Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
జుట్టు పెరుగుదల కోసం.. కొబ్బరినూనెలో కలపాల్సిన పదార్థాలు !
జుట్టు ఉన్న అమ్మాయి ఏ కొప్పు ఏసుకుంటే ఏంటి అనే నానుడి మీరు వినే ఉంటారు. జుట్టు ఉన్నవాళ్లు కట్ చేసుకొన్నా... పొడవుగా పెంచుకోవాలన్నా ముందుగా ఆరోగ్యకరమై స్ట్రాంగ్ హెయిర్ కలిగి ఉండాలి. అప్పుడే కోరుకున్న విధంగా..స్టైల్ గా మార్చుకోవచ్చు.
ఒత్తైన నల్లని కురులు కలిగి ఉంటే మీరు లక్కీ. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న జుట్టు సమస్యలు చీకాకు గురిచేస్తున్నాయి. జుట్టు సమస్యలు కేవలం స్త్రీలలో మాత్రమే కాదు, పురుషుల్లో కూడా కనిపిస్తున్నాయి.
చుండ్రు, కాలుష్యం, అనారోగకరమైన జీనశైలి, మొదలగునవి జుట్టు రాలే సమస్యను మరింత వరెస్ట్ గా మార్చి చివరకు హెయిర్ ఫాల్, బట్టతలకు గురిచేస్తున్నాయి. కొబ్బరి నూనె జుట్టు రాలడం తగ్గించడంలో సురక్షితమైనది.
జుట్టు పెరుదలకు ఉపయోగించే కొబ్బరి నూనెలో అద్భుత మైన లక్షణాలు కలిగి ఉన్నాయి. ఈ కొబ్బరి నూనెకు మరిన్ని హెల్తీ పదార్థాలు చేర్చి తలకు అప్లై చేయడం వల్ల ఆశ్చర్యం కలిగించే ప్రయోజనాలు పొందుతారు.

1. కొబ్బరి నూనె -అవొకాడో:
మీరు డ్రై హెయిర్ తో బాధపడుతున్నట్లైతే ఇది ఒక ఉత్తమ పరిష్కారం. బాగా పండిని అవొకాడో గుజ్జుకు కొబ్బరినూనె మిక్స్ చేయాలి , ఈ రెండింటిని 1/4కప్పు పాలలో మిక్స్ చేసి జుట్టుకు హెయిర్ మాస్క్ గా వేసుకొని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసుకోవాలి.

2. కొబ్బరి నూనె-ఆముదం:
కొబ్బరి నూనెతో మిక్స్ చేసుకోదల్చిన మరో నేచురల్ పదార్థం ఆముదం. కొబ్బరి నూనె, ఆముదంను సమంగా తీసుకొని వేడి చేయాలి. గోరువెచ్చని నూనెను తలకు పట్టించి, తలకు టవల్ చుట్టాలి. అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఈ మిశ్రమం జుట్టుకు కావల్సిన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. జుట్టు మరింత హెల్తీగా ఉంటుంది.

3. కొబ్బరి నూనె -నిమ్మరసం:
హెయిర్ ఫాల్ కు మరో కారణం చుండ్రు. ఈ సమస్యను నివారించుకోవడానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. రెండు భాగాల కొబ్బరి నూనెలో ఒక భాగం నిమ్మరసం మిక్స్ చేసి, తలకు పట్టించాలి . రాత్రంతా అలాగే ఉంచి తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

4. కొబ్బరి నూనె-బాదం నూనె:
కొబ్బరి నూనెతో మిక్స్ చేయదల్చిన మరో హెల్తీ పదార్థం బాదం ఆయిల్. కొన్ని చుక్కల బాదం ఆయిల్ ను కొబ్బరి నూనెతో మిక్స్ చేసి జుట్టుకు పట్టించి 10 నిముషాలు మసాజ్ చేయాలి. దీన్ని ఒక గంట లేదా ఇంకా ఎక్కువ సేపు అలాగే ఉంచుకోవచ్చు. దీని వల్ల జుట్టు పెరుగుతుంది.

5. కొబ్బరి నూనె- అలోవెర మాస్క్:
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను దూరం చేసుకోవడానికి ఇది ఒక సురక్షితమైన మార్గం. ఈ మాస్క్ వండర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఈ రెండింటిని సమంగా తీసుకొని మిక్స్ చేసి తలకు, జుట్టు పొడవునా అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

6. కొబ్బరి నూనె, ఇతర నూనెలు:
జుట్టు ఆరోగ్యంగా, స్ట్రాంగ్ పెరగాలంటే తగిన న్యూట్రీషియన్స్ అవసరం అవుతాయి. ఒక భాగం కొబ్బరి నూనె, 3భాగాలు నీళ్లు, 2టీస్పూన్ ట్రీట్రీ ఆయిల్, కొన్ని చుక్కలు జాస్మిన్ ఆయిల్ మిక్స్ చేసి జుట్టు చిక్కుగా అనిపిస్తే దీన్ని స్ప్రే చేయాలి.

7.కొబ్బరి నూనె, కరివేపాకు:
మీ బాస్కెట్ లో కరివేపాకు ఉన్నప్పుడు వేరే వాటికోసం వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కరివేపాకు జుట్టుకు అవరమయ్యే అన్ని పోషకాలు కలిగి ఉంటుంది. ఈ రెమెడీని వారంలో రెండుస్లారు అప్లై చేయాలి. హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి ఈ రెండింటి కాంబినేషన్ ఉత్తమమైనది.

8. కొబ్బరి నూనె-ఆమ్లా:
కొబ్బరి నూనెను, ఆమ్లాతో మిక్స్ చేసినప్పుడు కొన్ని అద్భుతాలను చేస్తుంది. ఆమ్లా పొడిని, కొబ్బరినూనెతో మిక్స్ చేసి వేడి చేయాలి. తర్వాత వడకట్టుకోవాలి. కొన్ని నిమిషాలు చల్లార్చిన తర్వాత రాత్రి నిద్రించే ముందు తలకు అప్లై చేసి ఉదంయ తలస్నానం చేయాలి.

9. కొబ్బరి నూనె -తేనె:
హెయిర్ డ్యామేజ్ ను నివారించుకోవడానికి తేనె గ్రేట్ గా సహాయపడుతుంది. కొబ్బరి నూనెతో మిక్స్ చేయదల్చిన వాటిలో ఇది ఒక ఉత్తమ పదార్థం. ఒక టీస్పూన్ తేనె తీసుకొని 4 టీస్పూన్ల నూనెలో మిక్స్ చేసి గోరువెచ్చగా వేడి చేసి చల్లారిన తర్వాత తలకు అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత షాంపుతో తలస్నాన చేయాలి.



Click it and Unblock the Notifications











