For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై హెయిర్, చిట్లిన జుట్టును నివారించి, సూపర్ సిల్కీ గా మార్చే బనానా హెయిర్ మాస్క్

చిట్లిన జుట్టును నివారించుకోవడానికి హెర్బల్ మాస్క్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ హెర్బల్ మాస్క్ లో అరటిపండు ముఖ్యం. అరటిపండు వివిధ రకాల విటమిన్స్ కు పవర్ హౌస్ వంటిది.

|

జుట్టు డ్యామేజ్ అయ్యిందని ఎలా తెలుస్తుంది? సింపుల్ గా మీ జుట్టు చివర్లను చెంపలు(బుగ్గల)మీద సున్నితంగా అలా టచ్ కానివ్వండి. జుట్టు రఫ్ గా ఉంటుంది. రఫ్ గా మాత్రమే కాదు, చూడటానికి కూడా చాలా అసహ్యంగా కనబడుతుంది. ఈ రఫ్ హెయిర్ కు పరిష్కారం ఏంటి? అరటి హెయిర్ మాస్క్ వల్ల జుట్టు పొడి బారడం తగ్గుతుంది, చిట్లడం తగ్గుతుంది.

చిట్లిన జుట్టు చిక్కువడిన జుట్టుతో సమానం. జుట్టు చిట్లిందంటే సులభంగా చిక్కుబడుతుంది. జుట్టు చిట్లడానికి , చిక్కుబడినట్లు అవ్వడానికి కారణం జుట్టులో నేచురల్ మాయిశ్చరైజర్స్ తగ్గడమే.

Banana Hair Mask To Repair Split Ends & Really Dry Hair!,

జుట్టులో కూడా లేయర్స్ ఉంటాయి, ఇవి డ్యామేజ్ వ్వడం వల్ల జుట్టు రెండు లేదా మూడు ఫ్రాగ్మెంట్స్ ను చిట్లడానికి కారణం అవుతుంది. చిట్లిన జుట్టును నివారించుకోవడం ఎలా? ఎక్కువ సార్లు తలకు బ్రష్ చేయడం, ఓవర్ గా వినియోగించిన కెమికల్ ప్రొడక్ట్స్ ను జుట్టుకు ఉపయోగించడం, బ్లో డ్రయ్యర్ ను ఉపయోగించడం వల్ల వల్ల కూడా జుట్టు చిట్లడానికి కారణం అవుతుంది

చిట్లిన జుట్టును నివారించుకోవడానికి హెర్బల్ మాస్క్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ హెర్బల్ మాస్క్ లో అరటిపండు ముఖ్యం. అరటిపండు వివిధ రకాల విటమిన్స్ కు పవర్ హౌస్ వంటిది. అరటిపండ్లలో కార్బోహైడ్రేట్స్, నేచురల్ ఆయిల్స్ , పొటాషియం ఇది మూడు విధాలుగా పనిచేస్తుంది. క్యూటికల్స్ సీల్స్ చేయడం వల్ల జుట్టు చిట్లకుండా చేస్తుంది. రెండవది, హెయిర్ ఎలాసిటిని పెంచుతుంది, జుట్టును సిల్కీగా మార్చుతుంది. జుట్టు కోల్పోయిన్ నేచురల్ ఆయిల్స్ తిరిగి పొందేలా చేసి, డ్రైనెస్ ను తగ్గిస్తుంది.

బనానా హెయిర్ మాస్క్ ను ఉపయోగించి డ్రై హెయిర్ ఏలా నివారించుకోవాలో తెలుసుకుందాం..

స్టప్ : 1

స్టప్ : 1

అరపండు తీసుకుని, చిన్న ముక్కలుగా చేసి, ఫోర్క్ తో ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్ లా తయారుచేసుకోవాలి.

స్టప్ : 2

స్టప్ : 2

మరో బౌల్ తీసుకుని అందులో గుడ్డు మిశ్రమాన్ని పోయాలి. ఎగ్ వైట్ ను సపరేట్ చేసి , పచ్చసొనను స్పూన్ తో బాగా బీట్ చేయాలి. ఎగ్ యోక్ (గుడ్డు పచ్చ సొనలో)విటమిన్ ఎ, డి, ఇ మరియు కె లు అధికంగా ఉన్నాయి. ఇది హెయిర్ లాస్ ను నివారిస్తుంది, జుట్టును సూపర్ సిల్కీగా మార్చుతుంది.

స్టప్ : 3

స్టప్ : 3

ఇప్పుడు అరటిపండు పేస్ట్ లో గుడ్డు, కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, మూడు బాగా కలిసే వరకూ బీట్ చేయాలి. ఈ మిశ్రమంలో ఫ్యాట్స్, అధికంగా ఉండటం వల్ల తలను, జుట్టును శుభ్రం చేస్తుంది. చుండ్రు నివారిస్తుంది. హెల్త్ హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది.

స్టప్ : 4

స్టప్ : 4

చివరగా ఒక టేబుల్ స్పూన్ తేనె కూడా మిక్స్ చేసి స్మూత్ పేస్ట్ లా తయారుచేసుకోవాలి. తేనెలో ఉండే అమినో యాసిడ్స్ జుట్టుకు మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

స్టప్ : 5

స్టప్ : 5

బనానా హెయిర్ మాస్క్ రెడీ. ఇప్పుడు , దువ్వెనతో తలను చిక్కు, ముడులు లేకుండా దువ్వాలి. ఇలా దువ్వడం వల్ల బ్రేకేజ్ తగ్గిస్తుంది. మొదళ్ల నుండి చివర్ల వరకూ జుట్టును చిక్కు లేకుండా దువ్వాలి.

స్టప్ : 6

స్టప్ : 6

ఇప్పుడు కురులను చిన్న చిన్న పాయలుగా విడదీస్తూ బ్రష్ తో బనానా హెయిర్ మాస్క్ ను అప్లై చేయాలి. ఈ ఎగ్ యోక్ హెయిర్ మాస్క్ జుట్టు చిట్లకుండా రిపేర్ చేస్తుంది. అలాగే డ్యామేజ్ అయిన జుట్టును తిరిగి తీసుకొస్తుంది. ఈ హెయిర్ మాస్క్ జుట్టు మొత్తం కవర్ అయ్యే వరకూ అప్లై చేయాలి.

స్టప్ : 7

స్టప్ : 7

తర్వాత బన్ లాగా ముడి వేసుకోవాలి. తర్వాత షవర్ క్యాప్ ధరించాలి. ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. తలలో బనానా ఉండలు లేదా పేస్ట్ లేకుండా పూర్తిగా శుభ్రం చేసుకోవాలి.

స్టప్ : 8

స్టప్ : 8

తలస్నానం చేసిన తర్వాత ఎక్సెస్ వాటర్ ను పిండేసి, పొడి కాటన్ టవల్ తో తలను ఆర్పుకోవాలి. గాలికి లేదా ఎండలో తడి ఆర్పడం మంచిది. హెయిర్ బ్రోయర్ ను ఉపయోగించకపోవడమే మంచిది.

స్టప్ : 9

స్టప్ : 9

బ్లో డయ్యర్ ను ఉపయోగించాలనుకున్నప్పుడు, మీట్ ప్రొటెక్టింగ్ సెరమ్ ను జుట్టుకు అప్లై చేయాలి. డ్రయ్యర్ ను ఉపయోగించనప్పుడు, జుట్టుకు కనీసం 6 అంగులాలు దూరంలో డ్రయ్యర్ ఉండాలి. సాధ్యమైనంత వరకూ డయ్యర్ ను ఉపయోగించకపోవడమే మంచిది.

స్టప్ : 10

స్టప్ : 10

మరో చిట్కా: జుట్టు ఎక్కువ చిక్కబడి, డ్రైగా కనబడుతుంటే, కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని, జుట్టు చివర్లకు అప్లై చేయాలి.

 ముగింపు:

ముగింపు:

రెగ్యులర్ గా కండీషనర్ ను అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సిల్కీగా మరియు సాప్ట్ గా మార్చుతుంది. జుట్టు చిట్లకుండా నివారిస్తుంది. జుట్టు పొడవును బట్టి, ఒత్తును బట్టి హెయిర్ మాస్క్ ను రెడీ చేసుకోవాలి.

English summary

Banana Hair Mask To Repair Split Ends & Really Dry Hair!

Repair super dry and damaged hair with this banana hair mask!
Story first published: Friday, December 16, 2016, 11:18 [IST]
Desktop Bottom Promotion