకు మచ్చలను పోగొట్టడానికి కాస్ట్రా యిల్ దివ్యౌషధంగా పని చేస్తుంది. శిరోజాల ఆరోగ్యానికి రక్షణగా పనిచేస్తుంది. కనుబొమల వెంట్రుకలు పెరగడానికి కనురెప్పల సౌందర్యానికి ప్రతిరోజూ నూనెను రాయడం మంచిది. కేశాలు నల్లగా నిగనిగలాడటానికి తోడ్పడుతుంది.



Click it and Unblock the Notifications