Latest Updates
-
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.!
ఆల్మండ్ ఆయిల్, పాల మిశ్రమాన్ని జుట్టుకి పట్టిస్తే పొందే బెన్ఫిట్స్
పాలు, ఆల్మండ్ ఆయిల్ మిశ్రమాన్ని జుట్టుకి పట్టిస్తే ఏమవుతుంది
మీ జుట్టు ఆరోగ్యాన్ని, మెరుపుని కోల్పోయిందని ఫీలవుతున్నారా ? అయితే.. కొన్ని న్యాచురల్ హెయిర్ ప్యాక్ లు ప్రయత్నించి చూడటం వల్ల.. మీ జుట్టు కోల్పోయిన ఆరోగ్యాన్ని పొందవచ్చు.
చాలా సందర్భాల్లో మనం హెల్తీగా ఉన్నప్పటికీ.. కొన్ని రకాల అలవాట్లు.. మనల్ని, మన అందాన్ని అన్ హెల్తీగా మార్చేస్తాయి. అసమతుల్య ఆహారం, దుమ్ము, కాలుష్యంలో తిరగడం, సరైన జుట్టు సంరక్షణ చిట్కాలు పాటించకపోవడం వంటి కారణాల వల్ల జుట్టు అన్ హెల్తీగా మారుతుంది.
పోషణ అందించడం చాలా అవసరం. ముఖ్యంగా.. ఆహారం రూపంలో, హెయిర్ ప్యాక్ రూపంలో జుట్టు సంరక్షణ పట్టించుకున్నప్పుడు.. హెయిర్ హెల్తీగా ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, ఒత్తుగా పెరగడానికి మనం డైట్ ఫాలో అవుతుంటాం.
న్యాచురల్ అండ్ హోం రెమిడీస్ ద్వారా హెయిర్ ప్యాక్స్ అప్లై చేస్తే.. జుట్టు మరింత ఆరోగ్యంగా ఉంటుంది. మరి వంటింట్లో అందుబాటులో ఉండే.. ఎలాంటి పదార్థాలతో జుట్టు హెల్తీగా, గ్లోయింగ్ గా ఉంటుందో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు
2 టీస్పూన్ల ఆల్మండ్ ఆయిల్
2 టేబుల్ స్పూన్ల పాలు

హెయిర్ ప్యాక్
ఈ రెండు పదార్థాల్లోనే అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అవి జుట్టుకి చాలా ప్రయోజనకరమైనవి. రెగ్యులర్ గా ఈ హెయిర్ ప్యాక్ ని ఉపయోగిస్తే.. జుట్టుని హెల్తీగా మారుస్తాయి.

బలమైన జుట్టుకి
పాలల్లో ప్రొటీన్ ఉండటం వల్ల జుట్టుకి పోషణ అందిస్తుంది. అలాగే జుట్టుని బలంగా మార్చడమే కాకుండా.. జుట్టు రాలడాన్ని అరికట్టి.. ఒత్తుగా మారుస్తాయి.

ఆల్మండ్ ఆయిల్
ఆల్మండ్ ఆయిల్ లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది.. జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది.

డ్రై హెయిర్
డ్రై హెయిర్ కి ఈ హోంమేడ్ హెయిర్ ప్యాక్ అద్భుతమైన ఫలితాన్నిస్తుంది. జుట్టుని హైడ్రేట్ గా ఉంచుతుంది.

తయారు చేసే విధానం
రెండు పదార్థాలను ఒక గిన్నెలో మిక్స్ చేయాలి. బాగా కలిపిన తర్వాత.. జుట్టుకి, కుదుళ్లకు పట్టించాలి. కొన్ని నిమిషాలు మసాజ్ చేయాలి.

20 నిమిషాలు
20 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూ ఉపయోగించి, గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
