Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
జుట్టుకి ఆయిల్ పెట్టేటప్పుడు చేయకూడని పొరపాట్లు ఏంటి ?
జుట్టు సంరక్షణ కోసం రకరకాలుగా ప్రయత్నిస్తుంటాం. వాటిలో ఆయిల్ పెట్టడం, షాంపూ, కండిషనర్,, హెయిర్ ప్యాక్స్.. ఇలా. వీటన్నింటిలో ఆయిల్ పెట్టుకోవడం చాలా ముఖ్యమైన అలవాటు. జుట్టుకి ఆయిల్ పెట్టి తలస్నానం చేయడం వల్ల చాలా స్ట్రాంగ్ గా, ఒత్తుగా ఉంటాయి. అయితే జుట్టుకి ఆయిల్ పెట్టడం అంటే.. ఏదో గాబరాగా పెట్టడం కాదు.. దానికి కూడా ఓ పద్ధతి ఉంటుంది.
తలస్నానం సమయంలో జుట్టుని డ్యామేజ్ చేసే మిస్టేక్స్
ఏదో వారానికి ఒకసారి జుట్టుకి ఆయిల్ పెట్టాలి అన్నట్లు.. పెట్టేసి.. వెంటనే తలస్నానం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి జుట్టుకి ఆయిల్ ఎలా పెట్టాలి ? వారానికి ఎన్ని సార్లు పెట్టాలి ? జుట్టుకి ఆయిల్ పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

జుట్టుకి ఆయిల్ హెల్తీ.. డ్యామేజ్ కూడా
జుట్టుకి ఆయిల్ పెట్టడం పాత కాలం నుంచి వస్తున్న అలవాటు. కొబ్బరినూనె లేదా నువ్వుల నూనె లేదా ఆముదంను జుట్టుకి పట్టించేవాళ్లు. చిన్నప్పటి నుంచి కాలేజీలకు వెళ్లే వయసు వచ్చే వరకు.. కొబ్బరినూనె జుట్టుకి పెట్టుకోవడం అలవాటుగా ఉండేది. దీనివల్ల ఆయిల్ లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకి బాగా ఉపయోగపడేవి. రెగ్యులర్ గా ఆయిల్ పెట్టుకోవడం వల్ల జుట్టు స్ట్రాంగ్ గా మారుతుంది.

సరైన పద్ధతి
అయితే జుట్టకి ఆయిల్ సరైన పద్ధతిలో పెట్టుకోకపోతే.. జుట్టు రాలడానికి కారణమవుతుంది. చాలా హార్డ్ గా మసాజ్ చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనమవుతాయి. అలాగే ఎక్కువగా ఆయిల్ పెట్టినా స్కాల్ప్.. ఆయిలీగా మారుతుంది. ఒకవేళ చుండ్రు ఉంటే కూడా.. ఆయిల్ వల్ల మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.

నార్మల్ లేదా హాట్ ఆయిల్ మసాజ్ ?
హాట్ ఆయిల్ తో మసాజ్ చేస్తే మంచిదా.. నార్మల్ ఆయిల్ తో మసాజ్ చేస్తే మంచిదా అనేది చాలా మందికి ఉండే డౌట్. అయితే గోరువెచ్చగా ఉండే ఆయిల్ మసాజ్ చేయడం వల్ల.. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. కాబట్టి మరీ వేడిగా ఉన్న ఆయిల్ కాకుండా.. గోరువెచ్చగా ఉన్న ఆయిల్ మసాజ్ చేసుకోవడం మంచిది.

వారానికి ఎన్నిసార్లు ?
వారానికి ఒకటి రెండుసార్ల కంటే ఎక్కువ సార్లు ఆయిల్ పెట్టుకోకూడదు. కాకపోతే ఆయిల్ పెట్టాక కనీసం గంట లేదా రెండు గంటలు వదిలేయాలి. అంతకంటే ఎక్కువ సమయం జుట్టుకి ఆయిల్ ఉండాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువ సమయం జుట్టుకి ఆయిల్ ఉంటే.. అది మొటిమలకు కారణమవుతాయి. కాబట్టి.. ఎక్కువ సమయం జుట్టుకి ఆయిల్ ఉన్నా ఉపయోగం ఉండదు.

అమ్మాయిలు, అబ్బాయిలకు ?
అమ్మాయిలకు, అబ్బాయిలకు ఆయిల్ పెట్టే విధానం ఒకటే. ఎలాంటి తేడా ఉండదు. కాకపోతే.. మగవాళ్లకు ఎక్కువ ఆయిల్ పెట్టడం అవసరమవుతుంది.

ఏ ఆయిల్ జుట్టుకి మంచిది ?
జుట్టు ఆరోగ్యానికి, సంరక్షణకు కొబ్బరి నూనె చాలా మంచిది. జుట్టుకి ఈ ఆయిల్ పెడితే చాలా తేలికగా గ్రహించగలదని స్టడీస్ నిరూపించాయి.

ఆయిల్ పెడుతూ ఉంటే తెల్లజుట్ట రాదా ?
ఆయిల్ పెట్టడం వల్ల జుట్టు తెల్లబడకుండా ఉండదు. అది అపోహ మాత్రమే. జుట్టుకి రెగ్యులర్ గా ఆయిల్ పెట్టుకోవడం వల్ల.. జుట్టు సమస్యలు తగ్గిపోవడం మాత్రం వాస్తవం.

ఏయే ఆయిల్స్ మిక్స్ చేయాలి ?
రెండు మూడు ఆయిల్స్ మిక్స్ చేసి రాసుకుంటే మంచిదని చాలా మంది చెబుతుంటారు. అయితే ఏ ఆయిల్స్ మిక్స్ చేస్తే మంచిదనేది చాలామందికి తెలియదు. అయితే మిక్స్ చేయాలి అనుకుంటే.. కొబ్బరినూనె, నువ్వుల నూనె, ఉసిరి నూనె, మందారం మిక్స్ చేస్తే మంచిది. కొబ్బరినూనె, నువ్వుల నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.. అదే ఆమ్లా ఆయిల్ లో జుట్టుని బలంగా మార్చే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇక మందారం జుట్టుకి షైనింగ్ ఇస్తుంది.



Click it and Unblock the Notifications